Total Pageviews

Wednesday, April 2, 2014

సాయి సదానంద స్వరూపం

సాయిబాబా సదానంద స్వరూపం. మోక్షాన్ని ప్రసాదించే సాధనం. శాంతికి మారుపేరు. సర్వ విజ్ఞాన ఖని.
బాబా మాటలు అమూల్యమైన హితోక్తులు. ఆయన బోధనలు అమృత జల్లులు.
బాబా మనమధ్య తిరిగినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసి చూపాడో, సమాధి స్థితిలోనూ చూపుతున్నాడు. బాబా మనకు మార్గదర్శకుడు.
బాబా అడుగులతో పునీతమైన షిర్డీ నేల పుణ్యక్షేత్రం అయింది. షిర్డీ వెళ్ళి వస్తే చాలు తమ కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. షిర్డీ క్షేత్రానికి వెళ్ళి, ప్రశాంత చిత్తంతో వెనుతిరిగి వస్తుంటారు. సాయి భక్తులు వీలైనపుడల్లా షిర్డీ వెళ్ళి వస్తుంటారు.
చిన్నాపెద్దా, పేదాధనిక తేడా లేకుండా బాబా అందర్నీ కాపాడుతాడు. కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను అందిస్తాడు.
బాబా సిద్ధపురుషుడు అయ్యుండీ సామాన్యుడిలా జీవించాడు. నలుగురి మధ్యా సాధకునిలా జీవించి ఎన్నెన్నో జీవనసత్యాలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు అర్ధం చేసి చెప్పాడు.
లోకమంతా నిద్రలో ఉంటే జగద్రక్షకుడిగా బాబా మెలకువగా ఉండేవాడు. అందరూ మేల్కొని ఉన్నప్పుడు ఆయన యోగనిద్రలో ఉండేవాడు.
మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండే బాబా ఉండగా మనకెందుకు చింత? నిశ్చింతగా, నిబ్బరంగా ముందుకు సాగుదాం. జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.

0 comments:

Post a Comment