Total Pageviews

Wednesday, June 18, 2014

సింహపురి షిరిడి సాయిదర్బార్

 
 
 

సింహపురి షిరిడి సాయిదర్బార్
పిలిస్తే పలికే దైవం షిరిడి సాయిబాబా. కష్టాల్లో భక్తులకు వెన్నుదన్నుగా నిలిచేవాడు సాయిబాబా ఒక్కడే. బాబాకు భజనలంటే అమిత ఇష్టం. నగరంలోని పుట్టవీధిలో మధుసూదన్‌రావు ఇంటిలో సాయిబాబా భజనలు, సత్సంగం లు కోసం భక్తులు చేరేవారు. భజనలు చేస్తూ బాబాను కొలిచేవారు. 2000 ఫిబ్రవరి 24న సాయి భక్తురాలి పుట్టిన రోజున సందర్భంగా ఈ భజనలు ప్రారంభించారు. ఈ భజనలు రోజురోజుకు పెరుగుతూ ఆ గృహం దేవాలయంగా మారింది. 2001న కొందరు భక్తులు గురుపూర్ణిమ సందర్భంగా షిరిడిలోని ఆచారాల ప్రకారం రోజు నాలుగు వేళలు అభిషేకాలు, షిరిడి హారతులు చేయడం చేశారు.దీంతో భ క్తుల్లో సాయి మందిరం నిర్మించాలన్న ప్రేరణ కలిగింది. అలా అంతా కలిసి పద్మావతినగర్‌లో స్థలం కొనుగోలు చేశారు. 2012 జూన్ 27న పుట్టవీధి నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించి సాయిదర్భార్‌గా నామకరణం చేశారు. అనంతరం ద్వారకామయిలో బాబా వెలిగించిన ధుని నుంచి అఖండ జ్యోతిని తెచ్చి 2003 ఫిబ్రవరి 6న సాయిదర్భార్‌లో ధుని నిర్మాణం ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా «వెలుగుతూనే ఉంది.
భక్తులే కూలీలు..
షిరిడి సాయిబాబా విగ్రహం పద్మావతినగర్‌కు చేరుకోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద మందిరం నిర్మించాలన్న సంకల్పం పెరిగింది. వేదమంత్రాల మధ్య బాబా పాదాల వద్ద చీటీలు పెట్టి అనుగ్రహం కోసం భక్తులు ప్రార్ధించారు. పెద్ద మందిరానికి బాబా అనుమతి లభించింది. షిరిడిలో బాబా సమాధి, మందిరం కొలతలు ప్రకారం మందిర నిర్మాణంలో భక్తులే కూలీలుగా మారారు. అందుకే ఈ సాయిదర్భార్‌ను భక్తులు నెల్లూరు షిరిడిగా కొలుస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక పనివాళ్లను పిలిపించి సాయిదర్భార్ లోపలి భాగం అంతా సీలింగ్, గోడలు, దిమ్మెలు అద్దాలతో అలంకరించారు. అందులో బాబా లీలల దృ శ్యాలు, వివిధ దేవతల గాథలు స్మరించేలా దృశ్యాలు తీర్చిదిద్దారు. సాయిదర్భార్ అద్దాల మందిరంగా తీర్చిదిద్ది 2005 జూన్ 1న జైపూరు నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన బాబా విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ అద్దాల సాయిదర్బార్ మందిరం దర్శనీయ, ఆధ్యాత్మిక నిలయంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది.

ప్రత్యేకతలు
ప్రతినిత్యం భజనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సచ్చరిత్ర పారాయణం, ప్రతి మంగళవారం సాయిచరిత్ర సంపూర్ణ పారాయణం, షిరిడి హారతులు, ఉదయం క్షీరాభిషేకాలు, హారతులు జరుగుతాయి. ప్రతీనిత్యం భక్తుల సహకారంతో అన్నదానం జరుగుతున్నది.
సాంప్రదాయ పండుగలు
సాయిదర్భార్‌లో నిర్వహించే పండుగలన్నీ షిరిడి సాంప్రదాయంలోనే నిర్వహిస్తారు. నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, గురుపౌర్ణమి, సాయినాధుని నగరోత్సవం, గంధమహోత్సవం, విజయదశమిరోజు నక్ష త్ర హారతులు, సమాధి కీర్తనలు, దత్తజయం తి, ముక్కోటి, మహాశివరాత్రి, దీపావళి, వినాయకచవితి పండుగలు వేడుకగా జరుగుతాయి.
* ప్రతివారం సాయితత్వంపై సత్సంగాలు
* శ్రీసాయిదర్భార్ ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి భక్తులు షిరిడియాత్ర చేస్తారు.
* ఈ సాయిదర్భార్‌లో ధ్యానమందిరం ఉంది. బాబా స్మరణకు ఈ కేంద్రం ఎంతో మందికి ఉపయోగపడుతోంది.

0 comments:

Post a Comment