Total Pageviews

Sunday, November 2, 2014

" "గురుస్థాన్"

*ఆ వేపచెట్టు కింద నిరంతరం ధ్యానం చేస్తూండేవాడు బాబా.ఎవ్వరైనా పలకరించిన మౌనంగా వుండేవాడు.ఎండ మండిన,చలి వణికెత్తినా భయం లేకుండా రాత్రింబగళ్లు వేపచెట్టు క్రిందే నివశించేవాడు బాబా.గ్ర్రామస్తులు జాలిపడి అన్నమో,రొట్టెలొ తెచ్చిఇస్తే తినేవాడు గాదు.వాటి క్రిమి కీటకాలు ముసురుతున్నా,కుక్కలు,పిల్లులు ఎగబడి తింటున్నా పట్టించుకొనేవాడు కాదు.ఆకలినిపిస్తే అవి తిని మిగిలిన దానిని రెండు ముద్దలు తినేవాడు.అప్పడు డప్పడు సమీపంలొ అడవిలొకి పొతుండేవారు.
*షిరిడిలొని ఆలయల్లొ ముఖ్యమైనది ఖండొభా ఆలయం.వీరభద్రుడు గ్రామదేవత అక్కడ వెలిశాడు.ఒకరొజు ఖండొభ జాతర జరుగొతుంది.వూరంతా భక్తితొ నినాదాలు చేస్తూ వూగిపొతొంది. ఉన్నట్లుండి ఒక వ్యక్తికి పూనకం వచ్చింది.ఆ వ్యక్తికి ఖండొభ ఆవహించింది.ఈ వేపచెట్టు కిందనున్న బాబా ఎవరు అని పూజరీ మహల్సవతి ని తీసుకొని వేపచెట్టు దగ్గరకి వచ్చాడు. ఆ సమయంలొ బాబా లేడు.వేపచెట్టు కింద తవ్వమని చెప్పాడు.అక్కడ గొతిలొ ఒక పెద్ద బండరాయి కనిపించింది.ఆ రాతిని తొలగించగా దాని కింద ద్రుశ్యం చూసి అందరూ ఆశ్శర్య పొయారు.బండరాతి కింద పెద్ద సొరంగం .అందులొకి పొవడానికి మెట్లు ఉన్నాయి.అక్కడ ప్రమిదలు వెలుగుతున్నాయి.జపమాలలు,ఆసనాలు,తిని వదిలేసిన ఆహర పదార్థములు ఉన్నాయి.మూసివున్న గ్రుహంలొ దీపారాదనలు,తపస్సు ద్రశ్యాలు ఎలా సాధ్యం.అని అంటుండగా...అపుడు పూనకంతొ వున్న వ్యక్తి,ఇక్కడ బాబా12 యేళ్లు తపస్సు చేశాడు అని చెప్పగా గ్రామస్తులు విస్తుపొయారు.
*అంతలొనే సుడిగాలిలా అక్కడికి వచ్చాడు.నాకు తెలియకుండా ఎందుకు చేశారు ఈపని అని కేకలు వేస్తూ..ఇది మా గురుస్థానం...పవిత్ర ప్రదేశం...మూసేయ్యండి అని చెప్పి యథాప్రకారంగా మూయించాడు బాబా.అనంతరం గ్రామస్తులు అడిగిన ప్రశ్నలన్నింటికి "అల్లా మాలిక్"అని ఒకే సమాదానం చెప్పి మౌనంగా ఉండిపొయాడు బాబా.
"ఆ వేపచెట్టు క్రింది ప్రదేశమే నేడు గురుస్థాన్ గా ప్రసిద్దిగాంచుచున్నది"

0 comments:

Post a Comment