Total Pageviews

Thursday, August 28, 2014

సాయినాథునికి శతకోటి వందనాలు

సద్గురు సాయినాథునికి శతకోటి వందనాలు. జీవితంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. నిరంతర అలల తాకిడిని పోలిన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు.
కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు. ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి శతకోటి వందనాలు

0 comments:

Post a Comment