
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో క్రీ.శ. 1850-1950 ల మధ్య కాలం ఎంతో
విశిష్టమైనది. కారణం ఈ మధ్య కాలంలోనే శ్రీ శిరిడీ సాయిబాబా, మరికొందరు మహా
సిధ్ధ పురుషులు ఆధ్యాత్మిక పథంలో భౌతికంగా దర్శనమిచ్చారు. ప్రపంచ
ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించే ఒక మహాత్ముల చక్రముందని, ఆ చక్రానికి 72
మంది వివిధ మతాలకు చెందిన సిధ్ధ పురుషులు చక్ర పత్రాలైతే, శ్రీ శిరిడి
సాయినాధుడు ఇరుసులా వుంటారని- ఒక
సాంప్రదాయం. వారిలో శ్రీ శిరిడి సమగ్ర జీవిత చరిత్రను, వారి సమకాలికులైన...