Wednesday, December 25, 2013

షిర్దీ సాయిబాబా తన లీలలను చూపించి సాయి ప్రచారకునిగా మార్చుట (ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది. )


ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది. (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)



 షిర్దీ సాయిబాబా తన లీలలను చూపించి సాయి ప్రచారకునిగా మార్చుట

బెంగళూరులో నివసిస్తున్న శ్రీకాంత్ శర్మ 1980 సంవత్సరం చివరలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజుల్లో అతను విపరీతమయిన ఆస్త్మాతో బాధ పడుతున్నాడు.  శ్వాస సరిగా ఆడాలంటే ప్రతిరోజు డెరిఫిలిన్ రెటార్డ్ మాత్రలు వేసుకోవలసిందే.  ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను, అతని  కుటుంబం తగినంతగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు కారు. 


అతని ఆఫీసులోనే పనిచేస్తున్న సహోద్యోగి రాజేష్.  అతను ఎవరిని పలకరించినా అందరినీ'సాయిరాం' అనె సంబోధిస్తూ ఉంటాడు.  శ్రీకాంత్ కి సాయిబాబా గురించి తెలియకపోవడం వల్ల అతను ఆవిధంగా అందరినీ సంబోధించడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది.

ఒకరోజున రాజేష్ తనతో షిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకొమ్మని, అతని సమస్యలన్ని తీరిపోతాయనీ చెప్పాడు. కాని షిరిడీకి వెళ్ళి రావడానికి 1500/- రూపాయలదాకా ఖర్చవుతుంది.  తన దగ్గిర అంత డబ్బులేకపోవడం చేత రానని చెప్పేశాడు శ్రీకాంత్.  కాని రాజేష్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఇద్దరూ శ్రీకాంత్ ని వదలి వెళ్ళదలుచుకోలేదు.  ప్రయాణం ఖర్చులు తరవాత యివ్వచ్చు ముందర షిరిడీ రమ్మని నచ్చ చెప్పారు.

1989వ.సంవత్సరం జూన్ 7వ.తారీకున సమాధి మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు.  బాబాను దర్శించుకున్న తరువాత అతని మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతత లభించినట్లుగా అనుభవమయింది. 11వ.తారీకున దర్శనం అయిన తరువాత  తిరిగి వస్తూండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.  ఉదయం 2గంటలకు శ్రీకాంత్ కి శ్వాస కష్టమయి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. గదికి వచ్చాక ప్రవీణ్ వెంటనే బాబా ఊదీ అతని నోటిలో వేసి సాయి తారకమంత్రం "ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి" అనుకుంటూ ఉండమని చెప్పాడు.  కొంతసేపటి తరువాత కునికి పాట్లు పడి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం లేచిన తరవాత తనకు శ్వాసలో ఎటువంటి యిబ్బంది లేదన్న విషయం గ్రహించి మందులు వేసుకోవడం మానేశాడు.  శ్వాసలో ఎప్పుడు యిబ్బంది కలిగినా బాబా ఊదీ నోటిలో వేసుకొని సాయినామ స్మరణ చేసుకునేవాడు.  బాబా అనుగ్రహం వల్ల అప్పటినుండీ యిప్పటివరకు అసలు మందులు ముట్టుకోలేదు.

మొట్టమొదటి బాబా దర్శనంతోనే శ్రీకాంత్ బాబాకు గొప్ప భక్తుడయిపోయాడు.  ప్రతివారితోనూ బాబా లీలల గురించే చెబుతూ ఉండేవాడు.

రాజేష్, రాజాజీ నగర్లో శ్రీద్వారకామాయి సేవా ట్రస్ట్ నొకదానిని ప్రారంభించారు.  2009వ.సంవత్సరం జూలై 20వ.తారీకున షిరిడీ వెళ్ళి బాబా విగ్రహం, పాదుకలు కొని తీసుకొద్దామనుకొన్నారు.  తనతో శ్రీకాంత్ ని కూడా రమ్మన్నారు.  తనకు వళ్ళు నొఫ్ఫులుగా ఉండి వైరల్ ఫీవర్ వచ్చేటట్లుగా ఉందనీ,  పైగా తన దగ్గిర ప్రయాణానికి కూడా డబ్బు లేదనీ అందుచేత రానని చెప్పాడు.  ప్రయాణానికి, అక్కడ ఉండటానికి ఖర్చులు తను పెట్టుకుంటానని రాజేష్ కి నచ్చ చెప్పాడు.  శ్రీకాంత్ అతని మాట కాదనలేక ఒప్పుకొన్నాడు.

రాజేష్ మరొక సాయిభక్తుడయిన వేణుగోపాల్ ని కూడా షిరిడీకి రమ్మని అడిగాడు.  వేణుగోపాల్ బాబా ముందు చీటీలు వేసి ఆయన అనుమతితో తను కూడా షిరిడీ వస్తున్నానని చెప్పాడు.  రాజేష్ వెంటనే స్టేషన్ కి వెళ్ళి షిరిడీ ప్రయాణానికి కర్నాటక ఎక్స్ ప్రెస్ కి టికెట్లు రిజర్వ్ చెయించాడు.  ముగ్గిరికీ వైటింగ్ లిస్ట్ 137,138,139 వచ్చాయి.  షిరిడీనుండి తిరుగు ప్రయాణానికి జూలై 25వ.తేదీకి పూనానుండి ఉదయన్ ఎక్స్ ప్రెస్ కి కన్ ఫరం టికెట్లు వచ్చాయి. 
  

జూలై 22వ.తారీకున శ్రీకాంత్ సాయంత్రం 5.45 కి స్టేషన్ కి చేరుకొన్నాడు.  అప్పటికి వైటింగ్ లిస్ట్ 17,18,19 కి వచ్చింది.  జనరల్ కంపార్ట్ మెంటులో ప్రయాణం చేయవలసిందే తప్ప బెర్తులు మాత్రం దొరకని పరిస్థితి.  రైలంతా ప్రయాణీకులతో నిండి పోయిఉంది.  ప్రక్క బోగీ దగ్గరే ఉన్న మరొక టీ.సీ.ని అడిగి చూడమన్నాడు శ్రీకాంత్.

వెంటనే ముగ్గురూ టీ.సీ.దగ్గరకు వెళ్ళి బెర్తులు కావాలని అడిగారు.  తానేమీ సహాయం చేయలేనని చెప్పాడు టీ.సి.. కాని కాస్త దయ చూపించాడు.  ఎస్4 లో ఎక్కండి అక్కడికి నేను వస్తానని చెప్పాడు.  యిది వినగానె సంతోషంతో సామానంతా తీసుకొని ఎస్ 4 బోగీ దగ్గరికి బయలుదేరారు.  వెడుతూ వెడుతూ శ్రీకాంత్ మరొక్కసారి టీ.సీ.దగ్గరికి వెళ్ళి తాము షిరిడీ బాబా దర్శనానికి వెడుతున్నామనీ, తమ ముగ్గురికి కాస్త బెర్తులు యిప్పించమనీ ప్రాదేయపడ్డాడు.  ఈమాట వినగానె టీ.సీ. ఎస్4 లోకి వెళ్ళి 41,42,43 బెర్తులు తీసుకోమని చెప్పాడు.  రైలు రాత్రి గం.7.20ని.లకి బయలుదేరింది.  కాని ఆ టీ.సీ. అసలు ఆబోగీలోకి రాలేదు.  కాని, ఆబోగీలోకి వచ్చిన టీ.సీ. వారి టిక్కెట్లు చూసి కూడా ఏమీ అనలేదు.  పైగా ఆ టిక్కెట్టులో అతనికి ఏవిధమయిన తేడా కనపడలేదు. 

షిరిడీ చేరుకొన్న వెంటనే అందరూ బాబా దర్శనం చేసుకొన్నారు.  జూలై 24వ.తారీకున అందరూ షాపుకి వెళ్ళి ద్వారకామాయి సాయిబాబా విగ్రహం, పాదుకలు కొని సమాధిమందిరంలోను, ద్వారకామాయిలోను చావడిలోను, పూజలు చేయించారు.
 
 రాత్రి గం2.30ని.లకి వారు గదికి చేరుకొన్నారు.  గదిలో రాజేష్ మొబైల్ లో 15 మిస్డ్  కాల్స్ ఉన్నట్లు చూశారు.  రాజేష్ కి అతని భార్య, సోదరులు,సోదరిలనుంచి కాల్స్ వచ్చినట్లుగా ఉంది.  

వెంటనే రాజేష్ తన యింటికి ఫోన్ చేశాడు.  తల్లికి చాలా సీరియస్ గా ఉందని ఐ.సీ.యూ.లో ఉందని చెప్పారు.  డాక్టర్లు కూడా ఏమీ లాభం లేదని చెప్పారట.  చాలా బాధ పండుతోందనీ మందులు కూడా పని చేయటల్లేదని చెప్పారు. కుటుంబమంతా ఆవిడ కోలుకుంటుందనే ఆశతో ఉన్నారు.  రాజేష్ ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు.  విమానంలో వెడదామన్నా మర్నాడు మధ్యాహ్నం గం.1.30ని.లకి గాని లేదు. తిరుగు ప్రయాణానికి రైలుకి రిజర్వేషన్ మరుసటి రోజుకి చేయించారు.  ఇక బస్సులో వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.  రాజేష్ ఆరోజే సాయంత్రం 4.గంటలకు బస్సులో బయలుదేరి మర్నాడు ఉదయం 11 గంటలకు బెంగళూరు చేరుకొన్నాడు.

బంగళూరులో దిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్ళాడు.  సాయిబాబా పవిత్రమైన ఊదీ తల్లి నుదుటి మీద రాశాడు.  తరువాత ఆవిడని ఎండోస్కోపీ కి తీసుకొని వెళ్ళారు.  కొంతసేపటికి ఎండోస్కోపీ రిజల్ట్ లో నెగటివ్ వచ్చింది.  అంతకు ముదు వరకు బాగా ఎక్కువగా ఉన్న సుగర్ లెవెల్ కూడా మందులతో కాస్త తగ్గడం మొదలయింది.  జూలై 30 గురువారమునాడు ఆవిడని ఆస్పత్రినించి యింటికి పంపించారు.

సంవత్సరం గడిచే కొద్దీ బాబా చూపుతున్న లీలలు శ్రీకాంత్ ని సాయిప్రచార సేవకునిగా మార్చేశాయి.  బాబా అనుగ్రహంతో అతను, అతని స్నేహితుడు మునిరెడ్డి, 2009వ.సం.సెప్టెంబరు 28వ.తారీకునాడు, విజయదశమి మ.గం.2.30ని.లకు (అనగా సాయిబాబా మహాసమాధి చెందిన సమయం) సాయి పోర్టల్ www.saiamrithadhara.com  ప్రారంభించారు.  

ఈ వెబ్ సైట్ లో ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబాకు సంబంధించిన సమాచారాన్నంతా క్రమం తప్పకుండా సాయిభక్తులందరికీ అందిస్తున్నారు.  సాయిబాబా చెప్పిన అమృతతుల్యమైన పలుకులతో బాబా భక్తులెందరి దాహాన్నో తీరుస్తున్నారు.

బాబా మహాసమాధి చెంది 2018 దసరాకు 100 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భంగా పోర్టల్ ని మరింతగా విస్తరించే పనిలో ఉన్నారు.
కన్నడ సాయి భక్తుల కోసం 2009వ.సం.నవంబరు 15వ.తేదీన www.saiamrithavani.blogspot.in   కూడా ప్రారంభించారు. కన్నడ సాయిభక్తులకి ఇది సాయి అమృతధార.  ఎంతో ప్రేమతో, భక్తితో శ్రీకాంత్ మంచి పట్టుదలగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అందిస్తున్నారు.

2012వ.సంవత్సరం లో ఆయన 10రూపాయల వెలతో 'షిర్డీ గైడ్' అనె పాకెట్ సైజ్ పుస్తకాన్ని ప్రచురించారు.  అందులో బాబా ఏకాదశ సూత్రాలు, షిరిడీలో దర్శించవలసిన ప్రదేశాలు, షిరిడీ శ్రీసాయి సంస్థాన్ గురించిన సమాచారమంతా పొందుపరిచారు.

ఈసంవత్సరం గురుపూర్ణిమనాడు ఆయన సాయి ప్రపంచానికి రెండు కానుకలు కన్నడ భాషలో ప్రసాదించారు.  అవి 'శ్రీషిరిడీ సాయిబాబా సమగ్ర కైపిడీ 'శ్రీషిరిడీ సాయినాధ సగుణోపాసన,    


                                                   పంపినవారు : శ్రీకాంత్ శర్మ
              
               నెం.6/19, 3వ.ఫ్లోర్, 6 క్రాస్
               7 మైన్ , ఎన్.ఎస్.పాల్య బీ.ఈ.ఎం.సెకండ్ స్టేజ్
               బెంగళూరు - 560 076 కర్నాటక
               ఈ.మైల్: srikanta68@gmail.com
               మొబైల్  : (0) 9501954008
 ఆంగ్లములో రాసినవారు: షం షాద్ ఆలీ బేగ్ 

సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది

Saturday, December 21, 2013

These Padukas are arriving Khurda Road (Jatni) in Odisha, Details can be had from saiparayana@gmail.com, csaibaba@srisaitv.com or csaibaba@gmail.com

These Padukas are arriving Khurda Road (Jatni) in Odisha, 18 km south of Bhubaneshwar on & from 21st January to 23rd January 2014 for public darshan for Shikhar Pratishta of Sai Jagannath Ashram at Traffic Settlement, Jatni, Odisha. Details can be had from saiparayana@gmail.com, csaibaba@srisaitv.com or csaibaba@gmail.com

Friday, December 20, 2013

నా ఊదీలో నీకు నమ్మకం లేదా? ప్రచురించడానికి అనుమతినిచ్చిన saileelas.orgవారికి కృతజ్ఞతలతో

వివిధ ప్రదేశాలనుండి భక్తులు షిరిడీకి పాదయాత్ర చేస్తారు.  కొంతమంది పల్లకినీ మోసుకొని వెడితే కొంతమంది నడచి వెడుతూ ఉంటారు.  భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు పాదరక్షలతో గాని, లేకుండాగాని షిరిడీ వరకు పాదయాత్ర చేస్తారు.  విఠోభా భక్తులు పండరిపూర్ వరకు పాదయాత్ర చేయడం ప్రారంభించినప్పటినుండీ ఈ పాదయాత్రలు మొదలయ్యాయి.  షిరిడీకి పాదయాత్ర చేయడమంటే భక్తులకి అదొక అపూర్వమయిన అనుభూతి.

తమ దగ్గిర ఎటువంటి ధనము ఉంచుకోకుండా దారిలో కేవలం భిక్ష మీదనే ఆధారపడుతూ షిరిడీకి పాదయాత్ర చేసిన భక్తులు కూడా ఉన్నారు.  అటువంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.  అటువంటి పాదయాత్ర గురించి ఒక అధ్బుతమయిన అనుభవం తెలుసుకొందాము.

2007వ.సంవత్సరం జూన్ నాలుగవ తారీకున అనిల్ సాహెబ్ రావి షిల్కే గారు ఆఫీసునుండి యింటికి తిరిగి వెడుతుండగా తీవ్రమయిన అనారోగ్యానికి గురయ్యారు.  హటాత్తుగా ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతుక ఎండిపోయింది.  పొత్తికడుపంతా ఉబ్బిపోయి బాధ పెట్టసాగింది.  లక్షణాలన్ని బాగా తీవ్రంగా ఉండటంతో దగ్గరలోనున్న షాపులోనికి వెంటనె వెళ్ళి యింటికి ఫోన్ చేద్దామని వెళ్ళారు .  ఫోన్ డయల్ చేసి మాట్లాడలేక స్పృహతప్పి పడిపోయారు.  ఆయనకు తెలివి వచ్చేటప్పటికి  చించివాడ్ ఆస్పత్రి ఐ.సీ.యూ. లో ఉన్నారు. 

రక్తపరీక్షలు, స్కాన్ రిపోర్టులు చూసిన తరువాత ఆయన కిడ్నీలు రెండూ పని చేయటంలేదని, ఆరోజునుండి డయాలసిస్ చేయాలని డాక్టర్  చెప్పారు.  ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా జీవితాంతం ప్రతి వారం మంగళ, శుక్రవారాలలో డయాలసిస్ చేయించుకుంటూ ఉండవలసినదేనని చెప్పారు.  డాక్టర్ నిర్ధారణ చేసి తనకు వచ్చిన జబ్బు గురించి చెప్పగానే ఆయన వెన్నులో చలిజ్వరం వచ్చినట్లయి నిస్సహాయులైపోయారు.  నిరాశ నిస్పృహలతో ఆయన బాబాను "బాబా, జీవితాంతం డయాలసిస్ మీదే బ్రతికే జీవితం నాకు వద్దు.  దానికన్నా నాకు మరణాన్ని ప్రసాదించు" అని అర్ధించారు.

17వ.తేదీన ఆయన యింటికి తిరిగి వచ్చారు.  సరిగ్గా తరువాతి నెలలోనే పూనానుండి షిరిడీవరకు పాదయాత్ర జరగబోతోంది.  గడచిన 8 సంవత్సరాలుగా ఆయన పాదయాత్ర లో పాల్గొంటున్నారు.  ఈసారి పాల్గొనలేకపోతున్నాననే బాధ కలిగింది.  ఆయన మన్స్పూర్తిగా బాబాని యిలా ప్రార్ధించారు.  "అనారోగ్యం వల్ల నేను ఈసంవత్సరం పాదయాత్ర చేయలేకపోతున్నాను బాబా.  వచ్చే సంత్సరం పల్లకీతో పాదయాత్ర చేసేలాగ నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు.  వచ్చే సంవత్సరం నేనే కనక నీపల్లకీ ముందు గుఱ్ఱం లాగ పరిగెత్తగలిగితే, అందుకు కృతజ్ఞతగా నీకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించుకుంటాను" అని మొక్కుకొన్నారు.  నుదిటికి ఊదీ రాసుకొని నిద్రపోయారు.    

ఆరాత్రి ఆయనకు బిగ్గరగా ఒక స్వరం వినపడింది.."నా ఊదీలో నీకు నమ్మకం లేదా"? --  ఆయన తన భార్యను లేపి ఆమెకు ఆస్వరం ఎమన్నా వినిపించిందా అని అడిగారు.  భర్త ఏదో పరాకు మాటలు మాట్లాడుతున్నారనుకొని భయపడింది.  ఆయన మళ్ళీ పడుకొని మరలా ఉదయం 5 గంటలకే లేచారు.  ఈసారి ఆయనకు కాకడ ఆరతి స్పష్టంగా వినిపించింది.  ఆయన మరలా తన భార్యను లేపారు. ఇంటిలోనివారందరూ లేచారు.  వారికెవరికీ కాకడ ఆరతి వినపడలేదు ఆయనకు తప్ప.  ఇదే పెద్ద మలుపు.  రెండు గంటల  తరువాత ఆయన కాస్త మూత్రం విసర్జించారు.  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గడచిన 15 రోజులుగా ఒక్క చుక్క కూడా మూత్రం రాలేదు.  కొద్ది రోజుల తరువాత ఆయన ఆస్పత్రికి వెళ్ళి, పరీక్ష చేయించుకున్నారు.  రక్త పరీక్షలో ఆయన ఆరోగ్యం కూడా మెరుగు పడిందని తెలిసింది.  డయాలసిస్ కూడా అవసరం లేదని చెప్పారు.  అనిల్ గారి ఆరోగ్యం కుదుటపడి నిలకడగా ఉంది.   

ఆయన తనభార్య, స్నేహితునితో కలసి షిరిడీ వరకు పాదయాత్ర చేసి, మొక్కున్న విధంగా బాబాకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించారు. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)

Thursday, December 19, 2013

Do you have no faith in my udi?” from www.saileelas.org


Sairam we have heard about devotees doing Padyatra from various places to shirdi, The devotees carry a Palki or just walk down to Shirdi.
The meaning of Padyatra means walking on foot with or without footwear to Shirdi from different places of India. This practice is followed based on the Padyatra to Pandarpur by devotees of Vitobha. Padyatra to Shirdi is a unique experience by devotees. There are many instances where devotees walked to Shirdi without any money and just sustained themselves on Bhiksa they got on the way to Shirdi. Here is a beautiful experience of Padyatra by a devotee of Sai Baba  of Shirdi.
On June 4th 2007, Anil Sahebrao Shilke, felt extremely unwell while returning home from work. Suddenly he started sweating, his throat became parched, and his abdomen was painful and bloated. The symptoms increased in severity by the minute so he went to a shop and called home. He dialed the number but he could not speak and fell on the floor unconscious.
When he came to consciousness he realized that he was in the I.C.U. of Chinchvad Hospital. The doctor informed him that the blood tests and scans revealed that both his kidney’s had ‘shut down’ so he would be on dialyses starting that day. The dialyses would continue after he was discharged every Tuesday and Friday for the rest of his life. The diagnosis and prognosis sent a chill down his spine, and he felt helpless. In desperation he prayed to Baba and said, “Baba don’t give me this life of dependency on dialysis instead give me death”
On the 17th he went home, and exactly a month later the ‘Palkhi procession’ would start walking from Pune to Shirdi. Anil was distraught as he had participated in the procession for the past 8 years, and he intended to walk this year also. Again he earnestly prayed to Baba saying, “Due to ill health if I can’t walk this year Baba please restore my health so I can walk with the Palkhi next year. Baba if I can run in front of your Palkhi like a horse next year I promise to offer a silver horse to you with gratitude”. Then he applied a little udi to his forehead and fell asleep.

That night he was awoken by a loud voice that said, “Do you have no faith in my udi?” He woke his wife and asked her if she had heard the voice, she thought that he was delirious and she got worried. Then he fell asleep and this time he woke up at 5 am, and he distinctly heard the Kakad Arati. Again he woke his wife and the whole family got up none of them heard the Arati except him.
This was the turning point about 2 hours later he passed some urine. This was great as he had not passed a drop of urine for the past 15 days. His condition also improved when he visited the hospital a few days later his blood tests had improved, so he did not require dialyses. Anil improvement was rapid and sustained. He did walk to Shirdi along with his wife and friend, and he offered a silver horse to Baba as promised.

Monday, December 16, 2013

Happy Dattatreya Jayanti

Jaya Deva Jaya Deva Datta avadhutaa, O Sayee avadhutaa Jodoonikara tava charanee ttevito maathaa, Jaya Deva Jaya Dev
Refrain:
Hail Lord! Datta Avadhuta! (a divine Incarnation) O Sai Avadhuta! With my folded hands, I place my head at your feet. Hail Lord! Hail Lord!

Friday, December 13, 2013

SAI NEWS-Chairman & Managing Director of Mahindra & Mahindra Group Sri.Anand Mahindra visit to Shirdi - Courtesy: Shri Sai Baba Sansthan Trust (Shirdi)

SAI NEWS-Chairman & Managing Director of Mahindra & Mahindra Group Sri.Anand Mahindra visit to Shirdi - Courtesy: Shri Sai Baba Sansthan Trust (Shirdi)
Chairman & Managing Director of Mahindra & Mahindra Group Sri.Anand Mahindra visited Sh
irdi on 13th December 2013, Friday and had darshan of Shri Sai Baba Samadhi. The Executive Officer of Shri Sai Baba Sansthan Trust (Shirdi) Shri.Ajay More was also present on the occasion.

Friday, December 6, 2013

Sadguru Mathaji Krishnapriya

Sadguru Mathaji Krishnapriya (1923-1987) is believed to be an incarnation of a Gopika named 'Gowri' who was a close associate of Lord Shri Krishna and Radha. Like Radha she was an embodiment of Love and Grace. She was a disciple of Lord Shri SaiBaba of Shirdi through divine association and became a fully realized soul and Sadguru at a very young age. She built temples for Shri Sainath and Shri Krishna at Ramachandrapuram,East Godavari dt., A.P. and Nagpur. Her book "Shri Sai Satcharitra" and other spiritual teachings are a great boon to the devotees.

Tuesday, December 3, 2013

ఊదీ బాబా సాయి మాణిక్కం (ఊదీ బాబా గారి నుండి వచ్చిన ఈమెయిలు ఆధారం)



 
 
 
ఊదీ బాబా సాయి మాణిక్కం   (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)
దక్షిణ  భారతదేశంలో మాసిలమణి మాణిక్కం ను అందరూ ఊదీ బాబాగా అందరూ ఊదీ బాబాగా పిలుస్తూ ఉంటారు.  ఆయన ఎన్నో రకాలయిన వ్యాధులను తగ్గించగలరు.  వైవాహిక సంబంధమయిన సమస్యలను, వ్యాపార సంబంధమయిన సమస్యలను, కుటుంబ సమస్యలు మొదలైన వాటినన్నిటినీ పరిష్కరించగలరు. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం, సంతానం లేనివారికి సంతానం కోసం ప్రార్ధిస్తూ ఉంటారు.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో గాని, జూన్ నెలలో గాని శనీశ్వర యాగంలో పాల్గొని ప్రజల క్షేమం కోసం ప్రార్ధిస్తూ ఉంటారు.  ప్రతి సంవత్సరం షిర్దీ సాయిరాం ఎడ్యుకేషనల్ చారిటబుల్ పబ్లిక్ & సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు సాయిపూజా భజనలు నిర్వహించి, పేదలకు చీరలు, కుట్టు మిషన్ లు, పేద విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు పంచి పెడుతూ ఉంటారు.  ఆరోజున బీదలకు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు.వచ్చినవారందరికీ ఊదీబాబా గారు ఊదీనిచ్చి ఆశీర్వదించి పంపుతూ ఉంటారు. 
25సంవత్సరాలనించీ ఆయన యిటువంటి ఆధ్యాత్మిక సేవలో ఉన్నాకూడా ఎప్పుడూ పేరు ప్రతిష్టల కోసం తాపత్రయ పడలేదు.  ఊదీబాబా ఒక పేద కుటుంబానికి చెందినవారు.  ఆయన 10.06.1954 వ.సంవత్సరంలో తిరువన్నామలై జిల్లాలోని వెల్లనల్లూర్ అనే చిన్నగ్రామంలో ముత్తుయమ్మళ్, మాసిలామణి దంపతులకు జన్మించారు.
ఆయన బీ.ఎస్సీ.ప్రధమ సంవత్సరం చదువుతూ కుటుంబ ఆర్ధిక సమస్యల వల్ల మధ్యలోనే చదువు ఆపేసి ప్రభుత్వోద్యోగంలో చేరారు.  రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ చెన్నై లో అసిస్టెంట్ యిన్స్పెక్టర్ జనరల్ గా పదవీవిరమణ చేశారు.  ఆయనకు వివాహమయింది.  ముగ్గురు అమ్మాయిలు.   ముగ్గురికీ వివాహాలయి జీవితంలో స్థిరపడ్డారు. ఆయన నాస్తికుడయినా నిజాయితీగా ఉంటూ తను నమ్మే సిధాంతాలను ఆచరిస్తూ ఉండేవారు.  ఆయన ఎప్పుడూ భగవంతుడిని నమ్మలేదు.  ముందునుంచీ కూడా ఆయన కారణం లేకుండానె భగవంతుడిని, దేవీదేవతలను విమర్శిస్తూ ఉండేవారు. కానీ యిదంతా ఆయనకు 35 సంవత్సరముల వయస్సు వరకు మాత్రమే.  అప్పుడే ఆయన జీవితంలో మలుపు తిరిగి ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టి ఊదీ బాబాగా ప్రసిధ్ధి చెందారు. 

ఆయన జీవితంలో జరిగిన మలుపు:
ఒక గురువారం నాడు సాయంత్రం గం.5.45 నిమిషాలకు ఆయన వెళ్ళుర్ లో మసీదు ప్రక్కనుంచి నడచుకుంటూ వెడుతున్నారు.  ఆసమయంలో ఆకాశం నుండి షిరిడీ సాయిబాబావారు క్రిందకు దిగిరావడం చూశారు. "నాతో సహా అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి ప్రజలలో నీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి" అన్నారు బాబా.  కాని ఆయన దీనినేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు.  బాబా ఆయనను ఒక మసీదు, ఒక దేవాలయం మధ్య ఆశీర్వదిస్తూ వచ్చారు.  ఇలా వరుసగా మూడు రోజులపాటు ఒకేసమయంలో ఈవిధంగా జరిగింది.  ఆయనా గాని ఆయనకు భగవంతునిలో నమ్మకం లేకపోవడం చేత దీనిని పెద్దగా పట్టించుకోలేదు.  కాని తరువాత నాలుగవరోజైన శనివారమునాడు ఆయనకు తాను తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్నట్లుగా కల వచ్చింది.  కాని, కలలో వేంకటేశ్వరునికి బదులుగా బాబా కనిపించారు.  ఇది ఆయనలో ఆలోచనలను రేకెత్తించింది.  క్రమంగా ఆయనలో మార్పు రావడం మొదలయింది.  తన పాత అలవాట్లను, సంబంధాలను, కోరికలను (కుటుంబంతోసహా) అన్నిటినీ వదలి పెట్టేశారు.  శ్రీసాయిబాబావారి ఆశీర్వాదంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు.  బాబా సేవకునిగా ఒక క్రొత్త లక్ష్యాన్ని చేపట్టారు.  ఇప్పుడాయన తన కుటుంబ బాధ్యతలని ఒక కర్తవ్యంగా మాత్రమే నిర్వహిస్తున్నారు.  బాబా స్వయంగా బోధించిన వాటిని ఆచరిస్తూ భగవంతునితో అనుసంధానమైన ప్రతీదీ కూడా పూజ, ధ్యానం అన్నిటినీ ఆచరిస్తున్న ఆయన ఎంతో ధన్యుడు. 
బాబాయే ఆయనకు పరమగురువు.  బాబాను తనలో యింకా గాఢంగా నిలుపుకొనేందుకు ఆయన షిర్దీ చాలా సార్లు దర్శించారు.  ఆయన మనసంతా యిప్పుడు బాబా నిండి ఉన్నారు.  ఆయన ప్రతిరోజు బాబాతో మాట్లాడతారు, ఆడతారు,సుఖసంతోషాలను పంచుకుంటారు, ప్రార్ధిస్తారు. అందరి కోర్కెలని ఊదీబాబాగారు షిరిడీలో  బాబావారి పాదాల వద్ద ఉంచుతారు.  వారికోర్కెలన్నిటినీ సఫలం చేయమని ఆయన బాబాని తీవ్రంగా ప్రార్ధిస్తారు.  బాబా వాటిని పరిష్కరిస్తారు.  బాబావారి అనుమతి లేకుండా ఊదీబాబా ఏపనీ చేయరు.  ఆయనకు తనకంటూ ఏవిధమయిన కోరికలు లేవు.  ఇప్పుడు ఊదీ బాబాగారు షిరిడీసాయిబాబావారి అనుమతితో భారతదేశంలోని యితర ప్రాంతాలలోని అందరి గురించీ కూడా ప్రార్ధన చేయడానికి నిర్ణయించుకొన్నారు.
అంధుచేత సాయిభక్తులెవరైనా తమ సమస్యల గురించి ఊదీబాబావారిని సంప్రదించాలనుకుంటే, తమ తమ సమస్యల వివరాలను ఆయన ఈ.మైల్.ఐ.డీ. కి పంపచచ్చు. saimanickam.udi@gmail.com  మూడు రోజులలో ఆయన సమాధానమిస్తారు.
ఫోన్ ద్వారా కూడా ఆయనను సంప్రదించవచ్చు.. ఫో.+919994187725 
సంప్రదించవలసిన సమయం  ఉ.10.గం.నుండి మ.12.గం.వరకు

                              సా.6 గం.నుండి 8 గం.వరకు.

ఆయన తన 25సంవత్సరాల సేవలో లక్షమందికి పైగా కాన్సర్ రోగులకి, కిడ్నీవ్యాధి గ్రస్తులకి, గుండె జబ్బులవారికి వారి వారి జబ్బులను తగ్గించడానికి ఊదీనిచ్చారు.  సంతానం లేని దంపతులకు సంతానం కలిగింది. 
చిరునామా:
ఎం.మానిక్కం (ఊదీ సాయిమానిక్కం) 
ప్రెసిడెంట్ : డా.పుంగుఝలి ఫౌండర్ & మానేజింగ్ ట్రుస్టీ
ణుం. 679, బజంకోయిల్ వీధి,
కరుగంబత్తూర్
వెల్లూర్ - 632 013

https://www.facebook.com/SrisaiTV

Like , SHare & Invite Srisaitv Page to your Friends A get A chance to Win free Travel to Shirdi... 3 Days & 2 Nites......Watch live Sri Sai Tv on www.srisaitv.com Offer ends on Dec 25th 2013

https://www.facebook.com/SrisaiTV

Thursday, November 21, 2013

Saibaba and Sai Padukas

the image of Saibaba and Sai Padukas can be seen in the Udhi Container at Shri.Nandakumar Revannath Deshpande (Nimonkar) house at Nimon near Shirdi.

Tuesday, November 19, 2013

shiridi sai padukas reached in nellore mahalsapathy grand son manohar ji



 
 
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు

మహాల్సాపతి గారి మనుమడు మనోహర్ గారు

సాయి ధర్మసూక్ష్మం

సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘ శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది.
సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు.
అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి? ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోకూడదు? ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాన్ని చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయ క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్ధులు, చెడు లక్షణాలు అనే కలుపు మొకల్ని పెకలించి వేస్తాయి. శ్రీ సాయి ఆచరింప సాధ్యం కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు. అర్థం కాని తత్వాన్ని బోధించలేదు. జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు. సులభ మార్గాన్ని చూపారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. సంసార బంధాలను తెంచుకోమని అసలే చెప్పలేదు. ఆడంబరాలకు, భేషజాలకు పోవద్దన్నారు. నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.

Wednesday, November 13, 2013

శ్రీ సాయి సచ్ఛరిత శ్రవణ పారాయణ 402 & 403 Sai Satcharithra Parayana

పారాయణ చైతన్య స్వర్గీయ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు షిరిడీలో 400వ శ్రీ సాయి సచ్ఛరిత శ్రవణ పారాయణ చేయాలన్న స్వప్నాన్ని సాకారం చేసిన శ్రీ సాయిబాబా మందిరం, కొవ్వాడ, కాకినాడ రూరల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా పారాయణ బృంద సభ్యులు కొనసాగింపుగా 402వ మరియు 403వ శ్రవణ పారాయణ ను 26.11.2013 నుండి 02.11.2013 వరకు కాకినాడ లో వుదయం 8 గంటలనుండి 402 వ పారాయణను, సాయంకాలం 6 గంటలనుండి 403 వ పారాయణ ను జరుపుటకు నిశ్చయించినారు. ఆసక్తిగల భక్తులు పాల్గొన వచ్చును. సంప్రదించవలసిన దూరవాణి నంబర్లు: 9505587987, 9848165265, 0948333551, 9440674587

షిర్డీ సాయిబాబా



షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
''
మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.