
సాయిబాబాను చూడాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారు. అయితే తమ ఇష్టం వచ్చినట్లు చుట్టుముట్టేవారు కాదు. ఎవరైనా సరే తమ వంతు వచ్చేవరకు ఆగేవారు. బాబాకు కనుక ఇష్టం లేకుంటే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేసేవారు కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా బాబా దర్శనభాగ్యం కలిగేది కాదు. కనీసం ఆయన నామాన్ని కూడా స్మరించలేక పోయేవారు. సాయిబాబా మహా సమాధి చెందకముందు ఆయనను తృప్తిగా దర్శించుకోవాలని వెళ్ళిన ఎందరో భక్తులకు నిరాశే ఎదురైంది. తమ కోరిక తీరలేదని నిరాశగా...