Total Pageviews

Sunday, April 6, 2014

బాబాతో నా అనుబంధము ----------- అంజలి.

 
 
 

బాబాతో అనుభూతులు మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉంది. బాబా లీలలు ఏలా వుంటాయంటే మనము ఎంత బాధపడతామో అంతకంటే ఎక్కువు సంతోషాన్ని ఇస్తారు బాబాగారు. లీల చదివితే మీకే అర్దమవుతుంది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి & విజయదశమికి నేను నా స్నేహితులతో కలిసి శిరిడి వెళుతుంటాను. 3,4 రోజులు శిరిడిలోనే ఉంటాము. ఇలా ఏప్రియల్ 2012 నుంచి వెళ్ళడం జరుగుతుంది. సంఘటన 18 ఏప్రియల్ 2013లో జరిగింది. 2 వారాల ముందు బాబా చిత్రముతో కూడిన ఉంగరాన్ని చేయించడానికి మా ఊరు వెళ్ళాను. ఉంగారాన్ని షిరిడిలో బాబా సమాధి మీద పెడదామనుకొని ఎలా చెయ్యాలో చెప్పి బాబాకు రెండువైపులా పాదాల దగ్గర పువ్వులు లాగా పెట్టమన్నాను. అప్పుడు షాపు అతను  నా వైపు వింతగా చూసి నేను కూడా బాబా భక్తుడనే కాని మీలాగ కాదు, పువ్వులు రావు అని చెప్పాడు. చాలాసేపు బ్రతిమాలాను, బాబా పాదాల దగ్గర రావు కావలంటే బాబాకు రెండువైపుల పువ్వులు పెడతానన్నాడు. వారం రోజుల పడుతుందని చెప్పాడు. మా అన్నయ్యఎవరో ఒకరు తీసుకొనివస్తారులే అనుకొని హైదరాబాదు వచ్చేసాను. షాపుతను ఫోనుచేసి అయిపొయిందని చెప్పాడు, చాలా సంతోషపడ్డాను కాని తీసుకొనిరావడానికి ఎవరు లేరు.  నా దగ్గర బాబా విగ్రహము చిన్నదొకటి, పెద్దదొకటి వున్నాయి. 13 ఏప్రియల్ 2013 రోజున శిరిడికి చిన్న బాబాను నాతో తీసుకొని వెళ్ళతాను, పెద్ద బాబాను ఇంట్లోనే కాపలా వుండమని చెప్పాను. 14 ఏప్రియల్ 2013 రోజున నాదగ్గరున్న పెద్ద బాబా విగ్రహం నాచెయ్యి తగిలి పగిలిపోయింది. బాబా తల విడిగా పడిపోయింది. బాబా విగ్రహము విరిగిపోయిందని చాలా భాదపడ్డాను. గుడికి వెళ్ళి పూజారితో చెప్పి ఏడ్చాను, అమ్మా ఏమికాదు అలా చాలా పగిలిపోతాయి వాటిని అందరూ గుడిలో పెట్టేస్తారు నువ్వు కూడా పెట్టేయమని చెప్పారు. కాని నేను పెట్టలేదు. అప్పటి నుంచి కష్ట్టాలు మొదలయ్యాయి.
మేము నలుగురము శిరిడి టికెట్స్ తీసుకున్నాము కాని ఇద్దరు రాను అన్నారు. అందులో శిరిడి గురించి బాగా తెలిసిన అమ్మాయి రావడం లేదు. నాకు కూడా అక్కడ రూములు గురించి అంతగా తెలియదు, ఏలా వెళ్ళాలనే భయము పట్టుకుంది. ఎవరైనా శిరిడి వెళుతుంటే ప్రసాదం చెయ్యడం, తెలిసినవాళ్ళ దగ్గర రూ. 2/- తీసుకొని నేను ఇవ్వడం అలవాటు. అలాంటిది నేను వెళ్ళుతుంటే ఇక ఎన్ని చెయ్యలో అని చాలా అలోచించాను. బాబా విగ్రహం పగలడం, ఉంగరము రాకపోవడము నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. అన్నయ్యకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదు. అమ్మకు ఫోను చేసి ఎలాగయినా ఉంగరము పంపండని చెప్పాను. మా తమ్ముడిని చాలాసేపు అడిగాను కాని తీసుకురాను అన్నాడు. మా నాన్నగారు బ్రతికివుంటే నాకు ఈపరిస్థితి రాదు అనుకున్నాను. 17 తేదీన రాత్రి చాలా ఏడ్చాను నాకు ఎవరు లేరు, నేను ఏమి అనుకున్న జరుగదు నా జీవితం ఎందుకు అని ఏడుస్తూ పొడుకున్నాను. 18 తేదీ ఉదయము 4.30 గం||లకు మెలుకువ వచ్చింది.బాబా ముందు నుంచోని పెద్దబాబాను కూడా నాతో శిరిడికి తీసుకొని వెళ్ళతానని చెప్పాను. ఏలాగయిన ఉంగరము వచ్చేటట్టు చెయ్యమని బాబాను అడిగాను. 5.15 గం||లకు ఫోను చేసి ఉంగరము తీసుకొని వస్తున్నానని చెప్పాడు. నాకు సంతోషముతో కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. బాబాకు నాలుగు రకాల స్వీట్స్ చెయ్యాలి అనుకొని లెగిసాను. అంతలో తలుపు కొట్టారు, చూస్తే గుడినుంచి బాబా విగ్రహము తీసుకొని మా ఫ్రెండ్ వచ్చింది. అక్క మీ దగ్గరనున్న బాబా విగ్రహము విరిగిపోయింది కదా! దానికి మీరు చాలా భాధపడుతున్నారు దీన్ని మీ రూములో పెట్టుకోమని ఇచ్చింది. పర్వాలేదు నేను బాబాను షిరిడికి తీసుకొనివెళుతున్నానని చెప్పాను, అయితే బాబాను మీరూములో ఉంచండి అని చెప్పింది. నా రూముని చూస్తూ  ఉండమన్నందుకు వేరే బాబా నాదగ్గరకు వచ్చారు. మధ్యాహ్నాము 12 గం||లకు విగ్రహము వచ్చింది, సాయంత్రము శిరిడికి బయలుదేరాము. 
 శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరిగాయి. మాకు రూము చావడి దగ్గరలో వెళ్ళాగానే దొరికింది. శిరిడిలో శ్రీరామనవమికి రాత్రంతా సమాధిమందిరము తెరిచే ఉంటుంది. మా స్నేహితురాళ్ళు, నేను చేసుకుంటానే వున్నాము. నా దగ్గర బాబాలను కూడా తీసుకొని వెళ్ళి సమాధి మీద ఉంచాను. సమాధి మందిరములో పైన పచ్చద్రాక్ష కట్టారు, ఉంగరము బాబా దగ్గర వుంచారు, నా ప్రసాదము తీసుకున్నారు. బాబా దర్శనము బాగా జరిగిందిగాని ఆయన ఆశీస్సులు కావాలి. పైన కట్టిన గ్రేప్స్ ఒక్కట్టయినా నా మీద పడితే మీరు నన్ను ఆశీర్వదించినట్టు అనుకున్నా, మా ఫ్రేండ్తో చెప్పాను. ఉదయము బాబాకు అభిషేకము చేస్తుంటే నా మీద గ్రేప్స్ గుత్తు పడినది. నాకు చిన్న దెబ్బకూడా తగులలేదు, నామీద పువ్వు పడినట్టు అనిపించింది. గుత్తు క్రిందపడగానే శబ్దము వచ్చింది. మా ఫ్రెండ్ పడిపోయాడా? ఏమిటి అని చుసాను, తను ఆశ్చర్యపోయింది నువ్వు అనుకున్న కోరిక బాబా తీర్చాడు అన్నది. నాకు ఎంత సంతోషము అనిపించిందంటే మాటలతో చెప్పలేను. ఇక అందరు నాకు గ్రేప్స్ పెట్టమని అడిగారు. అందరికి పంచిపెట్టాను. చుసారా బాబా లీలలు. బాబా అందరి కోరికలు నెరవేరుస్తారు, కాని మనము ఓర్పు సహనము, నమ్మకముతో ఉండాలి. బాబాను ప్రేమతో పూజించండి. స్వార్దం ఉన్నచోట బాబా ఉండరు. అందరికి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
ఇట్లు,
అంజలి.   

3 comments:

  1. Hi anjali... Nuvvu cheppindi 100% correct. Naakuda alaaga chaala ne jarigaay. Manam baba gaari nammukoni manahspoorthiga adigithe asaadyamynavi kuda ayana mana kosam sadyam chesthaaru. Induku manaki undavalsinavi SHRADHA & SABOORI
    JAI SAI RAM

    ReplyDelete