Total Pageviews

Monday, July 22, 2013

" సాయిస్వరాంజలి " రచన : డాక్టర్ కుమార్ అన్నవరపు courtesy by Atluri Subrahmanyeswararao



 " సాయిస్వరాంజలి " 

" ఎందుకంత ఆత్రుత ? ఎందుకంత భయం ? నీ ప్రశ్నలకు జవాబివ్వడానికే నేనున్నాను కాలం ఆసన్నమైనప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. కిటికిని చూడు పగటిని పగలు గాను రాత్రిని రాత్రి గాను చూపుతుంది దానిని పరదాతో మూసేసినంత మాత్రాన పగలు రాత్రి కాదు రాత్రి పగలు కాదు నీకు,నాకు మధ్య అడ్డుగా ఉన్న పరదా (గర్వం)ను తొలగించు అప్పుడు నువ్వు నేను ప్రత్యక్షంగా చూసుకోగలుగుతాం అందుకు సహాయపడడానికే నేనున్నాను నేను నీకు శ్రేయస్కరమైనవే అనుగ్రహిస్తాను. శుభమైన వాటినే ప్రసాదిస్తాను. దీనిని ఆమోదించు ప్రతి కార్యమూ సకాలంలో పూర్తవుతుంది కాస్త ఓపిక పట్టు నిబ్బరం కోల్పోకు నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను ".




" నిన్ను నన్ను కలిపేది ప్రేమ మాత్రమే అని గ్రహించు

ప్రేమతో అర్పించేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను

నా నిజతత్వాన్నిగ్రహించాలంటే అహంకారాన్ని వదులుకోవాలి

జీవితాన్ని గులాబి మొక్కతో పొల్చవచ్చు

దాని అందం, సౌరభం దివ్యమైనవి

వాటిని అందరు ప్రేమిస్తారు ..ఆస్వాదిస్తారు

కానీ, వాటి చుట్టూ ఉన్న ముళ్ళు అహంకారానికి చిహ్నం

అవి గుచ్చుకుంటే ఇతరులకు బాధ కలుగుతుంది

అహంకారం కూడా అంతే

అది మనలో ఉన్నంత వరకు ఇతరులను బాధిస్తూనే ఉంటుంది

అహంకారం నీ నిజతత్వం కారాదు

దానిని ప్రేమతోనే జయించాలి

దైవాన్ని ప్రేమతోనే ఆకట్టుకోవాలి

ప్రేమంటే దాచుకోవడం కాదు..ఇవ్వడం,పంచడం అని తెలుసుకో

అందుకని ఇస్తూనే ఉండు

బదులుగా ఎన్నో రెట్లు తిరిగి పొందుతావు

నువ్వు ప్రేమతో అర్పించేదేదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను

సదా గుర్తుంచుకో..."
ధ్యానమంటే ఏమనుకుంటున్నావు?

ధ్యానమంటే నువ్వు నేనుగా మారిపోవడం

ధ్యానానందాన్ని అనుభవించాలని ఉందా?

అయితే,విను...

నీ హృదయమంతా నా రూపాన్ని నింపుకో

నీ మనసంతా నన్నే తలుచుకో

నా దివ్యభోధలను మౌనంగా ఆలకించు

నా లీలలను కళ్ళు మూసుకుని పరికించు

నిన్ను నీవు మర్చిపో

నువ్వు నేనుగా మారిపో

నేనే నువ్వని, నువ్వే నేనని తెలుసుకో

నీలోకి నా ప్రవేశాన్ని ఆనందంతో స్వీకరించు.

నాతో నీ సంబంధాన్ని దృఢం చేసుకో

నీకు క్రమంగా శాంతి లభిస్తుంది.

మది నిర్మలమవుతుంది.

ఎద ప్రేమభరితమవుతుంది.

ఇక,నీకు ధ్యానం కుదురుతున్నట్టే!
 
పరమ పవిత్రమైనవి

నువ్వు నడిచే దారి పొడవునా నా పాదముద్రలున్నాయి

అవి నీకు దారి చూపుతాయి

నా పాదముద్రల కోసం వెతుకు

నా అడుగుజాడలను అనుసరించు

నేరుగా నీ గమ్యం చేరుకుంటావు

నాలోనే ఐక్యమవుతావు. "

0 comments:

Post a Comment