సాయితోసాయి బా ని స అనుభవాలు 14
శ్రీ సాయి ధనవంతుల స్వప్నాలలో కనిపించి, వారి ద్వారా తాను చేయదలచిన కార్యాలను చేయించడానికి వారిని సాధనంగా ఉపయోగించుకునేవారు. ఆ పనులన్ని కూడా పేదవారికీ సమాజానికీ ఉపయోగపడేవిగా ఉండేవి. అటువంటి ఉదాహరణలలో అద్భుతమైనది బూటీవాడా నిర్మాణము. గోపాల్ ముకుంద్ బూటీకి కలలో సాయి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన బూటీ వాడాను నిర్మించాడు. ఈనాడు బాబా సమాధి మందిరము (బూటీవాడా) కోటానుకోట్ల సాయి భక్తులకు ప్రశాంతతను ప్రసాదించుచున్నది. శ్రీ సాయి సచ్చరిత్రలోని 45 వ అధ్యాయములోనిసంఘటను గుర్తు చేసుకుందాము. శ్రీ సాయి ఆనందరావ్ పాఖడే స్వప్నంలో కనపడి మాధవరావ్ దేశ్పాండేకి ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు. శ్రీ శ్యామా ఆ పట్టుధోవతీని స్వీకరించారు. అటువంటి అనుభవమే నాకు 1993 వ సంవత్సరములో జరిగింది.
1992 వ సంవత్సరం మే నెలలో మా అమ్మాయి వివాహము జరిగినది. 1993 సంవత్సరము సంక్రాంతి పండగ సందర్భముగా మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించడానికి 2.1.1993 న హైదరాబాదునుండివిజయవాడకు బస్సులో బయలుదేరాను. రాత్రి ప్రయాణము వల్ల బస్సులో నాకు కొంచెం నిద్ర పట్టింది. శ్రీ సాయి షిరిడీలోని సమాధి మందిరములో విగ్రహము పక్కన ఒక స్త్రీమూర్తి రూపములో నిలబడి నీవు నీవాళ్ళకు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నావే, మరి నాకు రెండు కొత్త చీరలు ఇవ్వరాదా అని అడిగిందామె. ఉదయము మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణములో బాబా స్త్రీమూర్తిరూపములో కోరిన రెండు కొత్త చీరలను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించసాగాను.
అది 4.1.1993 ఉదయము, శ్రీ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలు పారాయణ పూర్తి చేసాను. పారాయణ కాలములో ప్రతిదినము పిడికెడు బియ్యము ఒక సంచీలో వేసి ఉంచేవాడిని. పారాయణ అనంతరము ఆ బియ్యము పేదలకు పంచి పెట్టేవాడిని. ఆ రోజున ఆ బియ్యాన్ని గండిపేటలో ఉన్న ఒక వృధ్ధుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆసాయంత్రము ఆ ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ ఆశ్రమములో ఒక ఆరుగురు మగవారు ఇద్దరు ఆడవారు మాత్రమే ఉన్నారు. ఆ ఆశ్రమ మానేజరుకు ఆ బియ్యాన్ని ఇచ్చిన తరువాత బయటకు వస్తూండగా ఆ ఆశ్రమములో ఉన్న ఇద్దరు వృధ్ధ స్త్రీలు నన్ను చిరునవ్వుతో పలకరించారు. అప్పుడు నాకు 2.1.1993 రాత్రి బాబా ఒక స్త్రీ రూపములో స్వప్నములో దర్శనమిచ్చి రెండు కొత్త చీరలు కోరిన సంఘటన గుర్తుకు వచ్చినది.. వెంటనే నేను నా పర్సులోనించి 202/- రూపాయలుతీసి ఆ ఇద్దరు స్త్రీలకు సమానముగా ఇచ్చి కొత్త చీరలు కొనుక్కుని ధరించమని కోరినాను. ఆ వృధ్ధ స్త్రీలు సంతోషముతో నన్ను ఆశీర్వదించినారు. వారి చిరునవ్వును చూసిన తరువాత శ్రీ సాయి నానుండి ఆ వృధ్ధ స్త్రీల రూపములో నూతన వస్త్రాలు స్వీకరించారనిభావించినాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

0 comments:
Post a Comment