Total Pageviews

Wednesday, June 18, 2014

కలియుగం లో భగవన్నామ స్మరణే మోక్షమార్గం,

కలియుగం లో భగవన్నామ స్మరణే మోక్షమార్గం, అనేక రకములైన యజ్ఞాలు ఉన్నవి కదా, వాటిని నిర్వహించుట చాల శ్రమతోటి, ఖర్చుతోటి కూడుకోన్నట్టిది. ఏ మాత్రం ఖర్చు, శ్రమ లేనట్టిది, ఎవరైనా సులువుగా ఆచరించ దగినది నామజపము. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా యజ్ఞ యాగాదులన్నిటి లోను నేనే నామజప యజ్ఞాన్ని అని సెలవిచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పడం వలన నామజపము అతి పవిత్రమైన క్రతువుగా చెప్పబడింది. "నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారి కోరికలు నేను తీరుస్తాను" అని చెప్పారు బాబా. ఇంకా ఏమన్నారంటే, ఎవరైతే నన్నే మదిలో తలచుకొని నా నామాన్ని జపిస్తారో, నా కధలే వింటారో, నా లీలలను గానం చేస్తారో, వారిని కష్టాల కడలి నుండి గట్టేక్కిస్తాను. మృత్యువు నుండి కాపాడతాను. అత్యంత విశ్వాసంతో నన్ను ఆశ్రయించిన వారి ప్రారభ్ద కర్మల నుండి అధిగమింప చేస్తాను. నన్ను నమ్మండి. ఈ పకీరు ఎన్నడూ అబద్ధం ఆడడు."
నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని నిరంతరమూ రక్షించుటయే నా కర్తవ్యము అని బాబా భక్తులకు మాట ఇచ్చారు. సాయి ఎన్నడు మాట తప్పదు అని భరోసా కూడా ఇచ్చారు. మనం చేయవలసినది ఏమిటంటే అత్యంత విశ్వాసంతో సాయిని నమ్మి ఎంత పెద్ద ఆపద వచ్చినా ధైర్యం కోల్పోకుండా గుండె నిబ్బరంతో సమస్యను ఎదుర్కొని పోరాడాలి. ఎటువంటి విపత్కర సమయములో నైనా సాయిని స్మరిస్తూ " ఓ బాబా! నేను కష్టాలలో ఉన్నాను. నీవే నాకు రక్షా. నీవు తప్ప నాకు ఎవరు లేరు. రక్షించు తండ్రీ అని శరణాగతి వెడితే మనలను కష్టాల కడలి నుండి సురక్షితంగా బయట పడేస్తారు సాయి. ఇందులో సందేహం ఏమాత్రము లేదు.

0 comments:

Post a Comment