Total Pageviews

Friday, December 12, 2014

సాయిబాబా దర్శనం...

సాయిబాబాను చూడాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారు. అయితే తమ ఇష్టం వచ్చినట్లు చుట్టుముట్టేవారు కాదు. ఎవరైనా సరే తమ వంతు వచ్చేవరకు ఆగేవారు. బాబాకు కనుక ఇష్టం లేకుంటే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేసేవారు కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా బాబా దర్శనభాగ్యం కలిగేది కాదు. కనీసం ఆయన నామాన్ని కూడా స్మరించలేక పోయేవారు. 
సాయిబాబా మహా సమాధి చెందకముందు ఆయనను తృప్తిగా దర్శించుకోవాలని వెళ్ళిన ఎందరో భక్తులకు నిరాశే ఎదురైంది. తమ కోరిక తీరలేదని నిరాశగా చెప్పిన భక్తులున్నారు. అదృష్టవంతులకు మాత్రమే బాబా దర్శనభాగ్యం కలిగింది. 
తనను చూడాలని వచ్చిన కొందరు భక్తులను సాయిబాబా కొన్నాళ్ళు అక్కడే ఉండమనేవారు. ఎవరైనా భక్తులు బాబా వద్దు అంటున్నా వినకుండా బయలుదేరితే, మళ్ళీ వెనక్కి రావలసి వచ్చేది. అలాంటి అనుభవాలు ఎదురయ్యాక ఆయన సమ్మతిస్తేనే వెనక్కు వెళ్ళేవారు. ఇంకొందరిని పూర్తిగా షిరిడీలోనే స్థిరపడమని చెప్పేవారు. మరికొందరు అక్కడికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక పోయేవారు.
ఇప్పుడు సాయిబాబా మహా సమాధి చెందిన తర్వాత కూడా ఆయన అనుమతి ఉంటేనే షిరిడీ వెళ్ళగలరు. బాబా ఆజ్ఞ ఉంటేనే షిరిడీలో అడుగు పెట్టగలుగుతారు. సాయిబాబాను దర్శించుకోవాలంటే ముందుగా ఆయన దయ మనమీద ప్రసరించాలి అన్నమాట.

Tuesday, December 9, 2014

World's 1stever SAI Mandir after Baba Maha Samadhi

 
 
 

Tuesday, December 2, 2014

 https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEQ29hYlRJZlVaM1k/view?usp=sharing

Monday, December 1, 2014

అంజలి తో బాబా అనుభూతులు

 
 
అందరకి నమస్కారములు. చాలా ఆలశ్యముగా బాబా గారి అనుభూతులు మీతో పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. బాబా గారు దత్తాత్రేయ అవతారము అని మన అందరకి తెలుసు కదా. నేను ఫిబ్రవరి 2012 లో దత్తాత్రేయ స్వామి నాతో సేవ చేయించుకున్నారు. రోజు దత్తాత్రేయ స్వామి దగ్గర బయట వూడ్చి, ముగ్గు వేసేదానిని . అల వారము రోజులు చేశాను ఒక్క రోజు ఒక ఆంటీ గారు దత్తాత్రేయ దగ్గర సేవ చేయడము అంటే ఆయన అనుమతి నీకు వున్నట్టే అని అన్నారు. అలాగే అభిషేకము కూడా చేయించుకుంటారేమో అని అన్నారు. కానీ నాకు అంత ఆశ లేదు అని వూరుకున్నాను. ఒక రోజు తరువాత అభిషేకము కూడా చేసుకోండీ అని పూజారి గారు చెప్పారు. ఇంతకు ముందు ఒక అబ్బాయి చేస్తున్నాడు. తరువాత నన్ను కూడా చేయమన్నారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అంటే ఆయన సేవ చేయడము అంటే మాటలు కాదు. చాలా నిష్టగా వుండాలి. ఆడపిల్లలు దత్తాత్రేయ పెట్టుకోకూడదు అని నాకు చాలా మంది చెప్పారు. నేను అప్పుడు దత్తస్వామికి నేను ఇలా చెప్పాను. స్వామి నేను మీ దగ్గర ఏమి ఆశించి మీకు సేవ చేయను. మీకు నా సేవ నచ్చితే లేక నచ్చకపోతే వద్దు అని చెప్పండి నేను ఏమి బాధ పడను. ఎప్పటి లాగే ముగ్గు పెట్టి వెళ్ళి పోతాను అని చెప్పాను.   
అప్పుడు అక్కడ చేసే అబ్బాయి చెప్పాడు నువ్వు సేవ చేయి వచ్చి నాకు చెప్పాడు. రోజు వచ్చి చాలా బాగా దత్తాత్రేయ స్వామి అలంకరించిందని నాకు చాలా సంతోషంగా వుండేది. ఒక రోజు ఒక అమ్మాయి నా సేవ చూసి, రోజు సేవ చేసే అబ్బాయితో యిలా చెప్పింది ఏమిటి అమ్మాయి దత్తాత్రేయ సేవ చేస్తుంది ఆయన దగ్గర సేవ చేస్తే చాలా కష్టాలు ఎదురు అవుతాయి చేయవద్దు అని చెప్పింది. అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. పర్వాలేదు అండి కష్టాలు మనుషులకు కాక ఎవరికి వస్తాయి ఇక కష్టాలు పెట్టేది ఆ భగవంతుడే కదా నేను పడాలి అని వుంటే పడతాను కానీ సేవ మాత్రము వదులుకోను అని చెప్పాను. తరువాత కొంతమందికి నా సేవ నచ్చేది మరి కొంత మందికి నచ్చేది కాదు. చాలా మంది అనేవాళ్లు చాలా పుణ్యము మూటకట్టుకుంటున్నావు అనే వాళ్ళు నాకు పుణ్యము గురించి తెలియదు. నేను ఇష్టపడేది సేవ చేస్తున్నాను పుణ్యమో పాపమో నాకు తెలియదు అని వదిలేసే దానిని ఎన్నో సార్లు నన్ను దత్తాత్రేయ స్వామికి నా సేవ నచ్చినన్నుట్టుగా చూపించేవారు. నేను అంటే ఇష్టము అయితే దీపము వెలుగుతూ వుండాలి అని అనుకుంటూ వుండే దానిని సాయంత్రము వచ్చేసరికి దీపము వెలుగుతూనే వుండేది. నేను చాలా సంతోషించేదానిని. ఈ విషయము చాలా చిన్న విషయము కావచ్చు కానీ నాకు చాలా తృప్తిగా వుండేది. ఈ సేవ కోసము చాలా మంది పోటి పడే వాళ్ళు నాకన్నా ముందే వచ్చి ముగ్గులు పెట్టేవాళ్లు ఇది దత్తాత్రేయ స్వామి అనుమతి తోనే జరుగుతున్నది అనుకునేదానిని.
ఇలా కొన్ని రోజులు సేవ చేస్తువున్నాను. అబిషేకము అయిపోయింది మొత్తము వున్నాము అప్పుడు ఒక అంకుల్ వచ్చారు అమ్మ అయిపోయిందా అభిషేకము అని అడిగారు నేను ఆలోచించాను. ఆ పర్వాలేదు పాలు పోయండి అని చెప్పాను. పాలు పోసి వెళ్ళిపోయారు. అప్పుడు ఎప్పుడు సేవ చేసే అబ్బాయి నన్ను అడిగారు ఎందుకు మళ్ళీ పాలు పోయమ్మన్నారు అని అడిగాడు. అప్పుడు నేను వద్దు అంటే కోపము వస్తుంది ఏమో అని చేయమన్నాను అని అన్నాను సరే లే అని అన్నాడు. పాలు పోసిన వెళ్ళిన అంకుల్ పూజారి తో నా మీద చెప్పారు. ఏమిటది ఆడపిల్ల దత్తాత్రేయ ని అత్తుకుంది అసలు మీరు ఎలా సేవ చేయినిస్తున్నారు అని పూజారిని అడిగారు. వెంటనే పూజారి వచ్చి అమ్మ నువ్వు దూరంగా వుండు స్వామి ని అంటుకోవద్దు అని తిట్టి వెళ్ళి పోయారు. అప్పుడు నేను చాలా బాదపడ్డాను. నాకు తెలియకుండానే కోపము పెరిగిపోయింది కన్నీళ్లు కారుతున్నాయి సేవ చేసే అబ్బాయి నన్ను పిలిచి హారతి
యి వ్వు అని అడిగాడు. నేను యివ్వను అని చెప్పాను. ఏమిటది ఇంక సేవ చేయరా ఏమిటి ఏమయింది ఇంతగా బాదపడుతున్నారు అని అడిగారు కానీ నేను ఏమి మాట్లాడలేదు మొత్తం తానే చూసుకున్నారు గులాబిలతో అలంకరించాడు. అప్పుడు నేను దత్తాత్రేయ స్వామి ని చూస్తువుండి పోయాను. స్వామి నేను ఏమి తప్పు చేశాను నాకు అర్దం కావడం లేదు నేను ఆడపిల్ల గా పుట్టి తప్పు చేశానా? నేను మీ సేవ కావాలి అని ఎప్పుడు కోరు కోలేదు మీరే నాతో సేవ చేయించుకుంటూన్నారు. మీకు సేవ చేసిన ప్రతి సారి నన్ను ఎవరో ఒకరు ఏదో ఒకటి అనే వాళ్ళు అయిన నేను ఎప్పుడు ఏమి పట్టించుకోలేదు కానీ ఈ రోజు పూజారి నన్ను ఇలా అనేటప్పటికి నేను తట్టుకోలేక పోతున్నాను స్వామి. నాకు ఎప్పుడు అడగలేదు. నాకు మీరు ఇప్పుడే సమాధానము చెప్పాలి. నేను సేవ చేయాలి అంటే మీ పాదాల దగ్గర  వున్న గులాబీ నా దగ్గరకు వస్తుంది అని చెప్పాను. ఇక హారతి తీసుకున్నాను. ఇక తాళము వేయ బోతున్నాను. ఇంత లో సేవ చేసే అబ్బాయి ఎప్పుడు నాకు ఏమి ఇవ్వడు కనీసం ప్రసాదము కూడా ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది దత్త స్వామి పాదాల దగ్గర వున్న గులాబీ పువ్వుని నాకు ఇచ్చాడు. నాకు ఎంత సంతోషము అంటే మాటల ద్వారా చెప్పలేను. కానీ కొంచము బాద మాత్రము వుండి పోయింది. సాయంత్రము రాగానే పూజారి గారిని అడిగాను ఎందుకు తిట్టారు అని అడిగాను మీరు సేవ చేయమంటేనే కదా నేను చేస్తున్నాను అని అన్నాను అది ఏమి లేదు అమ్మ ని సేవ నువ్వు సేవ చేసుకో అని అన్నారు. ఐతే నన్ను ఎందుకు అన్నారు అని అడిగాను ఆ అంకుల్ మళ్ళీ అందరితో చేపతాడు అందుకే నేను కొంచం సేపు వద్దు అని చెప్పాను ఇక నీ సేవ నువ్వు చేసుకో అని అన్నారు. నాకు దత్త స్వామి చెప్పారు నేను చేసుకుంటాను అని చెప్పాను. భక్తి తో చేస్తే భగవంతుడు ఎప్పుడు మనయందు వుంటాడు. భగవంతుడి దృష్టిలో అందరం సమానమే. మనము ఎన్నో పూజలు చేస్తూవుంటము కానీ మనము అనుకున్న పనులు జరగవు అప్పుడు వెంటనే భగవంతుణ్ణి దూషిస్తాము. ఎంతయిన మనము మనుషులము కదా మన తప్పులని క్షమిస్తాడు. కానీ ఒక మాట ఎన్ని కష్టాలు వచ్చిన భగవంతుడిని మాత్రము మర్చిపోవద్దు మనము చేసిన పూజలు ఎప్పుడో ఒకప్పుడు ఆదుకుంటాయి దైర్యముగా వుండండి. ఒకరికి సహాయము చేయక పోయిన పర్వాలేదు అపకారము మాత్రము చేయకండి.
కానీ అందరకి ఒక మాట చెపుతున్నాను ఎప్పుడు సేవ చేసేవాళ్ళు సేవ చేయక పోతే మనం ఎలా బాధ పడతామో అలాగే భగవంతుడు కూడా చాలా బాధ పడుతారు.  నేను ఎలా చెప్పాను అంటే నవంబర్ 2012 లో మా నాన్న గారు మరణించారు. 20 రోజులు తరువాత నేను గుడికి వచ్చాను నేనే ఏ సేవ చేసే దానిని కాదు అలా చూస్తూనే వుండే దానిని చాలా సార్లు పూజారి గారు నన్ను అడిగారు దత్తాత్రేయ స్వామి దగ్గర ముగ్గు వెయ్యి అని చెప్పారు కానీ నేను వేసేదానిని కాదు. ఒక సారి దత్తాత్రేయ స్వామి కి నమస్కారము చేస్తువుంటే పూజారి గారు నన్ను అడిగారు ఏమిటి అమ్మ స్వామి మీద కోపమ లేక యింక ఏమిటి అని అడిగారు. అది ఏమి లేదు అని  అన్నాను ఐతే ముగ్గు వెయ్యి అని చెప్పి వెళ్ళి పోయారు. అప్పుడు నాకు అనిపించింది చాలా మంది పోటీ పడే వాళ్ళు అలాంటిది వాళ్ళను ఆడగకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు అనిపించింది. అప్పుడు దత్త స్వామిని చూస్తూ సరే స్వామి నేనే వచ్చి చేస్తాను అని చెప్పాను. చూసారా మన సేవ ఆయనకు కావాలి అని వేరే వాళ్ళతో చెప్పించారు.
మన సేవ ని ఎప్పుడు మరవవద్దు. ఎవరు ఏమి అనుకున్న మీ సేవ మీరు చేయండి. అప్పుడు కొన్ని రోజులు చేయలేక పోయాను. ఆ సేవ వేరే భక్తురాలు చేసుకుంటుంది. ఇప్పుడు నా సమయము అంతా బాబా అవతారమైన కృష్ణుడు సేవ లో వుండి పోయాను. మీ అందరితో ఆ కృష్ణ లీలలు మీతో పంచుకుంటాను త్వరలో.
మీ

అంజలి