డిసెంబర్ 1916 లో వామన్ రావు తీవ్రమైన ఆకలి లేమి తో బాధపడ్డాడు, ఏమీ తినలేకుండా వుండేవాడు, అందువలన బాగా బరువు తగ్గాడు. పునరారోగ్యప్రాప్తి కోసం ఇంటికి వెళ్లాడు. ఒక రోజు ఉదయం 9 గంటలకు ఒక ఫకీరు వామన్ రావు ఇంటి గుమ్మం వద్దకు వచ్చి వామన్ రావుని, “నీవు వామన్ రావు ఎల్.ఎల్.బి వేనా” అని అడిగాడు. దానికి వామన్ రావు ఫకీరు ఆ విషయం ఎందుకు తెలిసికోవాలనుకుంటున్నాడో మరియూ తాను ఫకీరుకి ఏ విధంగా సహాయ పడగలడో అని ఫకీరుని ప్రశ్నించాడు. “సాయి బాబా నాకు ఒక రూపాయ ఇచ్చారు, వివిధ దర్ఘాలకు వెళ్లి వామన్ రావు ఎల్.ఎల్.బి ఆరోగ్యం కోసమూ, సౌఖ్యమ్ కోసమూ ప్రార్దించమన్నారు” అని చెప్పాడా ఫకీరు.
ఫకీరు చెప్పిందానికి వామన్ రావు ఆనందానుమగ్నుడయ్యాడు. “బాబా కి తన భక్తుల పట్ల ఎంతటి ప్రేమా, కరుణా! నేను షిరిడీకి ఎంతో దూరంగా వున్నాను, బాబా కీ మరియూ ఈ ఫకీరుకి తప్ప నేను ఆకలిలేమి తో బాధపడుతున్నానన్న సంగతి తెలియదు. నా సద్గురువు యొక్క షరతులు లేని దయకి ఈ చర్య సారం గా నిలుస్తుంది. సద్గురువు తన భక్తుడు తన కృపకి పాత్రుడా, కాదా అన్నది భావించుకోరు, బాబా నా గుణగణాలను లెక్కలోనికి తీసికోలేదు, ఒకవేళ బాబా అలా లెక్కలోనికి తీసికుని వుంటే నేను ఆయన కృపకి పాత్రుడ్ని కాలేకపోదును, ఎందుకంటే బాబా కి అన్నీ తెలుసును. నేను తన కృపకి పాత్రుడ్ని కాదన్న సంగతిని పట్టించుకోకుండా ప్రేమించే జననీ జనకుల్లాగ ఈ ఫకీరుని నా కోసం ప్రార్దించమని చెప్పారు. బాబా ఋణాన్ని నేను ఏ విధంగా తీర్చికోగలను? బాబాకి నేను ఎంతో దక్షిణ సమర్పించుకున్నందువలనే బాబా ఇదంతా చేసి వుంటారని ఎవరైనా అనుకుంటే వారు పొరపడినట్లే! బాబాకి నేనిచ్చిన దానికన్నా పదుల, వందల రెట్లు దక్షిణ ఇచ్చిన వారెందరో వున్నారు.”

ఒకసారి వామన్ రావు నర్వేకర్ కి విపరీతమైన జ్వరము వచ్చింది, అతని కుమారుడు బాబా కి అయిదువందల రూపాయల దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా దక్షిణ స్వీకరించన వెంటనే నర్వేకర్ కి చలి ఎక్కువగా పుట్టి జ్వరము పెరిగి, ఆ తరువాత కోలుకున్నాడు. నార్వేకర్ లాగా సంపన్నులైన భక్తులు బాబా కెందరో వున్నారు, వారితో పోల్చుకుంటే నేనెంతటి వాడిని? అయినా ఇవేవీ ఆలోచించకుండా బాబా నాపై కరుణరసపూర్వకమైన ప్రేమని కురిపించారు. బాబా నాపై చూపిన కొలవలేని ఈ అనుగ్రహానికి నేను తిరిగి ఏ విధంగానూ చెల్లించుకోలేను. ఇటువంటి అనుగ్రహాలు నాపై బాబా ఎన్నోమారులు చూపారు, ఒక్కొక్కటిగా నేను లెక్కపెట్టడం మొదలు పెడితే ఈ జీవితంచాలదు.
మన సద్గురు సాయిబాబా పరబ్రహ్మ. ఆయన అన్నిటా వ్యాపించివున్నారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి మరియూ సర్వశక్తిమంతుడు. విశ్వంలోని ఏదీ కూడా ఆయన కి తెలియకుండా జరగదు.
No comments:
Post a Comment