Total Pageviews

Showing posts with label షిర్డీ సాయితో సాయిబానిస అనుభవాలు. Show all posts
Showing posts with label షిర్డీ సాయితో సాయిబానిస అనుభవాలు. Show all posts

Tuesday, July 23, 2013

బాబాతో సాయి బా ని స అనుభవాలు 15

బాబాతో సాయి బా ని అనుభవాలు 15


శ్రీ సాయి సచ్చరిత్రలోని33 అధ్యాయంలో ప్రముఖంగా శ్రీ అప్పా సాహెబ్ కుల్ కర్నీకి జరిగిన సంఘటన చెప్పబడింది. సంఘటన మనమొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. శ్రీ కుల్ కర్నీ భార్య తాను ఒక ఫకీరుకు బాబా పేరు మీద ఒక రూపాయి దానము చేశానని చెప్పినది. తన భార్య చేసిన మంచి పనికి సంతోషించి సమయములో తాను ఉండి వుంటే బాబా పేరిట ఫకీరుకు పది రూపాయలు ఇచ్చి వుండేవాడిని కదా అని తలిచెను. వెంటనే తాను ఫకీరు గురించి వెతకటము ప్రారంభించి ఫకీరుకు పది రూపాయలు ఇచ్చినాడు. ఇది మనకు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును గుర్తు చేస్తుంది. శ్రీ సాయికి మన మనసులోని ఆలోచనలు తెలుసు. దానికి తగిన విధంగా మన నమ్మకాన్ని పెరిగేలాగ చూస్తారు.

ఇటువంటి సంఘటనే నాకు కూడా జరిగింది. ఇప్పుడు సంఘటనను మీతో పంచుకుంటాను. 1970 సంవత్సరము హోళీ పండుగ రోజున సికిందరాబాదులోని శ్రీ కన్యకాపరమేశ్వరీఆలయములో నా వివాహము జరిగినది.

ప్రతీ సంవత్సరము హోళీ పండగ రోజున నేను నా కుటుంబ సభ్యులము మందిరానికి వెళ్ళి పూజలు చేయటము అలవాటుగా మారింది. అది 1991 సంవత్సరము హోళీ పండగ రోజు. యెప్పటిలాగే గుడికి వెళ్ళాము. సాయిని పోలిన ఒక సన్యాసి మందిరము దగ్గిరకి వచ్చి తాను విజయవాడ కనక దుర్గమ్మ మందిరమునుంచి వచ్చినానని తనకి ఏదయిన దానము చేయమని కోరినాడు. నాకు అలవాటు ప్రకారము ఒక రూపాయి దానము చెశాను. పూజలు చేసుకోవడానికి నేను, నా భార్య గుడిలోపలికి వెళ్ళాము. పూజారిగారు మంత్రాలు చదవడంలో నిమగ్నమై ఉన్నారు. నా మనసులో మాత్రము ఒక విధమైన అలజడి ప్రారంభమయినది. వివాహ వార్షికోత్సవ సందర్భంలో విజయవాడ కనకదుర్గమ్మ మందిరమునించి వచ్చిన సన్యాసికి పది రూపాయలు దానము చేసిఉండిన బాగుండేదని ఆలోచించాను.

నేను నా భార్య కన్యకాపరమేశ్వరీ దేవికి పూజలు పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఒక బెంచీ మీద కూర్చుని అప్పటి వరకు మా జీవితంలో జరిగిన సంఘటనలు నేను నా భార్య మాట్లాడుకోసాగాము. సమయంలో మా ముందుకు ఒక సిక్కు సన్యాసి వచ్చి తాను నాందేడులోని గురుద్వారాలోసేవకుడనని పరిచయము చేసుకుని నానుండి పదిరూపాయల దక్షిణ కోరినాడు.


క్కసారిగా నా మనస్సు సంతోషముతో నిండిపోయినది. నా మనసులోని ఆలోచనలను బాబా తెలుసుకుని నా నుండి పదిరూపాయలు దక్షిణ కోరుతున్నారనిభావించాను. నేను నా భార్య కు విషయము తెలియచేసి పది రూపాయల నోటును సిక్కు సన్యాసికి దక్షిణగా ఇచ్చినాను. సిక్కు సన్యాసి చిరునవ్వుతో నానుండి దక్షిణ స్వీకరించి మమ్ములను ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. గుడిలోని పూజానంతరము ఇంటికి వచ్చి నా యింటిలోనిపూజామందిరములోని సాయి పటానికి నమస్కరించినప్పుడు సిక్కు సన్యాసియొక్క చిరునవ్వు గుర్తుకు వచ్చినది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

సాయితో సాయి బా ని స అనుభవాలు 14



సాయితోసాయి బా ని అనుభవాలు 14

శ్రీ సాయి ధనవంతుల స్వప్నాలలో కనిపించి, వారి ద్వారా తాను చేయదలచిన కార్యాలను చేయించడానికి వారిని సాధనంగా ఉపయోగించుకునేవారు. పనులన్ని కూడా పేదవారికీ సమాజానికీ ఉపయోగపడేవిగా ఉండేవి. అటువంటి ఉదాహరణలలో అద్భుతమైనది బూటీవాడా నిర్మాణము. గోపాల్ ముకుంద్ బూటీకి కలలో సాయి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన బూటీ వాడాను నిర్మించాడు. ఈనాడు బాబా సమాధి మందిరము (బూటీవాడా) కోటానుకోట్ల సాయి భక్తులకు ప్రశాంతతను ప్రసాదించుచున్నది. శ్రీ సాయి సచ్చరిత్రలోని 45 అధ్యాయములోనిసంఘటను గుర్తు చేసుకుందాము. శ్రీ సాయి ఆనందరావ్ పాఖడే స్వప్నంలో కనపడి మాధవరావ్ దేశ్పాండేకి ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు. శ్రీ శ్యామా పట్టుధోవతీని స్వీకరించారు. అటువంటి అనుభవమే నాకు 1993 సంవత్సరములో జరిగింది.

1992
సంవత్సరం మే నెలలో మా అమ్మాయి వివాహము జరిగినది. 1993 సంవత్సరము సంక్రాంతి పండగ సందర్భముగా మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించడానికి 2.1.1993 హైదరాబాదునుండివిజయవాడకు బస్సులో బయలుదేరాను. రాత్రి ప్రయాణము వల్ల బస్సులో నాకు కొంచెం నిద్ర పట్టింది. శ్రీ సాయి షిరిడీలోని సమాధి మందిరములో విగ్రహము పక్కన ఒక స్త్రీమూర్తి రూపములో నిలబడి నీవు నీవాళ్ళకు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నావే, మరి నాకు రెండు కొత్త చీరలు ఇవ్వరాదా అని అడిగిందామె. ఉదయము మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణములో బాబా స్త్రీమూర్తిరూపములో కోరిన రెండు కొత్త చీరలను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించసాగాను.

అది 4.1.1993 ఉదయము, శ్రీ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలు పారాయణ పూర్తి చేసాను. పారాయణ కాలములో ప్రతిదినము పిడికెడు బియ్యము ఒక సంచీలో వేసి ఉంచేవాడిని. పారాయణ అనంతరము బియ్యము పేదలకు పంచి పెట్టేవాడిని. రోజున బియ్యాన్ని గండిపేటలో ఉన్న ఒక వృధ్ధుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆసాయంత్రము ఆశ్రమానికి చేరుకున్నాను. ఆశ్రమములో ఒక ఆరుగురు మగవారు ఇద్దరు ఆడవారు మాత్రమే ఉన్నారు. ఆశ్రమ మానేజరుకు బియ్యాన్ని ఇచ్చిన తరువాత బయటకు వస్తూండగా ఆశ్రమములో ఉన్న ఇద్దరు వృధ్ధ స్త్రీలు నన్ను చిరునవ్వుతో పలకరించారు. అప్పుడు నాకు 2.1.1993 రాత్రి బాబా ఒక స్త్రీ రూపములో స్వప్నములో దర్శనమిచ్చి రెండు కొత్త చీరలు కోరిన సంఘటన గుర్తుకు వచ్చినది.. వెంటనే నేను నా పర్సులోనించి 202/- రూపాయలుతీసి ఇద్దరు స్త్రీలకు సమానముగా ఇచ్చి కొత్త చీరలు కొనుక్కుని ధరించమని కోరినాను. వృధ్ధ స్త్రీలు సంతోషముతో నన్ను ఆశీర్వదించినారు. వారి చిరునవ్వును చూసిన తరువాత శ్రీ సాయి నానుండి వృధ్ధ స్త్రీల రూపములో నూతన వస్త్రాలు స్వీకరించారనిభావించినాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

బాబాతో సాయి బా ని స అనుభవాలు 13

బాబాతోసాయి బా ని అనుభవాలు 13


సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి 22, 42 . అధ్యాయాలలో సకల జీవరాసులలోనూ భగవంతుడిని చూడమని చెప్పినారు. లక్ష్మీ బాయిషిండే, ఒక రొట్టెముక్కనుపెట్టి ఆకలిని తీర్చిన శునక రూపంలో వచ్చింది తానేనని చెప్పారు. యెవరయితే ప్రాణులన్నిటిలోనూ తనని చూసి వాటి ఆకలిని తీరుస్తారో వారే తన నిజమైన భక్తులని చెప్పారు. ఆయన చెప్పిన బోధనలు సత్యమని నిరూపించేందుకు నాకు కూడా రెండు అనుభవాలు కలిగాయి. వాటిని నేను మీకిప్పుడు వివరిస్తున్నాను.

బాబాకి భోజనము పెట్టడానికి ద్వారకామాయికి వెళ్ళుతూ దారిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకి రొట్టెముక్క పెట్టి ద్వారకామాయిలోబాబాని దర్శించుకున్నప్పుడు బాబా అన్న మాటలు "లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది." యెవరయితే సకల జీవరాసిలోనూ భగవంతునిచూసివాటి ఆకలిని తీరుస్తారో వారు నాకు నిజమైన భక్తులని" బాబా చెప్పినారు.

అది 1991 సంవత్సరము దీపావళీ పండగ రోజు. రోజు సాయంత్రము నేను నా భార్య ఒక పురోహితుడిని పిలిచి నాయింటి మొదటి అంతస్తులో ఉన్న పూజా గదిలో లక్ష్మీ పూజ చేయ సాగాము. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. కాని నా మనసంతా సాయిమీదే లగ్నమయి ఉంది. లక్ష్మీ పూజ పూర్తి అయ్యేలోపులో శ్రీ సాయి ఏదో ఒక రూపములో వచ్చి నన్ను నా భార్యను ఆశీర్వదించినానేను సంతోషిస్తాను అని తలిచాను. శ్రీ సాయి ఒక స్నేహితుడి రూపములో గాని, నా బంధువు రూపములో గాని వచ్చి మమ్మలిని ఆశీర్వదిస్తారని ఊహించుకోసాగాను. పూజలో లక్ష్మీ దేవికి హారతి ఇస్తున్న సమయంలో నా కాళ్ళకు మెత్తటి బట్ట తాకిన అనుభూతిని పొందాను. నేను కింద నా కాళ్ళవైపు చూసుకున్నాను, నాకు ఆశ్చర్యము కలిగింది. ఒక పెద్ద పరిమాణములో ఉన్న బోదురు కప్ప నా పాదాలను తాక సాగినది.


బాబా కప్ప రూపములో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారా అనే భావన కలిగి కప్పకు నమస్కరించాను. రోజు వర్షము కూడా పడలేదే? అంతకు ముందు వారమురోజులలోకూడా ఎక్కడా వానలు పడలేదే? మరి బోదురుకప్ప యెక్కడినించి వచ్చినదని నా భార్య ఆశ్చర్యపడసాగినది. నేను నా భార్య ఆకప్పకు మరొక్కసారి నమస్కరించాము కప్ప సంతోషముతో ఒక్కొక్క మెట్టు దిగుతూ తోటలోనికి వెళ్ళిపోయినది. బాబా నన్ను నా భార్యను ఆశీర్వదించడానికి బోదురుకప్ప రూపములో వచ్చినారని భావించాను.

అది 1991 సంవత్సరము బక్రీదు పండగ రోజు. ఆఫీసుకు సెలవు ఉండటము వలన మధ్యాహ్న్నము పన్నెండు గంటలకు యింటిలో భోజనము చేసి తాంబూలము వేసుకుని వీధిలోకి వచ్చినాను. నా యింటి గేటుముందు నాలుగు అడుగుల యెత్తు ఉన్న ఒక తెల్లటి మేక కనపడింది మేకకు తెల్లటి గెడ్డము కూడా ఉన్నది.

మేక తాను ఆకలితో ఉన్నట్లుగా నావైపు జాలిగా చూడసాగింది. శ్రీ సాయి సచ్చరిత్ర 9 అధ్యాయములో బాబా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి"భగవంతుడిని జీవులన్నిటిలోనూ చూడుము." మరి బాబా నా యింటికి మేక రూపములో వచ్చి ఆకలితో ఉన్నానని చెపుతున్నారాఅని భావన కలిగింది. నేను నాభార్యను పిలిచి బాబా ఆకలితో ఉన్నారు ఏమయినా పెట్టగలవా అని అడిగినాను. అప్పటికి ఆమె బాబాకు భక్తురాలు కాదు. ఆమె కొంచెం హేళనగా మీ బాబా రాత్రి మిగిలిపోయిన రొట్టెలను తింటారా అని అడిగినది. నేను, నీవు ప్రేమతో పెడితే బాబా తప్పక తింటారని అన్నాను. నా భార్య ఒక నాలుగురోట్టెలు మేకకు పెట్టినది. మేక సంతోషముగా నాలుగురొట్టెలనుతింది, నేను చిన్న బకెట్ తో మంచినీరు పెట్టినాను. సంతోషముగా నీరు కూడా త్రాగి తృప్తిగా నావైపు నా భార్యవైపు చూసి వెళ్ళిపోయినది. బక్రీదు పండగ రోజున బాబా ఒక తెల్లటి మేక రూపములో వచ్చి నా యింట భోజనము చేసి నన్ను నా భార్యను ఆశీర్వదించారనే భావన కలిగింది.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు