Tuesday, November 25, 2014

శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!

 
శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!
ఒవి 139 – 144, 43 వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరితము:
ఆయన వుపదేశించిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి, దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. ’ఎనిమిది సంవత్సరాల బాలుడినై ఈ జగత్తు లో తర్వాత నేను ప్రకటమౌతాను’ అని మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి మహత్ముల మాటలు, ఎవరూ వీటిని వ్యర్దమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదేపని చేసారు. ఆయన ఎక్కడికో విహారార్దమై వెళ్లారు, తిరిగి వస్తారు అన్న విశ్వాసం భక్తుల మనసుల్లో పూర్తిగా వుంది.
గత సంవత్సరం శ్రీ దత్తాత్రేయ సాయి ఆశ్రమం, కపిలాష్, ఒడిషా లో జరిగిన వార్షికోత్సవాలలో పై ఒవిల గురించి ఉత్కళ విశ్వవిద్యాలయం లో ఫొఫెసర్ గా పనిచేసి రిటైరైన శ్రీ బిష్ణు ప్రసన్న ఆచార్య తో జరిగిన మాటలలో, శ్రీ ఆచార్య తనదైన శైలిలో ఆ ఒవిల గురించి విశ్లేషించారు. ఆ విశ్లేషణ సరయినదిగా నాకనిపించడంతో ఇక్కడ పంచుకుంటున్నాను. అన్నా సాహెబ్ డాభోల్కర్ ని హేమాడ్ పంత్ గా సంభోదించిన సాయి ధాబోల్కర్ తన అహంకారాన్ని వారి పాదాల చెంత అర్పించి, లీలలను సేకరించి ఆయన చరిత్రని వ్రాయడానికి హేమాడ్ పంత్ కి అనుమతినిచ్చారు. అన్నా సాహెబ్ బాబా లీలలను సేకరించి, చిన్న చిన్న కాగితాలమీద వ్రాసికునేవారు. బాబా మహాసమాధి చెందిన నాలుగు సంవత్సరాల తర్వాత 1922 చైత్ర మాసంలో హేమాఢ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికుపక్రమించారు. 70 సంవత్సరాల వయసులో జూలై 15, 1929 న హేమాఢ్ పంత్ సాయి లీనులయ్యారు. 1929 జ్యేష్ట మాసానికి శ్రీ సాయి సచ్చరిత్ర్ వ్రాయడమ్ ముగిసినా, ధాబోల్కర్ ప్రస్తావించిన విషయసూచిక (అవతరణిక) మాత్రమ్ దొరకలేదు. శ్రీ బాల కృష్ణ దేవ్ అవతరణిక వ్రాసి, 53 వ అధ్యాయాన్ని జత పరిచారు.
శ్రీ సాయి సచ్చరిత రామచంద్ర ఆత్మారాం తార్కడ్ చే 26 నవంబరు 1930 వ తేదీన మొదటిగా విడుదల చేయబడింది, సచ్చరిత్ర పై హక్కులన్నీ సంస్థాన్ వద్దనే వున్నాయి,
ఇక్కడే ప్రొఫెసర్ ఆచార్య హేమాఢ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర్ ను వ్రాయడం 1922 లో ప్రారంభించినప్పటినుండి, విడుదలైన 1930 వరకూ ఎనిమిది సంవత్సరాలు, ఎనిమిది సంవత్సరాల బాలుడిగా వస్తానన్న బాబా చెప్పిన మాట నిజమయ్యాయనడానికి తార్కాణంగా తీసికోవచ్చునని విశ్లేషించారు. అంటే శ్రీ సాయి సచ్చరిత గా సాయే మళ్లీ అవతరించారు అంటారు శ్రీ ఆచార్య. అంటే శ్రీ సాయే శ్రీ సాయి సచ్చరిత, శ్రీ సాయి సచ్చరితే శ్రీ సాయి అన్న మాట.
నిజానికి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మరియు ఇతర యోగుల జీవిత చరిత్రలలో వారి పుట్టు పూర్వోత్తరాలూ, విధ్యాబ్యాసవివరాలు, కుటుంబ నేపధ్యమూ, జ్ఞాన సముపార్జన, సన్యాస స్వీకరణ, మహాసమాధి మొదలుగాగల వివరాలుంటాయి. కానీ శ్రీ సాయి చరిత్రలో బాబా మహాసమాధిగురించి తప్ప మిగిలిన దంతా సాయి మహిమల సంకలనమే, ఆయన బోధనలు, ఆయన చర్యలూ సచ్చరిత్రలో చోటుచేసికున్నాయి. సచ్చరిత అంటే సత్ అంటే సత్యమైన చరిత్ అంటే చరిత్ర అనగా సత్యమైన చరిత్ర, ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత్ర లో వచ్చిన పాత్రల వారసులు సచ్చరితలోని సంఘటనలకి సాక్షులా అన్నట్లుగా ఇప్పటికీ జీవించే వున్నారు.
అన్నాసాహెబ్ దాబోల్కర్ సాయి సచ్చరిత ముగించకుండానే సాయిలీనులైనారు. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధావిష్కరణ ను వారు చూడలేదు. సచ్చరితకి ముగింపులేదని బాబా ఈ విధంగా చెప్పారనిపిస్తుంది. బాబా మహాసమాధి చెందిన 96 సంవత్సారల తర్వాత కూడా బాబా వునికి ని భక్తులు అనుభవించగలుగుతున్నారంటే సచ్చరిత కి ముగింపు లేదనడానికి అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏమి కావాలి.
ఈ రోజు శ్రీ సాయి సచ్చరిత్ర్ విడుదలైన రోజు, 84 సంవత్సరాల క్రితం ఈ రోజు శ్రీ సాయిసచ్చరిత్ర మొట్టమొదటి సారి విడుదలైంది. సాయి సచ్చరిత్ర ని సాయి లానే ఆరాధిద్దాం, పారాయణ చేద్దాం!

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment