సాయిని చాలాకాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ యిలా చెప్పింది : “మావారు 1909లో పండరిలో వున్నారు. నేను శిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, 'అమ్మా నీవు వెంటనే పండరి వెళ్ళు. నేను తోడుగా వుంటాను. నాకు రైలు అక్కరలేదు' అన్నారు. నేను మరిద్దరితో కలసి వెళ్ళేసరికి మావారు అక్కడ పని వదలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడీ చేరి, దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను: ఒక పకీరు వచ్చి, 'ఆలోచిస్తావేమి? వెంటనే వెళ్ళు, మీవారు థోండ్ స్టేషన్లో వున్నారు" అన్నాడు. నా దగ్గర చార్టీలు లేవంటే అతడు మూడు టిక్కెటు యిచ్చాడు. మేము థోండ్ చేరేసరికి, మావారక్కడ కునుకు తీసూంటే కలలో ఫకీరు కన్పించి, 'నా తల్లినిలా అశ్రద్ధ చేయకు, యిప్పుడు రైల్లో వస్తుంది' అన్నారట. మావారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్ళారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కన్పించినది వారేనన్నారు.
నేను 48 సం||ల వరకూ గర్భిణిని కానేలేదు. బాబా 1918లో ఒకసారి, తల్లీ, నీకేమి కావాలి?' అన్నారు. మీకు తెలుసు!' అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సం.లకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయస్సులో గర్భం అవదని, అది వ్రణమనీ వైద్యులన్నారుగాని నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించు కోనన్నాను. చిత్రం! నాకు సకాలంలో సుఖప్రసవమైంది.
అలానే మరొకసారి కలలో బాబా, "నీ రాముని తీసుకుపోతాను. నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు! అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మావారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్ళేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను. చాతుర్మాస్యమైన ఏడవ రోజున మావారు టీ త్రాగి విషు సహస్రనామము, ఆరతి చదివించుకొని విన్నారు. డాక్టరు ప్రమాదం తప్పిందన్నారుగాని, నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన, 'శ్రీరామ్' అంటూ కన్నుమూశారు". అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తనుగూడ సాయి అనుగ్రహించారన్నమాట!

No comments:
Post a Comment