Total Pageviews

Friday, May 31, 2013

నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు..!: సాయిబాబా...!?



నా భక్తుల ఇంటలేమిఅనేది ఉండదు..!: సాయిబాబా...!?
"
షిరిడీ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి కష్టాలు తీరినట్లేనని, నా భక్తుల ఇంట "లేమి" అనేది ఉండదని" సాయిబాబా పేర్కొన్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పుకుంటున్న షిరిడి సాయిబాబా ప్రపంచ జనులను తన బోధనల ద్వారా మేల్కొలిపారు. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.
ఇంకా "నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను."
"
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది".
"
భక్తుల అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
"
నా సమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
"
నా సమాధినుండి నేను మాట్లాడుతాను."
"
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ అండగా ఉంటాను."
"
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను."
"
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి."
"
నా భక్తుల ఇంటలేమిఅనేది ఉండదు." వంటి అనే పలు వాక్యాల ద్వారా భక్తులకు అభయమిచ్చిన సాయిబాబాను గురువారం పూట పూజించేవారికి సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా గురువారం పూట సాయిబాబాను పూజించే, రోజు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బాబా ఆలయాన్ని సందర్శించుకుంటే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.
అలాగే గురువారం పూట ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని, సాయిబాబా ప్రతిమను లేదా ఫోటోను పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పాలుతో తయారు చేసిన వస్తువులు, చక్కరెపొంగలి, పండ్లు వంటివి సిద్ధం చేసుకోవాలి.
గురువారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బాబుకు ఆవునేతితో పంచహారతి గావించి, నిష్టతో పూజలు చేయాలి. ఇలా ప్రతి గురువారం సాయిబాబాను పూజించే వారికి పదవోన్నతులు, ఉన్నత విద్యావకాశాలు, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు అంటున్నారు.

0 comments:

Post a Comment