చాలామంది "మేము సాయి బాబా మందిరం లో 108 ప్రదక్షిణాలు చేసాము, 9 వారాలు పూజ చేసాము. అన్నదానానికి విరాళం ఇచ్చాము. సాయి సచ్చరిత్ర ప్రతి దినమూ పారాయణ చేస్తున్నాము, కానీ మా సమస్యలు ఆ బాబా తీర్చడం లేదు" అని వాపోతుంటారు. ఏదో గబగబా మందిరం చుట్టూ తిరిగేసి, పారాయణ పేరుతొ గబా గబా చరిత్ర చదివేసి, అమ్మయ్య, ఇవాల్టికి ఐపోయింది, ఇంక భోజనం చేసేద్దాం, పాడుకుందాం అనే పధ్ధతి ఉన్నవారి పూజలకు బాబా ఎలా సంతృప్తి చెందుతారు? అయన తన జీవిత కాలంలో ఎన్నో సూక్తులు , నీతులు చెప్పారు. ఆయనకు నిజమైన పూజ అంటే, ఆ సూక్తులను , నీతులను పాటించడమే. ఉదాహరణకు బాబా " ఎవరితోటీ గొడవలు పడవద్దు, వివాదాలకు అహంకారమే మూలకారణం" అని చెప్పారు ఎన్నో సందర్భాలలో. మరి మనం అహంకారం వీదనపుడు, మన పూజలు బాబా ఎలా స్వీకరిస్తారు? బాబా మన నుంచి పూజలు, కానుకలు కోరలేదు. బాబా చెప్పిన మాటలు చదివి, అర్ధం చేసుకొని, అరిషడ్వర్గాలను జయించి మన జీవితాన్ని సుగమం చేసుకోమని చెప్పారు.
సాయి
సచ్చరిత సప్తాహ పారాయణ మొదలు పెట్టాలి అనుకునే ముందు ఒకసారి సాయి చరిత్రను
క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు చదవండి. బాబా బోధలు మనసులో ఉంచుకోండి. బాబా
మనకు ఏ ఏ బోధలు చేసారో, అవి ఒక పెన్నుతోనో, పెన్సిల్ తోనో అండర్ లైన్
చేసుకోండి. అవి మళ్లీ ఒకటికి రెండు సార్లు చదువుకోండి. మనం బాబా
చెప్పినట్టు ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదాహరణకు "ఎవరైనా
ఏదైనా అడిగినప్పుడు ఉంటె ఇవ్వాలి, లేదంటే లేదు అని చెప్పాలి, ఒకవేళ నీకు
ఇవ్వడం ఇష్టం లేకుంటే ఆ విషయమే నెమ్మదిగా చెప్పు, అరవడం దేనికి ?" అని బాబా
ఒక సందర్భం లో చెప్పారు. ఆ సంగతి మనం పాటిస్తున్నామా లేదా అని ఆత్మ
పరిశీలన చేసుకోవాలి. ఇలా బాబా చెప్పిన బోధలు పాటించడం మొదలు పెడితే,
సులభంగా అందరూ అరిషడ్వర్గాలను జయించా వచ్చు.
ఈ రకమైన ప్రవర్తన అలవాటు చేసుకున్నపుడు, మన మాటలతో, చేతలతో ఇతరులకు హాని కలిగించనపుడు బాబా మన పట్ల సంతృప్తి చెందుతారు. మన గోడు వింటారు. మన బాధలు తీరుస్తారు. ఇది బాబా చరిత్ర పారాయణ చేసే అసలు పధ్ధతి.
జై సాయి రామ్...
ఈ రకమైన ప్రవర్తన అలవాటు చేసుకున్నపుడు, మన మాటలతో, చేతలతో ఇతరులకు హాని కలిగించనపుడు బాబా మన పట్ల సంతృప్తి చెందుతారు. మన గోడు వింటారు. మన బాధలు తీరుస్తారు. ఇది బాబా చరిత్ర పారాయణ చేసే అసలు పధ్ధతి.
జై సాయి రామ్...
0 comments:
Post a Comment