Total Pageviews

Wednesday, March 19, 2014

సాయిబాబా దర్శనం

సాయిబాబాను చూడాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారు. అయితే తమ ఇష్టం వచ్చినట్లు చుట్టుముట్టేవారు కాదు. ఎవరైనా సరే తమ వంతు వచ్చేవరకు ఆగేవారు. బాబాకు కనుక ఇష్టం లేకుంటే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేసేవారు కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా బాబా దర్శనభాగ్యం కలిగేది కాదు. కనీసం ఆయన నామాన్ని కూడా స్మరించలేక పోయేవారు.
సాయిబాబా మహా సమాధి చెందకముందు ఆయనను తృప్తిగా దర్శించుకోవాలని వెళ్ళిన ఎందరో భక్తులకు నిరాశే ఎదురైంది. తమ కోరిక తీరలేదని నిరాశగా చెప్పిన భక్తులున్నారు. అదృష్టవంతులకు మాత్రమే బాబా దర్శనభాగ్యం కలిగింది.
తనను చూడాలని వచ్చిన కొందరు భక్తులను సాయిబాబా కొన్నాళ్ళు అక్కడే ఉండమనేవారు. ఎవరైనా భక్తులు బాబా వద్దు అంటున్నా వినకుండా బయలుదేరితే, మళ్ళీ వెనక్కి రావలసి వచ్చేది. అలాంటి అనుభవాలు ఎదురయ్యాక ఆయన సమ్మతిస్తేనే వెనక్కు వెళ్ళేవారు. ఇంకొందరిని పూర్తిగా షిరిడీలోనే స్థిరపడమని చెప్పేవారు. మరికొందరు అక్కడికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక పోయేవారు.
ఇప్పుడు సాయిబాబా మహా సమాధి చెందిన తర్వాత కూడా ఆయన అనుమతి ఉంటేనే షిరిడీ వెళ్ళగలరు. బాబా ఆజ్ఞ ఉంటేనే షిరిడీలో అడుగు పెట్టగలుగుతారు. సాయిబాబాను దర్శించుకోవాలంటే ముందుగా ఆయన దయ మనమీద ప్రసరించాలి అన్నమాట

0 comments:

Post a Comment