Thursday, November 21, 2013

Saibaba and Sai Padukas

the image of Saibaba and Sai Padukas can be seen in the Udhi Container at Shri.Nandakumar Revannath Deshpande (Nimonkar) house at Nimon near Shirdi.

Tuesday, November 19, 2013

shiridi sai padukas reached in nellore mahalsapathy grand son manohar ji



 
 
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు

మహాల్సాపతి గారి మనుమడు మనోహర్ గారు

సాయి ధర్మసూక్ష్మం

సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘ శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది.
సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు.
అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి? ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోకూడదు? ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాన్ని చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయ క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్ధులు, చెడు లక్షణాలు అనే కలుపు మొకల్ని పెకలించి వేస్తాయి. శ్రీ సాయి ఆచరింప సాధ్యం కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు. అర్థం కాని తత్వాన్ని బోధించలేదు. జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు. సులభ మార్గాన్ని చూపారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. సంసార బంధాలను తెంచుకోమని అసలే చెప్పలేదు. ఆడంబరాలకు, భేషజాలకు పోవద్దన్నారు. నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.

Wednesday, November 13, 2013

శ్రీ సాయి సచ్ఛరిత శ్రవణ పారాయణ 402 & 403 Sai Satcharithra Parayana

పారాయణ చైతన్య స్వర్గీయ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు షిరిడీలో 400వ శ్రీ సాయి సచ్ఛరిత శ్రవణ పారాయణ చేయాలన్న స్వప్నాన్ని సాకారం చేసిన శ్రీ సాయిబాబా మందిరం, కొవ్వాడ, కాకినాడ రూరల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా పారాయణ బృంద సభ్యులు కొనసాగింపుగా 402వ మరియు 403వ శ్రవణ పారాయణ ను 26.11.2013 నుండి 02.11.2013 వరకు కాకినాడ లో వుదయం 8 గంటలనుండి 402 వ పారాయణను, సాయంకాలం 6 గంటలనుండి 403 వ పారాయణ ను జరుపుటకు నిశ్చయించినారు. ఆసక్తిగల భక్తులు పాల్గొన వచ్చును. సంప్రదించవలసిన దూరవాణి నంబర్లు: 9505587987, 9848165265, 0948333551, 9440674587

షిర్డీ సాయిబాబా



షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
''
మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.

Friday, November 8, 2013

at Shirdi during Diwali.

 
Flowers decoration in Samadhi mandir & Diya lightening in Nandadeep (Landi Baug) at Shirdi during Diwali.

షిర్డీసాయి పాదుకలు

 
 సాయి బంధువులందరికి మనవి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని గాంధి బొమ్మ దగ్గర వున్న సాయి మందిరం లో శనివారం నాడు (9-11-2013) సాయంత్రం 8.00 - 9.30 సమయమున షిర్డీ నుంచి  మహాల్సాపతి కుటుంబ సభ్యులచే తీసుకోని రాబడుచున్నవి. కోటి సోమవారము నాడు సాయి విశ్వేశ్వరుడును దర్శించు కొని స్వామి కృపను పొందగలరు. ధన్యవాదములు మీ సాయి బంధువు.

Wednesday, November 6, 2013

సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ

  
MASS SAI SHAKTI MAHA PUJA AT EXHIBITION GROUNDS, HYDERABAD FROM 4.30 PM ONWARDS ON SUNDAY, THE 10TH NOVEMBER 2013 BY SHIRDI SAI TATWA PRACHARA SAMITI IIN GRACIOUS GUIDANCE OF REVERED SWAMY SAI VISHWA CHAITANYA. DEVOTEES ARE REQUESTED TO REACH THE VENUE BY 4.30 SHARP & PUJA MATERIAL WILL BE SUPPLIED WITHOUT ANY COST BY THE SAMITHI. DEVOTEES CAN HAVE THE DARSHAN OF THE CROWN ADORNED BY SAI MAHARAJ AT SAMADHI MANDIR, SHIRDI SINCE THE THIRTY YEARS.
సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నవంబరు 10వ.తేదీ, 2013 సాయంత్రము.గం.4.30 నిమిషాలకు సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ షిర్దీ సాయి తత్వ ప్రచార సమితి వారిచే నిర్వహింపబడుతున్నది. స్వామి సాయి శ్రీ విశ్వచైతన్య గారు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యము వహించెదరు. భకులందరూ కూడా వేదిక వద్దకు ఖచ్చితముగ గం.4.30 నిమిషాలకు రావలెను.పూజా సామాగ్రి భక్తులందరికీ సమితి వారిచే ఉచితముగా యివ్వబడును. 30 సంవత్సరములు శిరిడీలో సాయిబాబాకు అలంకరణ చేసిన స్వర్ణకిరీటమును భక్తులందరూ దర్శించుకొనే భాగ్యము కలదు. ఈ సదవకాశమును అందరూ వినియోగించుకోవలసినదిగా కోరబడుతున్నారు

Monday, November 4, 2013

SRI SAI TV RAJAHMUNDRY EVENT

 
 
 
 
 
 
MAA PRESIDENT SRI MAGANTI MURALI MOHAN, EX MINISTERSRI GORNTLA BUCHAIAH CHOWDHARY , RAJAHAMUNDRY URBAN MLA SRI ROUTHU SURYAPRAKESH RAO, RAJAHAMUNDRY RURAL MLA SRI CHANDANA RAMESH DSP SRI BABJI , ARTIST SRI CHITIBABU, SRISAI TV MD SMT SAIVAHINI, E.D ANILKUMAR, COO SRI C.SAIBABA, SRI SHIRDI SAI PRACHARA SOCIETY ( RAJAHAMUNDRY) PRESIDENT SRI SARVESHWER RAO