Total Pageviews

Tuesday, December 3, 2013

ఊదీ బాబా సాయి మాణిక్కం (ఊదీ బాబా గారి నుండి వచ్చిన ఈమెయిలు ఆధారం) 
 
 
ఊదీ బాబా సాయి మాణిక్కం   (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)
దక్షిణ  భారతదేశంలో మాసిలమణి మాణిక్కం ను అందరూ ఊదీ బాబాగా అందరూ ఊదీ బాబాగా పిలుస్తూ ఉంటారు.  ఆయన ఎన్నో రకాలయిన వ్యాధులను తగ్గించగలరు.  వైవాహిక సంబంధమయిన సమస్యలను, వ్యాపార సంబంధమయిన సమస్యలను, కుటుంబ సమస్యలు మొదలైన వాటినన్నిటినీ పరిష్కరించగలరు. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం, సంతానం లేనివారికి సంతానం కోసం ప్రార్ధిస్తూ ఉంటారు.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో గాని, జూన్ నెలలో గాని శనీశ్వర యాగంలో పాల్గొని ప్రజల క్షేమం కోసం ప్రార్ధిస్తూ ఉంటారు.  ప్రతి సంవత్సరం షిర్దీ సాయిరాం ఎడ్యుకేషనల్ చారిటబుల్ పబ్లిక్ & సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు సాయిపూజా భజనలు నిర్వహించి, పేదలకు చీరలు, కుట్టు మిషన్ లు, పేద విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు పంచి పెడుతూ ఉంటారు.  ఆరోజున బీదలకు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు.వచ్చినవారందరికీ ఊదీబాబా గారు ఊదీనిచ్చి ఆశీర్వదించి పంపుతూ ఉంటారు. 
25సంవత్సరాలనించీ ఆయన యిటువంటి ఆధ్యాత్మిక సేవలో ఉన్నాకూడా ఎప్పుడూ పేరు ప్రతిష్టల కోసం తాపత్రయ పడలేదు.  ఊదీబాబా ఒక పేద కుటుంబానికి చెందినవారు.  ఆయన 10.06.1954 వ.సంవత్సరంలో తిరువన్నామలై జిల్లాలోని వెల్లనల్లూర్ అనే చిన్నగ్రామంలో ముత్తుయమ్మళ్, మాసిలామణి దంపతులకు జన్మించారు.
ఆయన బీ.ఎస్సీ.ప్రధమ సంవత్సరం చదువుతూ కుటుంబ ఆర్ధిక సమస్యల వల్ల మధ్యలోనే చదువు ఆపేసి ప్రభుత్వోద్యోగంలో చేరారు.  రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ చెన్నై లో అసిస్టెంట్ యిన్స్పెక్టర్ జనరల్ గా పదవీవిరమణ చేశారు.  ఆయనకు వివాహమయింది.  ముగ్గురు అమ్మాయిలు.   ముగ్గురికీ వివాహాలయి జీవితంలో స్థిరపడ్డారు. ఆయన నాస్తికుడయినా నిజాయితీగా ఉంటూ తను నమ్మే సిధాంతాలను ఆచరిస్తూ ఉండేవారు.  ఆయన ఎప్పుడూ భగవంతుడిని నమ్మలేదు.  ముందునుంచీ కూడా ఆయన కారణం లేకుండానె భగవంతుడిని, దేవీదేవతలను విమర్శిస్తూ ఉండేవారు. కానీ యిదంతా ఆయనకు 35 సంవత్సరముల వయస్సు వరకు మాత్రమే.  అప్పుడే ఆయన జీవితంలో మలుపు తిరిగి ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టి ఊదీ బాబాగా ప్రసిధ్ధి చెందారు. 

ఆయన జీవితంలో జరిగిన మలుపు:
ఒక గురువారం నాడు సాయంత్రం గం.5.45 నిమిషాలకు ఆయన వెళ్ళుర్ లో మసీదు ప్రక్కనుంచి నడచుకుంటూ వెడుతున్నారు.  ఆసమయంలో ఆకాశం నుండి షిరిడీ సాయిబాబావారు క్రిందకు దిగిరావడం చూశారు. "నాతో సహా అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి ప్రజలలో నీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి" అన్నారు బాబా.  కాని ఆయన దీనినేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు.  బాబా ఆయనను ఒక మసీదు, ఒక దేవాలయం మధ్య ఆశీర్వదిస్తూ వచ్చారు.  ఇలా వరుసగా మూడు రోజులపాటు ఒకేసమయంలో ఈవిధంగా జరిగింది.  ఆయనా గాని ఆయనకు భగవంతునిలో నమ్మకం లేకపోవడం చేత దీనిని పెద్దగా పట్టించుకోలేదు.  కాని తరువాత నాలుగవరోజైన శనివారమునాడు ఆయనకు తాను తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్నట్లుగా కల వచ్చింది.  కాని, కలలో వేంకటేశ్వరునికి బదులుగా బాబా కనిపించారు.  ఇది ఆయనలో ఆలోచనలను రేకెత్తించింది.  క్రమంగా ఆయనలో మార్పు రావడం మొదలయింది.  తన పాత అలవాట్లను, సంబంధాలను, కోరికలను (కుటుంబంతోసహా) అన్నిటినీ వదలి పెట్టేశారు.  శ్రీసాయిబాబావారి ఆశీర్వాదంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు.  బాబా సేవకునిగా ఒక క్రొత్త లక్ష్యాన్ని చేపట్టారు.  ఇప్పుడాయన తన కుటుంబ బాధ్యతలని ఒక కర్తవ్యంగా మాత్రమే నిర్వహిస్తున్నారు.  బాబా స్వయంగా బోధించిన వాటిని ఆచరిస్తూ భగవంతునితో అనుసంధానమైన ప్రతీదీ కూడా పూజ, ధ్యానం అన్నిటినీ ఆచరిస్తున్న ఆయన ఎంతో ధన్యుడు. 
బాబాయే ఆయనకు పరమగురువు.  బాబాను తనలో యింకా గాఢంగా నిలుపుకొనేందుకు ఆయన షిర్దీ చాలా సార్లు దర్శించారు.  ఆయన మనసంతా యిప్పుడు బాబా నిండి ఉన్నారు.  ఆయన ప్రతిరోజు బాబాతో మాట్లాడతారు, ఆడతారు,సుఖసంతోషాలను పంచుకుంటారు, ప్రార్ధిస్తారు. అందరి కోర్కెలని ఊదీబాబాగారు షిరిడీలో  బాబావారి పాదాల వద్ద ఉంచుతారు.  వారికోర్కెలన్నిటినీ సఫలం చేయమని ఆయన బాబాని తీవ్రంగా ప్రార్ధిస్తారు.  బాబా వాటిని పరిష్కరిస్తారు.  బాబావారి అనుమతి లేకుండా ఊదీబాబా ఏపనీ చేయరు.  ఆయనకు తనకంటూ ఏవిధమయిన కోరికలు లేవు.  ఇప్పుడు ఊదీ బాబాగారు షిరిడీసాయిబాబావారి అనుమతితో భారతదేశంలోని యితర ప్రాంతాలలోని అందరి గురించీ కూడా ప్రార్ధన చేయడానికి నిర్ణయించుకొన్నారు.
అంధుచేత సాయిభక్తులెవరైనా తమ సమస్యల గురించి ఊదీబాబావారిని సంప్రదించాలనుకుంటే, తమ తమ సమస్యల వివరాలను ఆయన ఈ.మైల్.ఐ.డీ. కి పంపచచ్చు. saimanickam.udi@gmail.com  మూడు రోజులలో ఆయన సమాధానమిస్తారు.
ఫోన్ ద్వారా కూడా ఆయనను సంప్రదించవచ్చు.. ఫో.+919994187725 
సంప్రదించవలసిన సమయం  ఉ.10.గం.నుండి మ.12.గం.వరకు

                              సా.6 గం.నుండి 8 గం.వరకు.

ఆయన తన 25సంవత్సరాల సేవలో లక్షమందికి పైగా కాన్సర్ రోగులకి, కిడ్నీవ్యాధి గ్రస్తులకి, గుండె జబ్బులవారికి వారి వారి జబ్బులను తగ్గించడానికి ఊదీనిచ్చారు.  సంతానం లేని దంపతులకు సంతానం కలిగింది. 
చిరునామా:
ఎం.మానిక్కం (ఊదీ సాయిమానిక్కం) 
ప్రెసిడెంట్ : డా.పుంగుఝలి ఫౌండర్ & మానేజింగ్ ట్రుస్టీ
ణుం. 679, బజంకోయిల్ వీధి,
కరుగంబత్తూర్
వెల్లూర్ - 632 013

0 comments:

Post a Comment