Total Pageviews

Thursday, May 8, 2014

అందరి హృదయాలలోను నివసించువాడను నేనే సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/2014/05/38.html

శ్రీసాయినాధుని యొక్క లీలలు(అంతుపట్టని అనుభూతులు) ఆయన భక్తులకు బాబా మీద ఎంతటి భక్తి ఉన్నదో  ధృవపరుస్తాయి.   శ్రీసాయి బాబాను అర్ధం చేసుకోవడం ఆయన భక్తులయినవారికి చాలా సులభం. బాబా తన భక్తులను తనవైపునకు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా లాగుకొని తన దయను వారిపైన ప్రసరింపచేయడమన్నది చాలా అద్భుతమయిన విషయం.  లేకపోతే ఎక్కడో ధర్మవరంలో పనిచేస్తున్న శ్రీస్వామి కేశవయ్యజీ గారికి బాబా గురించి తెలుసుకొనే అదృష్టం ఎలా కలుగుతుంది?  ఆయన ఎప్పుడూ శ్రీసాయి సత్ చరిత్రను చదవలేదు.  ఎవరినించీ ఆయన శ్రీసాయిబాబా లీలలను గురించి వినలేదు.  అనంతపురం జిల్లా ధర్మవరంలో నివసిస్తున్న ఆయనకు 1939వ.సంవత్సరం జూలై 1 వ.తేదీన సాయిబాబా గురించితెలిసింది .  



ఆరోజు మరపురానిది.  ఆరోజు సాయంత్రం ఆయన తన వ్యక్తిగత సమస్యల గురించి తన సన్నిహిత స్నేహితుడు, అడ్వకేటు అయిన శ్రీమల్లిరెడ్డిగారితో చర్చిస్తున్నారు.  కష్టాలు తీరాలంటే సాయిబాబాను పూజించమని ఆయన సలహా యిచ్చారు.  ఆరోజు రాత్రి ఆయనకు కలలో శ్రీసాయిబాబా దర్శనమయింది.  మరుసటిరోజు ఆయనకు షిరిడీనుండి బాబా ఫొటో, ఊదీ వచ్చాయి.  వాటిని ఎవరు పంపించారో తెలియదు.  అప్పటినుండి శ్రీకేశవయ్యజీ గారి వ్యక్తిత్వం మారిపోయింది.  శ్రీసాయిబాబాకు భక్తుడయిపోయారు.  తమ కష్టాలు బాధలనుండి ఉపశమనం పొందడానికి ఆయన వద్దకు అసంఖ్యాకంగా ఎంతో మంది సాయి భక్తులు వచ్చేవారు.  శ్రీసాయిబాబా కృప వారిపై ప్రసరింపడానికి ఆయన బాబాకు, భక్తులకు మధ్య మధ్యవర్తిగా సేవ చేశారు.  19వ.శతాబ్దం చివర హేవళంబి సంవత్సరంలో శ్రావణ బహుళ అమావాస్య రోజున శ్రీ కేశవయ్యజీ గారు జన్మించారు.  ఆయన తండ్రిగారయిన శ్రీ స్వామి బాలయ్యగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు.  ఆయన హిందువు, ఎంతో భక్తికలవారు. కేశవయ్యగారికి చిన్నతనం నించి ఆధ్యాత్మిక విషయాలమీద ఎంతో ఆసక్తి ఉండేది.  జీవితాంతం ఆయనకు అదే ముఖ్యమయిన గుణంగా కొనసాగుతూ వచ్చింది.  దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడమంటే ఆయనకు ఎంతో ప్రీతి.  స్కూలులో చదువుకునే రోజులలో బైబిల్ క్లాసులో ఆయనే మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయేవారు.  ఆయనకు జీసస్ క్రీస్తు కూడా దర్శనమిచ్చారు.  ఆయన ఖురాన్ కూడా నేర్చుకొన్నారు.  ప్రాఫెట్ మహమ్మద్ కూడా ఆయనకు దర్శనమిచ్చారు. ఆయన తత్వ వేత్తలను సాధువులను, సన్యాసులను కలుసుకొన్నారు.  వారినుంచి ఎన్నో విషయాలను పరిశీలనా దృష్టితోను, శ్రధ్ధతోను, గ్రహించేవారు.  అందులో ఎంతో ఆసక్తిని కనపరచేవారు.   


మద్రాసు ఉమ్మడి రాష్ట్రం రెజిస్ట్రేషన్ డిపార్ట్ మెంటు లో స్వామీజీగారు గుమాస్తాగా తమ జీవితాన్ని ప్రారంభించారు.  తొందరలోనే ఆయన సబ్ రిజిస్ట్రారుగా పదోన్నతి పొంది మంచి పేరు తెచ్చుకొన్నారు.  బీదవారిపై ఆయన ఎంతో దయగా ఉండేవారు.  అందుచేత అందరూ ఆయనను 'స్వామి సబ్ రెజిస్ట్రారు  ' అనేవారు.  ఆయన యింటిలో కూడా ఎంతో దయగా ఉండేవారు.  నీతి, నిజాయితీగా కష్టపడి శ్రమించే ఆఫీసరు ఆయన. 


పదవీ విరమణ చేసిన తరువాత శ్రీనరసిం హ స్వామీజీ తన జీవితాన్ని సాయిబాబా తత్వ ప్రచారానికే అంకితం చేశారు. పెనుకొండలో ఒకసారి ఆయన పూజలో ఉండగా, ఒక పిల్లవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు.  ఆపిల్లవాడు నాలుగు సంవత్సరాలుగా తుంటి కీలుమీద చీము కురుపు వచ్చి ఎంతో బాధ పడుతున్నాడు.  బళ్ళారిలోని మిరాజ్ ఆస్పత్రిలో వైద్యం చేయించినా కూడా పుండు మానలేదు.  ఆపిల్లవాడిని యిద్దరు మనుషులు ఎత్తుకొని తీసుకొని వచ్చారు.  ఆపిల్లవాడు వచ్చిన సమయం చూశారు కేశవయ్యగారు.  పిల్లవాడి నుదుటి మీద చేయి వేసి, కొబ్బరినూనెలో ఊదీ కలిపి పుండు మీద రాయమని చెప్పారు.  కొన్ని వారాలపాటు ప్రతి గురువారం బాబా పూజకు రమ్మని పిల్లవాడితో చెప్పారు.  ఆయన ముందుగా చెప్పినట్లుగానే, చెప్పిన సమయానికి పిల్లవాడి పుండు మానిపోయింది. ఆరోగ్యవంతుడయాడు.  ఇటువంటి సంఘటనలెన్నో వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.  ఇవన్ని కూడా కేశవయ్యజీగారు శ్రీసాయినాధుల వారికే అంకితం చేశారు.  బాబా భక్తులయినవారికి వివిధ పరిస్థితులలో వారు లౌకిక జీవితంలో ఎదుర్కొనే అన్ని కష్టనష్టాలనుండి విముక్తులవడానికి శ్రీసాయినాధులవారి రక్షణబాధ్యత ఎంతో సహాయకారిగా ఉంటుంది.    


శ్రీకేశవయ్యజీ గారు, షెనాయ్ నగర్ మద్రాస్ లో శ్రీసాయిబాబా భక్త సమాజ్ ని స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉన్నారు.  ఆసమాజం సాయిభక్తులకు సేవలనందిస్తోంది.  ఆయన షెనాయ్ నగర్  లో ఆగష్టు, 9వ తేదీ, 1981 వ.సంవత్సరంలో సమాధి చెదారు.


సంధ్యా ఉడతా

హైదరాబాదు

0 comments:

Post a Comment