Total Pageviews

Saturday, April 12, 2014

సాయిబాబాతో నా అనుబంధము -------------- అంజలి.






అందరికి నా నమస్కారములు.నేను అనుభూతులని మీతో పంచుకుంటున్నది నా గురించి గొప్పగా చెప్పుకోవడం కోసము కాదు, నేను మంచిస్థాయికి వెళ్ళాలని కాదు. బాబాగారు కొందరికి కలలో కనిపించి కొన్ని మంచి విషయాలు చెబుతారు. విషయాలు మనము తప్పకుండా పాటించాలి. బాబా మన కోరికలను ఏలా నెరవేరుస్తారో మనము కూడా ఆయన కోరికలని నెరవేర్చాలి అని నేను అనుకుంటున్నాను. బాబాని నేను ఎప్పుడు దేవుడులాగ చూడలేదు, బాబాగారిని ఒక మంచి స్నేహితుడిలాగ, తాతలాగ, తండ్రిలాగ చూస్తాను. కోపము వచ్చిన, సంతోషము వచ్చిన,బాధ వచ్చిన, నేను బాబాకే చెప్పుకుంటాను. నాకు ఎల్లప్పుడు బాబా నాప్రక్కనే వున్నట్టు అనిపిస్తుంది. బాబాగారు తమ భక్తులని వదులుకోరు అని మీకు దీనిద్వారా తెలుస్తుంది.



బాబాగారు నా ప్రసాదాన్ని ఎలా తీసుకున్నారో చూడండి. ఇంతకముందు అనుభూతులలో చెప్పాను, షిరిడికి ఎవరు వెళ్ళుతున్నా నేను బాబాకి ప్రసాదము పంపిస్తాను. ప్రతి నెలలో నా ప్రసాదము 4,5 సారులు వెళ్ళుతుంది. ప్రతినెలా మా గుడిలో ఎవరో ఒకరు షిరిడి వెళ్ళుతుంటారు నాకు చెబుతారు. నేను వాళ్ళకి ప్రసాదము ఇచ్చి పంపుతాను. జనవరి 2014 మొదటివారములో నా ప్రసాదము మూడుసార్లు వెళ్ళింది. జనవరి 25 నా పుట్టినరోజు, అదే రోజు ఒక అబ్బాయిది కూడా పుట్టినరోజు. తను ఎక్కువుగా షిరిడి వెళ్ళతాడు, బాబా అంటే తనకు చాలా ఇష్టం నా ప్రసాదము ఎప్పుడు తీసుకొనివెళ్ళతాడు. అతను జనవరి 23 తారీఖున షిరిడి వెళ్ళతానని డిసెంబర్ నెలలో చెప్పాడు, మీరు వస్తారా అని నన్ను అడిగారు కాని నేను రానన్నాను. తరువాత అతను కనిపించలేదు. 23 జనవరి 2014 గురువారము తప్పకుండా గుడికి వస్తాడు, ప్రసాదం కోసము అడుగుతాడు అని ఎదురుచుస్తున్నా కాని అతను అడుగలేదు. నాకు చాలా బాధ అనిపించి ఆఫీసుకు వచ్చేసాను. నేను ఆఫీసుకు వచ్చానుగాని ఏపని చెయ్యలేకపోతున్నాను. ఎప్పుడు నా ప్రసాదం అడిగి తీసుకు వెళ్ళేవాడు నా పుట్టినరోజుకు ఎందుకు తీసుకు వెళ్ళడం లేదని. బాబాకు నా ప్రసాదము తీసుకోవడము ఇష్టము లేదా?ఏమి చెయ్యాలో అర్దం కాలేదునాకు చిట్లు వెయ్యడం అలవాటు. 2చిట్లు  రాసాను ఒకదాని మీద అబ్బాయికి ఫోన్ చెయ్యమని, ఇంకొక దానిమీద వద్దని రాసాను. చిట్లు ఎప్పుడు ఒకసారి తియ్యాలిగాని  నేను చాలాసార్లు వేసాను, చెయ్యవద్దు అని వచ్చింది. చిట్లు అబద్దము చెబుతున్నాయని రుపాయి కాయిన్ వేసాను, బొమ్మ వస్తే ఫోన్ చెయ్యి బొలుసు వస్తే వద్దు అని 100 సారులు వేసాను. ఒక్కసారికూడా బొమ్మ రాలేదు. ఇక అప్పుడు అనుకున్నా  బాబాకు నా ప్రసాదము నా పుట్టినరోజుకు తీసుకోవడము ఇష్టము లేదు అనిపించింది.   



షిరిడి దర్శనము(live) చుసాను. బాబా ప్రతిసారి నా ప్రసాదము తీసుకుంటావు ఇప్పుడు ఎందుకు తీసుకోవడములేదో నాకు అర్దం కావడములేదు, నాకు చాలా ఏడుపు వస్తుంది అని వేడుకున్నాను. బాబా మీకు ఇష్టము లేకుండా నేను ఏపని చెయ్యను, ప్రసాదము గుడిలోనే ఇస్తాను అనుకున్నాను. కాని బాధ మాత్రము అలానే వుంది. 23 తారీఖున 3గం|| వరకు బాధపడుతునే వున్నాను. 3.30 గం||లకి నా స్నేహితురాలికి ఫోన్ చేసాను. 11 డిసెంబర్ 2014 నా స్నేహితురాలి పెళ్ళి జరిగింది.నేను వెళ్ళలేదు, తనకి చాలా కోపము వచ్చి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తియ్యలేదు. అలాంటి అమ్మాయి 3.45గం||లకు ఫోన్ చేసి అంజలి నేను షిరిడి వెళ్ళుతున్నాను నువ్వుకూడా వస్తావా అని అడిగింది. నాకు మాటలు రాలేదు. నేను షిరిడి రానుగాని నా ప్రసాదము తీసుకొని వెళ్ళతావా? అని అడిగాను. దానికి వెంటనే నా స్నేహితురాలు అందుకే ఫోన్ చేసాను, తప్పకుండా తీసుకోని వెళ్ళతాను, ప్రసాదము తీసుకోవడానికి నా భర్త వస్తారు అని చెప్పింది. నా భర్తకూడా బాబాకు బాగా భక్తులు అని చెప్పింది. అప్పుడు నా సంతోషాన్ని మాటలలో చెప్పలేను. నేను అనుకుంటూ ఉండేదాన్ని సంతోషము వస్తే కళ్ళనిండా నీళ్ళు ఎందుకు వస్తాయి కాని అవి ఆనందబాష్పాలు. బాబా నాకు ఇది చాలు, మీరు మీ భక్తులని వదులుకోరని తెలుసు. ప్రసాదము చేసి ఇచ్చాను. మా గుడిలో కూడా నాలుగు ఆరతులికి ప్రసాదము చేసి ఇచ్చాను. అబ్బాయికూడా షిరిడి నుంచి పుట్టినరోజు ఆశ్శీసులు పంపించాడు.   

బాబా నా పుట్టినరోజున మీ ఆశ్శీసులు కావాలి. మనగుడిలోనే ఏవరో తెలియనివాళ్ళు నన్ను ఆశ్శీర్వదించాలి అనుకున్నాను. కాని నేను కొత్తబట్టలు వేసుకోలేదు, ఎప్పుడు నేను గుడిలో ప్రసాదము పంచుతాను. ఆరోజు సాయంత్రము ఆరతికి గుడికి వెళ్ళి ప్రసాదము పంచిపెడుతున్నాను. ఎవరో తెలియని అమ్మాయి నన్ను ఆశ్శీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. 4 సంవత్సరములలో నేను ఎప్పుడు అమ్మాయిని చూడలేదు. నేను ఆశ్చర్యపోయాను మీకు ఎలా తెలుసు అని అడిగాను. ఏమో నాకు తెలియదు బాబాను చూసి, మిమ్మలిని చూడగానే నాకు చెప్పాలి అనిపించింది. గుడిలో చాలా మంది ప్రసాదము పంచిబెడుతున్నారు కాని ఏవరికి చెప్పని ఆశ్శీస్సులు అమ్మాయి నాకు చెప్పింది. ఇది బాబా అనుగ్రహమే కదా! బాబా నాకు ఇది చాలు అనుకున్నాను. అందరికి మీ ఆశ్శీస్సులు వుండాలి అని కోరుకుంటున్నాను. శ్రద్ద, భక్తి, నమ్మకము వున్నచోట బాబా తప్పకుండా ఉంటారు. స్వార్దము ఉన్నచోట బాబా ఉండరు.    



నేను మీ అందరిని కోరుకుంటున్న బాబాను మనస్పూర్తిగా కోరుకుంటే తప్పకుండా మన కోరికలని నెరవేరుస్తారు, కష్టాలు తొలగిస్తారు. బాబాగారు నాకు కలలో చెప్పారు కదా! స్వార్దముగా వుండవద్దు, అందరు కలిసిమెలిసి వుండండి. గుడిలో సేవ అనేది అందరికి ఇవ్వండి, ఒకవేళ సేవ దొరకపోయిన బాధపడకండి బాబాను చూసిన అది కూడా సేవ అవుతుంది. అందరికి బాబా ఆశ్శీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.



ఇట్లు

అంజలి.

1 comment:

  1. Nice experience ... BABA is every where and with in you also he will be there ... nammakam is more important.

    JAI SAIRAM

    ReplyDelete