Total Pageviews

Tuesday, July 5, 2016

ఆమె వాల్వు మార్పిడి గురించి బాబా కు తెలుసు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
(రాబోయే రెండు లీలలలో సునీతను బాబా వాల్వు మార్పిడి ఆపరేషన్ సమయంలోనూ, ఆ తరువాతా ఎలా కాపాడారో చదువుతాము)
సునీతా అరోటే తన భర్తతోనూ కూతురుతోనూ బొంబాయిలో నివసిస్తుండేది. కొంతకాలంగా ఆమె బాగా అలసిపోతోంది మరియూ ఊపిరి తక్కువవుతోంది. పరీక్షలకోసం ఆమె బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. సంపూర్ణమైన పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు ఆమె భర్తతో సునీతకి గుండెకి సంబంధించి ఎడమవైపు వాల్వు సరిగా పనిచేయడం లెదనీ, దానిని మార్చాల్సి వుంటుందనీ చెప్పారు. అయితే ఆమె ప్రస్తుతమున్న పరిస్థితులలో వాల్వుమార్పిడి ఆపరేషన్ వలన ప్రమాదముందనీ, కానీ ఎంత తొందరలో చేస్తే అంతమంచిదనీ చెప్పారు.
సునీత భర్త ఈ వార్త ని ఆమెకి చాలా సున్నితంగా చెప్తూ జాగ్రత్తగా చూసికోడానికి బాబా వున్నారని విశ్వాసాన్ని కలిగించాడు. సునీత కన్నీరు మున్నీరయ్యింది, కానీ నిర్ణయం తీసికోక తప్పని పరిస్థితులలో వాల్వుమార్పిడి చికిత్సకి తేదీని నిర్ధారించారు. రెండురోజుల ముందు ఆసుపత్రిలో చేరింది. తనతో పాటుగా చిన్న సైజు బాబా ఫొటోగ్రాఫ్ తెచ్చుకుంది. మంచం పక్కనే వున్న బల్లమీద ఆ ఫోటోని పెట్టుకుంది. బాబా విభూతిని తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ని కూడా తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ఆమె ప్రతిరోజూ చదుగుతుంది.
ఆపరేషన్ కి ముందురోజు రాత్రి ఆమె ఒక స్పష్టమైన స్వప్నాన్నిగాంచింది. ఎందరో రోగులున్న అతి పెద్ద వార్దులో ఆమె ని చేర్చారు. అక్కడ ఎందరో వున్నారు, అందరినీ ఆమె నిశ్సబ్దంగా గమనిస్తోంది. ఇంతలో ఒక ఎనిమిది సంవత్సరాల బాలుడు ఆ జనాన్ని దాటుకుంటూ ’ఇక్కడ షిరిడీనుండొచ్చిన అరోటే ఎవరు’ అని అరుచుకుంటూ వచ్చాడు. సునీత వివాహానికి ముందు షిరిడీలో వుండేది. అందువలన ఆమె చేయెత్తి నేనే షిరిడీనుండొచ్చిన అరోటేను. అంది.  అప్పుడు ఆ కుర్రవాడు ’బాబా నన్ను పంపించారు. నీకు ఏ వాల్వు మార్చాలి, కుడిదా? ఎడమదా?’ అని ప్రశ్నించాడు. ఆమె జవాబు విన్న వెంటనే అంతే వేగంగా ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు. ఆమె భర్త వచ్చినప్పుడు ఆమె తన స్వప్నానుభవం గురించి అతనితో చెప్పింది. అతనామెకి బాబా కి ఆమె ఆపరేషన్ గురించి పూర్తిగా తెలుసునని నమ్మకాన్ని వ్యక్త పరిచాడు. అప్పుడు సునీతకు బాబా తనతో ఎప్పుడు వుంటాడనీ తనకు అపకారం జరగదనీ విశ్వసించింది.
ఆపరేషన్ జరగాల్సిన రోజు ఉదయాన్నె లేచి బాబా ని ప్రార్దించింది. అష్టోత్తర శత నామావళి చదువుకుంది. బాబా ఉనికి అనే సుగంధం తో ఆమె గదంతా పరిమళించసాగింది.  బాబా తనతోనే ఆ గదిలో వున్నారని సునీత విశ్వసించింది. ఆమె ఆపరేషన్ విజయవంతమైందని వేరేగా చెప్పాలా?
సాయిప్రసాద్ పత్రిక (దీపావళి సంచిక) 1998.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

బాబా మళ్లీ మళ్ళీ హనుమాన్ చాలీసా పఠించమన్నారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
న్యాయవాది ఎస్ సుబ్బారావు 1946 జూలై పదిహేడవ తేదీన మరల అస్వస్థతకి గురయ్యారు. ఉదయం నిద్రనుండి లేవడమే జ్వరంతో లేచాడు. అంతకు ముందురోజు కూడా వంట్లో బాగుండక పోవడం వలన కేవలం ద్రవ ఆహారమే తీసికున్నారు. ఆ రాత్రి నిద్రపోయేముందు బాబాని ధ్యానించి బాబా కృపనర్దించాడు. బాబా ఆయన ప్రార్దనని మన్నించి స్వప్న సాక్షాత్కారమిచ్చి హనుమాన్ చాలీసాను మళ్ళీ మళ్ళీ పఠిస్తూ వుండమన్నారు. ఒక్కో హనుమాన్ చాలీసా పఠనం పూర్తవగానే సుబ్బారావు కొద్ది కొద్దిగా నెమ్మళించసాగాడు. మొత్తము మీద ఆరోజు చివరి సారి హనుమాన్ చాలీసా పఠనం పూర్తయే సరికి సుబ్బారావు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
పద్దెమిదవ తేదీ రాత్రి మళ్లీ బాబా స్వప్న దర్శనమిచ్చారు. స్వప్నంలో బాబా మరియూ సుబ్బారావు ఒకచోట జరిగే డిన్నర్ పార్టీకి అహ్వానించబడ్డారు. బాబా ఒక న్యాయవాది రూపంలొ సుబ్బారావు పక్కనే కూచుని సుబ్బారావు క్షేమాన్నడుగసాగారు. బాబా సుబ్బారావుని హనుమాన్ చాలీసా ను పఠించవలసిందిగా ప్రోత్సహించసాగారు. బాబా చూపిన ప్రేమాభిమానాలకి సుబ్బారావు చలించిపోయాదు. బాబా తనకి ఎదురైన చిన్నా పెద్దా సమస్యలను తొలగించారని సుబ్బారావు చెప్పుకొచ్చాడు. బాబా మరియూ హనుమంతుడు వేర్వేరు కాదనీ, ఒక్కరే అనీ పై స్వప్న దర్శనం ద్వారా ఋజువైందని సుబ్బారావన్నాడు.
ఇక్కడొక ఆసక్తికరమైన ఉపాఖ్యానం గుర్తుకు వస్తోంది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లోని నలుబై అయిదవ అధ్యాయంలో ఈ ప్రస్తావన వస్తుంది. రామనామ ధ్యానం లో లీనమైపోయిన హనుమంతులవారిని శ్రీపాద శ్రీ వల్లభులు కలుస్తారు. వారిరువురి నడుమ ఈ దిగువ సంభాషన జరిగింది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము నుండి యధాతధంగా ఆ సంవాదాన్ని పఠితుల సౌకర్యార్దము ముందుంచుతున్నాను. ’నాయనా! అగ్ని బీజమైన ’రాం’ అనుదానిని ఎన్నికోట్లసార్లు జపించితివో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్ప కాలమైనను కూడా అంత స్వల్పకాలంలో కూడా ’రాం’ భీజమును ఉఛ్ఛరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారే తేల్ల మొగము వేయుచున్నారు. మహా అనంతమైన మహా శూన్యకాలమున కూడా కోటానుకోట్ల రామ నామమును ఉఛ్ఛరించుచున్నావు. అందుకే నీవు కాలాతీతుడవైనావు. కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయటకు చిత్రగుప్తునికి తోచుట లేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరించవలెను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయు సమర్ధుడవగుటచే నీవు సాయీ నామమున విఖ్యాతుడువయ్యెదవు గాక’ అన్నారు శ్రీ పాద శ్రీ వల్లభుల వారు.
అందుకు హనుమ ’ప్రబూ! ’రాం’ బీజము అగ్ని బీజమే, నాకు అగ్ని సిద్ధి అయిన మాటయూ వాస్తవమే! నేను అగ్ని యోజనమున పరిపూర్ణుడనైతైననినదియునూ వాస్తవమే! దేహబుద్దిచేత నేను మీ దాసుడను. జీవబుద్ధి చేత మీ అంశమును. ఆత్మ బుద్ది చేత మీరే నేనయి వున్నాను. నేను ఏ రూపమున అవరతింపవలయునో తెలియజేయవలసింది’ అని వేడుకున్నాడు. శ్రీ పాదుల వారు మందహాసంతో ఇట్లనిరి ’నీవు శివాంశ సంభవుడైననూ రామభక్తుడవయితివి. భళీ! అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి. అహ్ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు. అందుచేత అల్లాహ్ అనగా శివ శక్తుల సంయుక్త స్వరూపమని అర్దము. ఇంతకాలమూ జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేఛ్ఛజనులకు అంగీకారయోగ్యమైన, శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచూ నన్ను శివశక్తిగా ఆరాధించుము’.అంతట హనుమ ఇట్లనెను “ప్రభూ! నాకు భరధ్వాజ మహర్షి త్రేతాయుగమున సవితృకాఠక చయనమును పీఠికాపురమున చేసెదననునది తెలియును. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమునూ తెలియును. నేను మీ నుండి ఎట్టి పరిస్థితులలోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కాదా’ ఆన్నాడు.
అంతట శ్రీ పాదుల ’నాయనా! హనుమా! నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగును గాక’ అనిరి. హనుమ మరల ఇట్లనెను ’అల్లామాలిక్! అనగా అల్లాయే యజమాని అని అర్దము’ శ్రీ పాదుల వారు హనుమను కౌగలించుకొనిరి, ’హనుమా! నీవు దేహబుద్దిని వీడుమ, నీవు నా అంశవు’. అనెను. అంతట హనుమ ’ప్రభూ! నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూల తత్త్వములో కలిసి పోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించెడ అంశావతారము మూల తత్త్వముతో నిరంతరమూ కలిసియుండియూ, ఆది మూలమైన మీ తత్త్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను’ అని విన్నవించుకున్నారు. అంతట శ్రీ పాదుల వారు’ నాయనా! హనుమా! నీవు కడుంగడు బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రాభవములు నా యందుకలవో అవన్నియునూ నీ యందు కూడా నెలకొనియుండుగాక. నేను నృశింహసరస్వతి రూపమున శ్రీశైలము నందలి కదళీ వనములో గుప్తముగా మూడువందల సంవత్సరములు యోగ సమాధిలో వుండెదను. అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్ధుడనెడి పేరుతో విఖ్యాతుడునయ్యెదను. నేను శరీరము వదిలెడి సమయము ఆసన్నమైనప్పుడు, సాయి రూపమున వున్న నీలోనికి అవతరించెదను, సుస్పష్టముగా నా అవతారము నీలొ వున్నదని ప్రకటించెదను. నీవు నాయొక్క సర్వ సమర్ధ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు’ అని ఆశీర్వదించిరి. ’ప్రభూ! దేహబుద్దితో మీ సేవకుడను కావున అల్లా మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్దితో మీ అంశనై గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీ చరణులు దత్త ప్రభువులు కదా! మీకునూ,నాకునూ అంతరముండుట భావ్యమా? నేను మీరుగా, మీరే నేనుగా మారిన యెడలనే కదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాయిజ్యమును ప్రసాదింపుడు’ అని హనుమ వేడుకొనెను.
శ్రీ పాద శ్రీ వల్లభుడు కాల పురుషుని తమ వద్దకు హాజరు కావల్సిందని శాసించిరి. కాల పురుషుడు చేతులు కట్టుకుని నిలబడి యుండేను. అంతట శ్రీ మహా ప్రభువులు ’కాల పురుషా! ఈ హనుమ, కాల పురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాయిజ్యమును ప్రసాదించదలిచితిని. ఇతనికి నాధ శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటినుండీ ఇతడు సాయినాధుడని పిలువబడు గాక. నేడు దత్తజయంతి గా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్తస్వరూపము చేయవలసింది’ అని ఆజ్ఞాపించిరి.
సుబ్బారావు అనుభవము సాయిసుధ సంపుటి: 7, భాగం: 4 సెప్టెంబరు 1946 నుండి (శ్రీ పాద, హనుమల సంవాదం శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము, అధ్యాయం: 45 యధాతధముగా)
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి

source from  http://saileelas.com/telugu/2016/07/04/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%80-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D/

స్వప్న దర్శనంలో విభూతిని తినమని బాబా అతనికి చెప్పారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
1942 జూన్ మాసం లో గూటికి చెందిన న్యాయవాది ఎస్. సుబ్బారావు తరచు విపరీతంగా తల తిరిగేది. ఈ కారణం చేత ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయే పరిస్థితి ఏర్ఫడింది. అరవై ఆరు సంవత్సరాల వయసులో ఇలా జరగడం వలన బయటకు వెడితే పడిపోతారేమొనని భయపడాల్సివచ్చింది. కర్రపట్టుకుని నడిచే ప్రయత్నం చేద్దామనుకున్నారు, కానీ అదికూడా రెండుమూడు సార్లు కర్రవున్నా రోడ్డుమీద పడడంతో పనిచెయలేదు. దాంతో సుబ్బారావు తను ఇంటికే పరిమితం అయిపోవాల్సివస్తుందని భయపడ్దారు. పరిస్థితి 1946 జూలై 4 నాటి రాత్రికి విషమించింది. అతను ఇంట్లో పడుకునివుండగా విపరీతంగా తలతిప్పింది. తను బయటకు పోవడానికి భయపడుతూ వుండడంతో బాబా ను మనస్పూర్తిగా ప్రార్దించాడు,
తెల్లవారుఝామున బాబా స్వప్న దర్శనమిచ్చారు. బాబా న్యాయమూర్తిగా ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుని వుంటే సుబ్బారావు ఆయన ముందు నిలబడి వున్నాడు. బాబా సుబ్బారావుకి ఒక పెద్ద విభూతి ప్యాకెట్టు ఇచ్చి దానిని పెద్ద సంఖ్యలో తినమన్నారు. ఆ తరువాత సుబ్బారావు ఇంటికి తిరిగి వస్తూండగా ఒకభక్తుడు అతనికి ఒక చిన్న విభూతి పొట్లం ఇచ్చాడు. ఆ విభూతి పొట్లాన్ని ఆ భక్తుడు సుబ్బారావు పై జేబులో పెట్టాడు. సుబ్బారావుకి ఈ స్వప్నం వలన అర్దం అయినదేమిటంటే విభూతి ని అత్యధికంగా వాడితే తన తలతిప్పువ్యాధి తొలగిపోతుందని. అప్పటినుండి తన జేబులో చిన్న విభూతి పొట్లాన్ని సుబ్బారావు వుంచుకునేవాడు. సుబ్బారావు కోలుకున్నాడు తన పనులకి హాజరవసాగాడు.
సాయ సుధ, సంపుటి:7, భాగం: 4, సెప్టెంబరు 1946.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

Thursday, June 2, 2016

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి 
శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాధుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు వున్నాయి. అహ్మద్‌నగర్‌ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదాలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో వుండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి.. 
షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా వుండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్‌... తదితరులు ఆయన శిష్యగణంలో వుండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిరప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్‌, లెండి గార్డెన్స్‌... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్మాత్మిక భావం అలముకుంటుంది. సాయి సంస్థాన్‌ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
వసతి సౌకర్యం 
* సంస్థాన్‌ వారు అనేక వసతి సముదాయాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చు, 
* ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా వున్నాయి. భక్తులు వారి ఆర్థిక స్థోమతకు తగినట్టుగా గదులను తీసుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు 
* దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది. 
* హైదరాబాద్‌ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు వున్నాయి. 
* అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేవారు దిగివలసిన స్టేషన్‌ నాగర్‌సోల్‌. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు వుంటాయి. 
* సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు. 
* షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 
* ఔరంగాబాద్‌ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.

Sunday, May 29, 2016

దీర్ఘరోగాలు ఉపశమనం కొసం ......!!

దీర్ఘరోగాలు ఉపశమనం కొసం ......!!
ధుని ముందు కూర్చున్న సాయినాథుని చిత్రపటం దగ్గర రోజూ చిటికెడు వీభూది వేసి, నమస్కారం చేసి దాన్ని ధరిస్తుండడం వల్ల దీర్ఘరోగాలు ఉపశమిస్తాయి.

Thursday, May 26, 2016

షిరిడీలో నివాసం.........!!

తన మసీదు వరండాలో సాయిబాబా 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.
ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించేవారని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.
తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. ‘నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది’ అని జ్ఞానికి తెలుసు. ‘నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది’ అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.

Thursday, March 24, 2016

అమృతతుల్యమగు బాబా పలుకులు......

దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పరు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే ధ్యానిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినారో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరయితే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం అహంకారం లేశమైన లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి. ఓం సద్గురు సాయిరాం ॐ 🌿

Wednesday, March 23, 2016

ఎంతెంత దయ నీది ఓ సాయి

ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు
నుడులకు అందవు నుతులకు పొంగవు
పాపాలు కడిగేసే పావను గంగవు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా...ఆ..
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే
మారుతి నీవే గణపతి నీవే
సర్వదేవతల నవ్యాకృతి నీవె
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి

జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా...

మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు.
సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి? అనుకున్నారు. బాబా యథావిధిగా వ్యాపారుల వద్దకు వెళ్లి నూనె అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. తమ వద్ద నూనె లేదని చెప్పారు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహం వారిలో కలిగింది.
బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్యాచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.
బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్

Monday, March 21, 2016

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే...


షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, ఆ నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి చేరుకున్నారు. కుండలోని మంచినీటిని తీసుకుని గిన్నెలో పోసి, ఆ నీటిని ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు. ఇది గమనించిన వ్యాపారులకు, సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు, సాయిబాబా దైవాంశభూతుడన్న నమ్మకం ఏర్పడింది. బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు. కిరోసిన్ దొరికేది కానీ, ఏరోజు కూడా బాబా కిరోసిన్‌తో మసీదులో దీపాలను వెలిగించలేదు. నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతోపాటు, వాటి వెలుగు శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనస్సును ఏకాగ్రతతో భగవంతుడిపైన కేంద్రీకరించడానికి వీలు ఉండటం వల్ల, బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలను వెలిగించేవారు. అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి సాయిబాబాను ప్రార్థించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపారాధన చేస్తే సఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

Wednesday, March 2, 2016

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల.

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.

1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు చేరాను. మా అమ్మ్గగారిల్లు స్టేషన్ దగ్గరే. పిల్లలను సముదాయిస్తూ నాలో నేను కుమిలి పోతూ గడుపుతున్న రోజులవి.మామూలు మనిషిని కాలేక పోతున్నాను. కానీ పిల్లలభవిష్యత్తు కోసము నన్ను నేను సమాధానపరుచుకొని బ్రతకవలసి వస్తున్నది. ఇంకా ఉద్యోగము కూడా ఇవ్వలేదు ఆర్మీ వాళ్ళు.

అలాంటీ రోజులలో ఒకరోజు గది లో విచారంగా నాలోకములో నేను వున్న సమయములో ఒక గొంతు హిందీ లో ఏదో అడుగుతున్నది. బయట మా పిన్ని గారు ఏదో చెబుతున్నట్లుగావుంటే బయటకు వచ్చాను. ఒక భిక్షుకుడు మావాల్లను టీ కావాలని అడుగుతున్నాడు.వాళ్లకు హిందీ అర్ధం కాక ఏమిటని అడుగుతున్నారు. ఆ కారం చూస్తే పాతగుడ్దలతో సాయిబాబా లా వున్నారు. కానీ నాకప్పటికి సాయిగురించి పెద్దగా వివరాలు కానీ ,భక్తి కానీ లేవు. కాకుంటే యాచిస్తున్నాడు కదా అని ఉండు మాయింట్లోవున్నాయి పెట్టిస్తాను అనిలోపలకు పోబోయాను. మరి నాకిస్తే అక్కడ నాకోసం కాచుకున్నవారికి కావాలికదా? కనుక కొద్దిగా టీపొడిఇవ్వు అన్నాడు. తెచ్చి ఇచ్చాను.మరి చక్కెర కావాలి కదా? అన్నాడు.కొద్దిగా పొట్లం కట్టి తెచ్చాను. బేటీ ఇవి కాగపెట్టాలి కదా ఒక చిన్న గిన్నెఇవ్వు అన్నాడు.తెచ్చి ఇస్తున్నాను.మా సంభాషణ హిందీ లో సాగుతున్నా మా పిన్ని కి అర్ధమవుతున్నందున పాలువద్దా అన్నది వెటకారం గా. వద్దు మేము డికాక్షన్ కాచుకుని తాగుతాము అన్నాడాయన.వెళ్ళి పోయాడు.

మరలా ఒక అర్ధగంటకు వచ్చి నేనిచ్చిన పాత్ర తిరిగిచ్చాడు. మా ఆవిడకు కావాలి ఒక చీర ఇవ్వు అన్నాడు. ఒక చీర దండెం మీదనుంచి తెచ్చి ఇచ్చాను. అప్పూడు నెనొక్కదాన్నే వున్నాను. ఆయన నన్ను చూస్తూ నువ్వు నాకోసం ఇన్నిచ్చావుకదా ? మరి నెను కూడా నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకేమొద్దు లే వెళ్ళు అన్నాను[మనసులో కొద్దిగా భయం. ఈ సన్యాసులు లాంటివాళ్ళు ఏమి మోసము చేస్తారో అని.] కాదు ఇదిగో చూడు తీసుకోఅని ఆయన నాచేతిలో తనగుప్పిటనుంచి ఏదో పెట్టాడు. నాకసలే భయం గావుంది. కానీ మాట్లాడ లేకపోతున్నాను. అమ్మ నువ్వు దీన్నిక్కడ వద్దు లోపలికెళ్ళీ నీ దేవుని మందిరం లోపెట్టి చూడు అన్నాడు. లోపలకెళుతూ గుప్పిటవిప్పాను. గుప్పున పూలపరిమళం గుభాళించింది. చేతిలో పూలు. చూసావా అన్నారు. ఏమీ లేవు పూలు అన్నాను నేను పెద్దగా .కాదు పూలకింద వున్నదాన్ని చూడు నిన్ను రక్షిస్తుంది దాన్ని భద్రంగా దాచుకో అని పెద్దగా చెప్పాడాయన. ఇదేదో మాయలాగున్నది ఇదినాకొద్దు నీది నువ్వే తీసుకో అని చెప్పి ఇద్దామని బయటకొచ్చాను. కానీ అక్కడాయన లేరు. ఒకవేళ మళ్ళా స్టేషన్ వైపు వెళ్లాలన్న కనీసం రెండు నిమిషాలు పడుతున్నది. కానీ కనుచూపు మేర ఆయన కనిపించలేదు.గుప్పిటలో ఒక తాయెత్తులాంటి వస్తువు వున్నది భయం తో దాన్ని తీసుకెళ్ళీ దేవునున్పటాలముందు పడవేశాను.

ఆ తరువాత మనసుకు కాస్త ఉపశమనముగాను జీవితము మీద పిల్లలమీద ప్రేమ పెరిగాయి బాధ్యతలు నిర్వర్తిమ్చగలననే గుండెనిబ్బరము పెరిగాయి. తరువత గుర్తుకొచ్చి ఎన్ని సార్లు వెతికినా ఆమహాను భావుడిచ్చిన తాయెత్తు కనపడలేదు. వారు సాయిబాబా అనే నమ్మకము నాకుకలిగినది. తరువాత వారిని పూజించసాగాను. నాకు ఆర్మీ లోనే యు.డి,సి. గా పోస్ట్ ఇచ్చారు. సికిందరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ముగ్గురు పిల్లలు పెద్దవాల్లయి దేశరక్షణ కోసం వున్నారు. ఇద్దరికి పెళ్ళిల్లు చేశాను. నా ఇష్టదైవమయిన లలితాదేవితో పాటు,సద్గురువు సాయినాధుని గురువుగా మార్గదర్శకునిగా సేవిస్తుంటాను.......

నను దీవించు సాయి! నను దీవించు సాయి

🌹🌻🌹ఓం శ్రీ సాయి నాథాయనమః 🌹🌻🌹
నను దీవించు సాయి! నను దీవించు సాయి
నీ శిశువును దీవించు సాయి
నా మొరలను వినుము
నాలో భక్తిని స్దిరపరచుము సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
నా భాదలు తీర్చుము సాయి
ఆనందము నాలో చిలుకుము
నా పాపాల ప్రార్ధన వినుము సాయి
నన్ను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయి నామమే జీవనము సాయి స్మరణమే ప్రార్ధనము
సాయి ఆరాదనలే ఆనందము సాయి పలుకులే కీర్తనము
సాయి దర్శనమే భాగ్యము సాయి లోకమే స్వర్గము సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయి నామమే పలకరించుట తృప్తి
సాయి మార్గము ఆచరించుటే మనఃశాంతి
సాయి రూపమే భగవంతున్ని ఆవతారము
సాయిరామే అంతము సాయిరామే విశ్వము
సాయిరామే కరుణామూర్తి సాయిరామే వివేకస్పూర్తి సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయియే సత్పవర్తన సాయియే మోక్షమార్గము
సాయియే కర్తవ్యం సాయియే పరమ సత్యము
సాయియే యేసుక్రీస్రు సాయియే హిందుమనుజుడు
సాయియే ఇస్లాం దేవుడు సాయియే అంతరాత్ముడు సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయియే బ్రహ్మ విష్ణు స్వరూపుడు
సాయియే నిరాడంబరుడు సాయియే మాతా పితా గురుదేవుడు
సాయియే ప్రాణ జీవుడు,సాయియే ఆత్మారాముడు సాయి
నను దీవించు సాయి! ననుదీవించు సాయి
ఓం శ్రీ సాయిరాం
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏 ...

సాయి నామంతో సుఖశాంతులు....!!

భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా.
సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు.
ఒక సందర్భంలో సాయిబాబా "నేను బానిసల్లో బానిసని. నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు..." అన్నారు.
సాయిబాబా తన నడవడినే మనకు ఆదర్శంగా చేసి చూపారు. మనం ఆయన్ను అనుసరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఒక్కరోజులో సర్వం వంటబట్టకున్నా క్రమక్రమంగా ఒక్కో లక్షణాన్నీ అలవరచుకోవచ్చు.
భగవంతునికి లేని సంపదలు అంటూ లేవు. ఆయన జ్ఞానానికి, కీర్తికి ఆకాశమే కొలమానం. దేవుడు మహా మహిమాన్వితుడు. భగవంతునికి ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవు. కానీ అందరిమీదా ఔదార్యం చూపిస్తాడు.
మనం ఈ లోకలో అడుగుపెట్టింది జలసాలు, విలాసాలతో కాలక్షేపం చేస్తూ, సమయాన్ని వ్యర్ధం చేసుకోడానిక్కాదు. భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు, భగవంతుని చేరుకునే మార్గం సులభమైందేమీ కాదు. అది కొంచెం కష్టంతో కూడుకున్నదే. అభ్యాసంతో తేలికౌతుంది. సద్గురువు చేయి పట్టుకు నడిస్తే మరింత సులభసాధ్యమౌతుంది.
సాయిబాబా తనను దైవంగా చెప్పుకోక గురువుగా భావించమని మాత్రమే అనేవారు. బాబా సద్గురువు మాత్రమే కాదు, భగవంతుడేనని ఆయనతో కలిసి జీవించిన చాలామంది విశ్వసించారు. బాబా లీలలు మనలో చాలామందికి అనుభవమౌతున్నాయి.
సాయిబాబా చూపిన వినమ్రత, దయ, కరుణ, ఔదార్యం మొదలైన అద్భుత గుణాలను మనమూ అలవరచుకుందాం. వ్యర్థ విషయాలతో కాలాన్ని హరింపచేయకుండా, సాయి భగవాన్ నామస్మరణతో సద్వినియోగం చేసుకుందాం. జీవితాన్ని సార్ధకం చేసుకుందాం. సాయి నామం సుఖశాంతులనిస్తుంది.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్