Total Pageviews

Friday, July 31, 2015

ఆత్మజ్ఞాన౦ కలిగించే సాయితత్వం...

భక్తి, జ్ఞానం ఒక్కటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం. నిరంతరం భగవంతుని పైనే మన దృష్టి . మన కోరికలు తీరిస్తే మనల్ని భగవంతుడు అనుగ్రహి౦చాడని సంబరపడతాం.తీరకుంటే ''మన ఖర్మ'అనుకుని బాధపడతాం.భగవంతునికి , భక్తునికి ఉన్నా సంబంధం అంత వరకేనా ? భక్తిలోని భావం ఇదేనా ?! భక్తిభావం నిస్సందేహంగా గొప్పదే తీరిక లేని జీవితంలో కాసేపు ఓపిక తెచ్చుకుని భగవంతునిపై దృష్టి పెట్టగలుగు తున్నామంటే అది మరీ గొప్ప విషయం .అసలు మనలో భక్తి కేవలం భగవంతుడిని కొలవటానికే పరిమితం కాకూడదు భగవదారాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్నా విశిష్టతను తెలుసుకోలే౦. దైవం ఏం చెప్పిందో గ్రహించలేం . భక్తి ముక్తిదాయకమైనదే . అయితే దానికి పైన్నున జ్ఞానమనే పై మెట్టు ఎక్కితేనే మోక్షం. అదే ఆత్మజ్ఞానం కృషితో ఆత్మజ్ఞానాన్ని సాధించిన మనిషి ఋషి అవుతాడు . Athma Gnanam Kaliginche Saitathvam
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ?ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు. మన గురించి మనం తెలుసుకోవటమే .మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్ళించు కోవటమే .ఈ జ్ఞానం కలగటానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి . భగవంతుని రూపలావణ్య లను మాత్రమే కాక అయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి .ఆ దివ్యత్వంలో వేలవేల ఉపదేశాలు , ప్రబోధాలు .మహిత సత్యాలు వలయాల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి . వాటిని ఒడిసి పట్టుకోవాలి . వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి .ఏది మంచి ?ఏది చెడు?ఏది ప్రగతికారకం? ఏది ప్రతిబ౦ధకం ?అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి . అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాం. ఆదర్సనియమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదుకోగలుగుతాం .మనకు ఏది కావాలో ?ఏది వద్దో ? తెలుస్తుంది .మన లక్ష్యాలేమీటో స్పష్టంగా కనిపిస్తాయి . వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు విజయవంతంమవుతాయి .అప్పుడే మానవ జన్మకు సార్ధకత.
సాయి తన అవతార కాలమంత ఎన్నో ఉపదేశాలు ప్రబోధిస్తూ మానవ జీవితంలోని మహిత సత్యాలను చాటారు.కానీ, సాయిని మనం కోరికలు తీర్చే కల్పవృక్షంగానే కొలుస్తాం . అంతే తప్ప సాయి ఉపదేశాల్లోని సారాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యట్లేదు .మనిషి ఉన్నతిని సాధించటానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైనది .పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ముఖ్యంకాదని , చేసే పనిని మనస్సు పెట్టి చేయటం కూడా భక్తీ యోగామేనని , అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని ఉపదేశించారు. వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవిత పరమార్ధం నెరవేరుతుంది .
సాయి ఒక సందర్భంలో '' నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్ధానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కటానికి ప్రయత్నిస్తాడు .ఏది మంచి ?ఏదిచెడు?తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని పొందుతాడు.అప్పుడే జ్ఞానం కలుగుతుంది '' అంటారు. సాయి కృప వలన మనందరి కోరికలు తీరుతాయి కాబట్టి ,ఇక సాయి ఏం చెప్పారో , సాయి ఉపదేశాల్లోని సారమేమిటో తెలుసుకుందాం వాటిని నిత్యజీవితంలో ఆచరిద్దాం రండి... సాయిపథంలో నడిచి మన బతుకుల్ని తీయబరుచుకుందాం .'సాయి'ని మనస్పూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాని ముటకట్టుకుందాం.

0 comments:

Post a Comment