జై సాయి రామ్.
Saturday, May 31, 2014
బాబా పట్ల అచంచల మైన విశ్వాసం, ప్రేమతో కూడిన సహనం.
ఏదైనా సమస్యలు వచ్చినపుడు భక్తులు సహజంగా బాబా వారు నాకే ఇన్ని కష్టాలు
పెట్టారు ఎందుకు? నేను చేసిన తప్పు ఏమిటి అని బాధ పడుతుంటారు. బాబా గారు
తనకు ఇష్టమైన భక్తులను నిరంతరం పరీక్ష చేస్తూ ఉంటారు. అలవి కాని సమస్యలు
ఇచ్చి వారి యొక్క గుండె నిబ్బరం ఎలా ఉందొ పరీక్షిస్తూ ఉంటారు. ఆ సమస్యలను
అధిగమించే గుండె ధైర్యాన్ని కూడా ఆయనే మనకు ఇస్తారు. ఎంతకాలం పరీక్షిస్తారు
అని మనం ఒక్కోసారి ఆయనను నిందిస్తూ ఉంటాము కూడా. కానీ అయన అది
పట్టించుకోరు. పిల్లలు నిందిస్తే తల్లి బాధపడుతుందా ఎక్కడైనా? అలాగే బాబా
వారు కూడా. అయన పరీక్ష కొన్ని రోజులు కావచ్చు, వారాలు, నెలలు, ఒక్కోసారి
కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ పరీక్షల ద్వారా మనకు అయన మిద ద్రుఢమైన
విశ్వాసం కలుగుతుంది. తద్వారా బాబా మన వెంటనే ఉన్నారు అనే ధైర్యం
కలుగుతుంది. అయన పట్ల అచంచలమైన విశ్వాసం భక్తులకు కలగటానికే బాబా ఎప్పుడూ
ఆలోచిస్తారు. ఒకసారి అయన పట్ల మనకు విశ్వాసం కలిగితే ఇంక మన చేయి అయన
వదలరు. ఇంక అక్కడి నుండి మన జీవితం లో చెప్పలేని మార్పులు వస్తాయి. ప్రతి
అడుగు లోను విజయం మనలను వరిస్తుంది. బాబా ఎప్పుడూ చెప్పినట్టు అయన మన నుంచి
కోరేది అచంచల మైన విశ్వాసం, ప్రేమతో కూడిన సహనం.
No comments:
Post a Comment