
శ్రీ శిరిడీ సాయి తత్వం ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు,...