Total Pageviews

Friday, October 16, 2015

ఈ కలలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక.

లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒకరోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుటూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగణు ప్రక్కన బాబా పటం చూచి, తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. సాయిలీలలు విని అతడు శిరిడీ వెళ్ళాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని గూడ శిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ రూ. 15/-లు అప్పు తీసుకొని బయల్దేరాడు. రైలులో కొందరు భక్తులతో కలసి, వీరుగూడ భజన చేసారు. తర్వాత శిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగాడు. లక్ష్మీచంద్ శిరిడీ చేరాక సాయి అతనిని చూపి, "వీడెంత టక్కరి! ఒకవంక భజన చేస్తూనే నన్ను గురించి యితరులను అడుగుతాడు. ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి" అని అతనితో, "నీ కల నిజమైందా లేదా? అప్పుచేసి శిరిడీ రావడమెందుకు?" అన్నారు.

ఒకసారి మద్రాసునుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేసారు. అందరూ బాబాయిచ్చే కానుకలకోసం చేస్తే, లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కాని అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికొక చిత్రమైన స్వప్నం వచ్చింది, అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే, పాపమనుభవించక తప్పదన్నారు బాబా, ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికంత విశ్వాసముంటే కన్నుమూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై, పోలీసులు చచ్చిపడియున్నారు. అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా, "వీరిని చంపినందుకు శిక్షపడుతుందిలే!" అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పటుకున్నాడు. ఆయన అతనిని మరొకసారి కన్నులుమూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, "మొదటి నమస్కారానికీ దీనికీ భేదమున్నదా?" అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోను, కాన్కలపై ఆశతోను, యీసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడతడు. "నీవు చాటుగా పంజా, తబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు గదా?" అడిగారు బాబా. అతడు సిగుపడి తన గురువైన సమర్థ రామదాసస్వామి దర్శనం కోరాడు. సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడతడు, "బాబా, మీరెంతో వృదులు. మీ వయస్సెంత?"
అన్నాడు. "ఏమిటి, నేను వృదుడినా? నాతో పరిగెత్తు చూస్తాను!" అని సాయి పరుగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది.
ఈ కలలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక.

0 comments:

Post a Comment