Total Pageviews

Friday, July 11, 2014

గురు పౌర్ణమి.

"ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు

గురు పౌర్ణమి.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాన్థస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః
అని గురుదేవులకు నమస్కరిస్తూ పండగ జరుపుకోవడం శిష్యులకు అనూచానంగా వస్తున్న సదాచారం - అందరికి ఆచరనీయమైనది. మరింతగా సాధకులను సాధనోన్ముఖులను చేసే సాధనం గురు పౌర్ణమి.
గురొః ప్రసాదాదన్యాత్ర నాస్తి సుఖం మహీతలే
గురు పౌర్ణమి నాడు అట్టి గురు అనుగ్రహాన్ని పొందితీరాలి .
వేదాలను పంచమ వేదమైన మహాభారతాన్ని పురాణాలను మనకందిచిన ఆర్షవాజ్మయానికి మూల పురుషుడైన వ్యాస మహర్షి జన్మించిన ఆషాడ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా చెప్పబడినది. వ్యాసుడు జగద్గురువు కనుకనే ఆయన జయంతిని గురుపూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున వ్యాస భగవానుని స్మరించడము పూజించడము మన విధి.
అపరనారాయణుడు అయిన వేద వ్యాసుని వలననే మన భారతీయ సంస్కృతీ పరిపుష్టమయ్యింది. వేదాలు విభజించి, అష్టాదశ మహాపురాణాలను ఏర్పరచి, మహాభారత ఇతిహాసాన్ని రచించి, మహా భాగవతాన్ని ప్రసాదించి, బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ మహాత్ముని ఈ రోజు అర్చించడము మన ధర్మము.
గురువు అంటే అజ్ఞానాన్ని దూరము చేసేవాడని అర్ధం, గురువులను గౌరవించడానికి ప్రతి ఆషాడ పూర్ణిమ నాడు మనము గురుపూర్ణిమను జరుపుకొంటాము, భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయములో గురు శిష్య సాంప్రదాయము అతి విశిష్టమైనది, పూర్వము ఉపనయనానంతరము తల్లి తండ్రులను వీడి, గురువు వద్దనే వుంది గురు శుశ్రూష చేస్తూ గురుకులములో విద్యనూ నేర్చుకునేవారు, అందుకే మాత్రు దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నమస్కరిస్తాము, 'గు' అంటే చీకటి - 'రు' అంటే ప్రకాశం. చీకటిని తొలగించి ప్రకాశింప చేసేవాడు గురువు, అజ్ఞానమనే చీకటిని ఆధ్యాత్మిక విద్యను భోదించే జ్ఞాన ప్రకాశవంతునిగా శిష్యుణ్ణి తీర్చి దిద్దడమే ఆనాటి గురువుల లక్ష్యం. ఆ గురువు అనుగ్రహముతో విద్యనూ పూర్తి చేసుకుని ధర్మ బద్దముగా జీవన యాత్రను సాగించేవారు శిష్యులు. గురువుల దివ్యఆశీస్సులను మరల మరల పొందడానికి అవకాశం కల్పిస్తుంది ఈ గురు పూర్ణిమ.

0 comments:

Post a Comment