Total Pageviews

Sunday, October 25, 2015

దీపాల వింత (క్రీ.శ. 1886)

జడ_జీవాంచ్యా ఉద్ధారార్ధ! ఆపణ ఆలా శిర్డీత!!
పాణీ ఓతూన పణత్యాత! దివే తుమ్హీ జాళిలే!!
బాబా! జీవులనుద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి, తామసజనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. (శ్రీ సాయినాధ స్థవన మంజరీ 98 వ ఓవి).
శ్రీ సాయిబాబాకు దీపారాధనంటే చాలా ఇష్టం. మసీదులోనూ, దేవాలయాలలోనూ పుష్కలంగా దీపాలను వెలిగిస్తూ వుండెడివారు. ఆ దీపాలకు కావలసిన నూనెను వర్తకుల దగ్గరకు వెళ్లి అడిగి తెచ్చేవారు. కొంతకాలం ఉచితంగా ఇచ్చి విసుగెత్తిన వర్తకులు డబ్బులేకుండా నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. సుమరు 1886 సంవత్సరం ప్రాంతంలో తన దైనందిన కార్యక్రమానుసారం ఒకరోజు శ్రీ సాయి వర్తకులను నూనె ఇవ్వమని అడిగితే తమ వద్ద నూనె లేదని సమాధానమిచ్చారు. బాబా ఏమీ మాట్లాడకుండా మసీదుకు తిరిగి వెళ్లిపోయారు. తిడతారేమొనని ఊహించుకుని భయపడిన వర్తకులు ఆయన మౌనాన్ని చూసి సందిగ్దావస్థలో పడ్డారు. ఆ రోజున బాబా మసీదులో దేనితో దీపాలు వెలిగిస్తారో చూడాలనే కుతుహలంతో ప్రదోష సమయానికి మసీదుకు దగ్గరగా వుండే తుప్పల మాటున పొంచి, బాబా చర్యలను గమనిస్తూ వచ్చారు. మసీదు గట్టుపై నున్న రేకు డబ్బాలో నూనె అడుగున ఒక రెండు బొట్లు మాత్రమే వుంది. దాంతో వత్తులు కూడా తడవవు. అందువల్ల ఆ డబ్బాలో నీళ్లు పోసి కొంచెం త్రాగి, తిరిగి ఆ డబ్బాలోకి ఉమ్మేసి ఆ నీటితో ప్రమిదలు నింపారు. ఈ చర్యను చూసినవారంతా సాయిబాబా వెర్రి వాడని నిశ్చయించుకున్నారు. సాయి నీటితో తడిసిన వత్తులను వెలిగించారు. అవి నూనెలేకుండా రాత్రంతా వెలిగాయి. బాబా చూపబోయే సహస్రాధిక లీలలకు ఈ వింత చర్య నాంది పలికింది.
(శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర - డా. కె.నిష్టేశ్వర్, వి.జి.ఎస్. పబ్లిషర్స్)
షిరిడీలోీ జీవించినంతకాలమూ శ్రీ సాయి నిర్వహించిన అత్యంత ముఖ్యమైన కార్యమేదయినా వుంది అంటే దీపాలు వెలిగించడమే! శ్రీ సాయి బాబా పరమాద్భుతమైన ఈ లీలను ఎందుకు చేసారు? షిరిడీ పురవాసులకు తన గొప్పతనాన్ని చాటుకోడానికా? తద్వారా ఒక్కరోజులోనే గొప్పవాడయిపోదామనా?తనకి నూనెనివ్వడానికి నిరాకరించిన వర్తకులకు బుద్ది చెప్పడానికా? షిరిడీ సాయి ఇటువంటి మహిమలెన్నయినా చూపగలడని చాటుకోవడానికా?
కాదు, కాదు, కాదు ముమ్మాటికీ కాదు. మరి దేనికి?
వేచి చూద్దాం.......

0 comments:

Post a Comment