
శ్రీసాయి పిచ్చి ఫకీరులా కన్పించినా, వారి దివ్య లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన యిసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకనుక్షణమూ అనుభవమవుతూ, వారి హృదయాలను పులకింప జేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి గాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ, సందర్భోచితంగానూ వుండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగలా, పూలమాలలోని దారంలాయీ లీలలన్నింటిలో శ్రీసాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగిచూసు వుంటుంది. దానిని...