Total Pageviews

Tuesday, January 28, 2014

సాయీ నీలీలలు వర్ణించ తరమా? సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/

ఈ అద్భుతమైన లీల శ్రీ ప్యారేలాల్ ఖన్న, 13 థియేటర్ రోడ్ కోల్ కత్తా వారివి. ఈ లీల శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక నవంబరు-డిసెంబరు 2003వ.సంవత్సరంలో (61వ.నంబరు) ప్రచురింపబడింది. అందులో ప్రచురింపబడిన ఈ లీల యధాతధంగా మీకందిస్తున్నాను.
నేను నాభార్య 1950వ.సంవత్సరంలో రామేశ్వరం వెళ్ళాము. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. మేమెక్కడికి వెళ్ళినా మాకు తలపాగా చుట్టుకొని వున్న ఒక యోగి చిత్రపటాలు మాకు దర్శనమిస్తూ ఉండేవి.
ఆయనెవరో మాకు తెలీదు. ఆఖరికి ఆఫొటోలు శ్రీషిరిడీ సాయిబాబా వారివని తెలిసింది.
నాతమ్ముడు షిరిడీ వెళ్ళాడు. షిరిడీనించి వచ్చిన తరువాత మమ్మల్ని కూడా షిరిడీ వెళ్ళమన్నాడు. ఆసమయంలో నేను పెద్ద కష్టంలో ఉన్నాను.ఆఫీసులో విపరీతమయిన పని వత్తిడి. అంతే కాదు నాభార్యకు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించవలసిన పరిస్థితి.
ఆమెకు బొంబాయిలో మేజర్ ఆపరేషన్ చేయించడానికి వెళ్ళేముందు బాబా ఆశీర్వాదం కోసం మేము 1982 ఏప్రిల్ లో బొంబాయి వెళ్ళాము. షిరిడీ యింకా చేరుకోకముందే బాబా మమ్మల్ని అనుగ్రహించారు.
మేము రైలులో ఉండగా ఎఱ్ఱటి దుస్తులతో ఒక ఫకీరు మా బోగీలోకి వచ్చాడు. అతను మాకష్టాలన్నీ తీరిపోతాయని అర్ధం వచ్చేటట్లుగా మరాఠీలో ఒక పాట పాడాడు. అతను మమ్మల్ని రూ.5/-అడిగాడు. మేమతనికి 5 రూపాయలు యిచ్చాము. అతను మమ్మల్ని దీవించి మిగిలినవారెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు.
షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొన్న తరువాత నాభార్యకు ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో నాకు టైఫాయిడ్ వచ్చి జ్వరం తీవ్రంగా ఉంది. మంచం మీదనించి లేవలేని పరిస్థితి. ఆస్పత్రికి వెళ్ళి నాభార్యకు సపర్యలు చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే బాబావారి విశేషమైన అధ్బుతమైన దయ, అనుగ్రహం మామీద ప్రసరించింది. ఎవ్వరూ అడగకుండానే ఒక నర్సు వచ్చింది. ఆనర్సు నాభార్య దగ్గరే ఉండి రాత్రంతా ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకుని సపర్యలు చేసింది. పేషెంట్ అయిన నాభార్యకు యివేమీ తెలియవు. మరునాడు ఉదయం 7గంటలకు నర్సు తాను పేదరాలినని తాను చేసిన సేవకు డబ్బు యిమ్మని అడిగింది. కాని నాభార్య వద్ద డబ్బు లేకపోవడంతో నర్సును మరుసటి రోజు రమ్మనమని తప్పకుండా డబ్బు యిస్తానని మాట యిచ్చింది. అపుడా నర్సు నాభార్యను తలనుంచి పొట్టవరకు చేతితో తాకి దీవించి వెళ్ళిపోయింది. ఆతరువాత ఆనర్సు మరలా రాలేదు. ఆమె మాకెక్కడా కనపడలేదు కూడా.
తరువాత డాక్టర్ వచ్చి తనవద్ద అటువంటి నర్సు ఎవరూ పని చేయటల్లేదని చెప్పాడు. మేము 26వ.తారీకున ఆస్పత్రినించి వచ్చేశాము. నర్సు మరలా రాలేదు.

ఎవరూ లేని పరిస్థితిలో బాబాయే నర్సు రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న నా భార్యకు సపర్యలు చేశారని మాకు గట్టి నమ్మకం కలిగింది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(పాఠకులకు ఒక మనవి: పత్రికలో రచయిత వ్రాసిన ప్రకారం ఆయన బాబాకు 5ప్. అని ప్రచురితమయి ఉంది. అయితే అవ్ 5 పైసలా? లెక 5 రూపాయలా? పీ.అని పొరపాటుగా ప్రచురితమయిందో తెలీదు. కాని 1980 దశకంలో 5 పైసలు చలామణీలో లేవు కాబట్టి 5 రూపాయలుగా నేను భావించి రాయడం జరిగింది. పతికలో ఈ లీల 61వ.నంబరు నర్సు రూపంలో వచ్చిన సాయిగా ప్రచురితమయింది.)

0 comments:

Post a Comment