Tuesday, July 23, 2013

సాయితో సాయి బా ని స అనుభవాలు 17

సాయితో సాయి బా ని అనుభవాలు 17


శ్రీ సాయి సచ్చరిత్ర 21 అధ్యాయంలో యోగుల గురించీ యోగీశ్వరుల వ్యవస్థ గురించీ చెప్పబడింది. యోగులు భౌతికంగా దూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ వారు చెసే పనులు ఒకరికి ఒకరు తెలియచేసుకునేవారు. సమాజానికి మంచి చేయడానికి వారు భగవంతుని ఆజ్ఞానుసారం కార్యములని నిర్వర్తిస్తూ ఉన్నారు.
16.09.1993 . సాయంత్రము 6.30 నిమిషాలకు టీ.వీ. ముందు కూర్చుని దక్షిణ భారతదేశంలో ప్రముఖులైన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారిపై కార్యక్రమాన్ని చూడసాగాను. సాధు సత్పురుషులందరూ భగవంతుని దూతలు. వారు భూమిపై ప్రత్యేకమైన పనులను నిర్వహించడానికి అవతరించి వారి పని పూర్తి కాగానే తిరిగి భగవంతుని చెంతకు చేరుతున్నారు. కోవకు చెందినవారే శ్రీ షిరిడీ సాయినాధులవారు. శ్రీ రాఘవేంద్రస్వామివారి మీద కార్యక్రమాన్ని చూస్తూన్నంతసేపూ నా మనసు శ్రీ షిరిడీ సాయినాధులవారిపై నిలిచింది. ప్రపంచములో యోగీశ్వరుల వ్యవస్థ నిజమైతే కార్యక్రమము పూర్తి అయ్యేలోపల లేదా నేను టీ. వీ. ముందునుంచి లేచి బయటకు వెళ్ళేలోపల శ్రీ షిరిడీ సాయినాధులవారి పటమును చూడాలి, లేదా వారి గొప్పతనమును గురించి వినాలి. ఇది అసాధారణమైన కోరిక. మరి కోరిక నెరవేరుతుందో లేదో అనే ఆలోచన శ్రీ షిరిడీ సాయినాధులవారిపై అచంచల విశ్వాసముతో కార్యక్రమము పూర్తిగా చూడ సాగాను. శ్రీ రాఘవేంద్రస్వామివారిపై కార్యక్రమము పూర్తి అయినది. నా కోరిక అర్ధము లేని కోరిక అని తలచి టీ.వీ. ముందునించి లేచి నా యింటి బయటకు వెళ్ళడానికి సిధ్ధ పడ్డాను. సాయంత్రము ఏడు గంటలు సమయము.. టీ.వీ. లో తదుపరి కార్యక్రమము ప్రాంతీయ వార్తలు. ముఖ్య వార్తలు వినాలనే ఉద్దేశ్యముతో టీ.వీ. ముందునుంచి లేవకుండా అట్లాగే కూర్చున్నాను. వార్తలలో మొదటి వార్త, "ఆంధ్ర ప్రదేశ్ లో లారీల సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయినది" అని చెబుతూ రోడ్డుపై నిలిచిపోయిన మొదటి లారీని తెరమీద దగ్గరగా చూపించినారు. నా ఆనందానికి అవధులు లేవు. లారీ మీద శ్రీ షిరిడీ సాయిబా లారీ సర్వీసు అని తెలుగులో పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది. దానికింద బాబావారి అభయహస్తముతో పెద్ద పటము కూడా ఉంది. నా మనసులోని కోరిక బాబావారు తీర్చినారు కదా. నేను శ్రీ రాఘవేంద్రస్వామి వారి కార్యక్రమము చూస్తూ షిరిడీ సాయినాధులవారిని తలచుకోవడము , నేను టీ.వీ. ముందునుంచి లేచేలోపలే శ్రీ షిరిడీ సాయినాధులవారిని కూడా టీ.వీ. తెరపై చూడగలగటమూ యోగీశ్వరుల వ్యవస్థపై అచంచలమైన నమ్మకాన్ని కలిగించింది. సంఘటనలో నేను ఎంత ఆనందాన్ని పొందానో పాఠకులు గ్రహించగలరు.

No comments:

Post a Comment