Total Pageviews

Monday, January 21, 2013

సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు


సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు
1. హేమాడ్పంత్ కు సాయి సచ్చరిత్రను వ్రాయడానికి ప్రేరేపించిన సంఘటన యేది?

ఒకరోజున ద్వారకామాయిలో బాబా గారు తిరగలి విసురుతుండగా హేమాడ్పంత్ గారు చూశారు. అప్పుడే ఆయనకు బాబా సచ్చరిత్ర వ్రాయాలనే సంకల్పం కలిగింది.

2.
బాబా గారు తిరగలి విసురుతున్నప్పుడు, అక్కడికి ఆవూరి ఆడవారు యెంతమంది వచ్చారు?

నలుగురు ఆడవాళ్ళు వచ్చారు.

3.
బాబాగారు తను విసిరిన గోథుమ పిండిని యేమి చేశారు?

బాబా గారు ఆ పిండిని ఊరి బయట చల్లించి షిరిడీలో కలరా వ్యాథిని నిర్మూలించారు.

4.
గుఱ్ఱము మీద వచ్చిన మనిషి (తన సంచీలో బల్లిని తీసుకుని వచ్చాడు) బాబా దర్శనానికి షిరిడీ వచ్చినప్పుడు, బాబా గారు యేమి చేస్తున్నారు?

ఆ సమయములో బాబా గారు స్నానము చేస్తున్నారు.

5.
బాబా గారు బలరాం మాంకర్ ను ప్రాయశ్చిత్తం నిమిత్తము మచ్చిందర్ ఘడ్ కు వెళ్ళమని చెప్పి, మచ్చిందర్ ఘడ్ వెళ్ళడానికి యెన్ని రూపాయలు ఇచ్చారు?

12
రూపాయలు ఇచ్చారు.

6.
హరిశ్చంద్ర పితలే షిరిడీ వెళ్ళినప్పుడు బాబా గారు ఆయనకు యెన్ని రూపాయలు ఇచ్చారు?

3
రూపాయలు ఇచ్చారు.

7.
బాబా గారు ద్వారకామాయిలో యెన్ని రోజులు నిద్రించేవారు, చావడిలో యెన్ని రోజులు నిద్రించేవారు?

ఒక్ రోజు ద్వారకామాయిలో, మరునాడు చావడిలో, మరలా మరునాడు ద్వారకామాయిలో మరునాడు చావడిలో ఇలా సమాథి చెందేవరకూ నిద్రించేవారు.

8.
బాబా గారు రాథాబాయ్ దేస్ముఖ్ కి యేమి మంత్రము ఇచ్చారు?

శ్రథ్థ, సబూరి

9,
శ్రీమతి కపరదే కి బాబా గారు యేమి మంత్రము ఇచ్చారు?

బాబా గారు ఆమెతో "రాజారాం రాజారాం" అని ఉచ్చరించమన్నారు.

10,
బాబా గారు సమాథి చేందేముందు లక్ష్మీ బాయికి యంత డబ్బు యెన్ని వాయిదాలలో ఇచ్చారు?

బాగారు ఆమెకు 9 రూపాయలు ఇచ్చారు . మొదట 5 రూపాయలు, తరువాత 4 రూపాయలు.
11. బాబాగారు యెవరి వళ్ళో తన ఆఖరి శ్వాసను విడిచారు?

బాయాజీ కోతే పాటిల్.

12. బాబా గారు సన్యాసి రూపములో యిద్దరు చిన్న పిల్లలతో కలిసి దహానూలో ఉన్న శ్రి బీ.వీ.దేవ్ గారిని చూడటానికి వారి యింటికి వెళ్ళినప్పుడు, టాంగా ను యెవరి యింటిముందు ఆపి దిగారు?


అడ్వొకేట్ పరంజపే గారి యింటి ముందు.

13 , 14. బాబా, షామా, యెన్ని జన్మల అనుబంథము.


72 జన్మలు.


15. బాబా, బలరాం థురందర్ యెన్ని జన్మల అనుబంథము.


60 జన్మలు.


16. ఒకసారి యోగా నేర్చుకుంటున్న విథ్యార్థి, బాబా దర్శనానికి వచ్చినప్పుడు, బాబాగారు యేమి చేస్తున్నారు?


బాబా గారు మిగిలిపోయిన గోథుమ రొట్టెను ఉల్లిపాయతో తింటున్నారు.

17, ప్రముఖ హారతి పాట "ఆరతి సాయిబాబా, సౌఖ్య దాతార జీవా" యెవరు వ్రాశారు?


శ్రీ మాథవరావ్ అడాకర్

18. బాబావారి పవిత్రమైన శరీరం యెవరి యింటిలో విశ్రాంతి తీసుకుంది?


శ్రీ బూటీ యింటిలో.

19. బాబాగారు యేసమయలో, యేరోజున తమ ఆత్మను బ్రహ్మానందంలో ఉంచారు?


దత్త జయంతి రోజున రాత్రి 10 గంటలకు.

20. ద్వారకామాయిలో బాబా గారు చెక్క ఊయల మీద నిదురించేటప్పుడుం యెన్ని మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగింపబడినవి?


నాలుగువైపులా 4 దీపాలు.
21. యెంతమంది అమ్మాయిల తరువాత నాందేడ్లో ని సేట్ రతంజీ పార్శీ గారికి మగపిల్లవాడు జన్మించాడు?

12 మంది ఆడపిల్లల సంతానం తరువాత మగపిల్లవాడు జన్మించాడు.


22. సఖారాం ఔరంగాబాద్కర్ గారి సవతి కొడుకు పెరు యేమిటి? యెన్ని సంవత్సారాల తరువాత సఖారాం గారికి మొట్టమొదటి సంతానం కలిగింది? పుట్టిన సంతానం ఆడా? మగా?


సవతి కొడుకు పేరు విశ్వనాథ్, 27 సంవత్సరాల తరువాత మగపిల్లవాడు జన్మించాడు.

23. లక్ష్మీ చంద్ గారు దాసుగణు కీర్తన వినడానికి ముంబాయి వెళ్ళినప్పుడు ఆ సమయంలో దాసుగణుగారు తమ కీర్తనలో యెవరి గురించి వర్ణిస్తున్నారు?


సంత్ తుకారాం గారి కథ.

24. షామా గారు కాశీ, గయ, ప్రయాగ, అయోథ్య యాత్రలకు వెళ్ళునప్పుడు, నంద్ రాం మార్వాడీ వారి వద్ద యెంత అప్పు తీసుకున్నారు?


100 రూపాయలు.


25. షిరిడీ వెళ్ళునప్పుడు లక్ష్మిచంద్ గారు తన సోదరుని వద్ద యెంత సొమ్ము అప్పుగా తీసుకున్నారు?


15 రూపాయలు.


26. మూలే శాస్త్రిగారు, బాబా దర్శనానికి షిరిడి వెళ్ళినప్పుడు, బాబాగారు ఆయనకు యెన్ని అరటిపండ్లను ఇచ్చారు?


నాలుగు అరటిపండ్లు.

27. రఘునాథరావ్ టెండూల్కర్ గారు పదవీ విరమణ చేసినతరుచ్వాత నెలకు యెంత పెన్షన్ తీసుకుంటూ వుండేవారు, బాబాగారు ఆయనకు నెలకు యెంత పెన్షన్ ఇచ్చారు?


నెలకు 75 రూపాయలు, కాని బాబా దయ వల్ల నెలకు 110 రూపాయలు పెన్షన్ వచ్చింది.

28. రాంగిరీ బువాగారు సల్గావ్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆయన జేబులో యెంత డబ్బు మిగిలింది?


రెండు అణాలు మాత్రమే.

29, బాబా గారు కొన్ని రోజులు యేగురువుకు శిష్యుడుగా ఉన్నారు?


జవహర్ ఆలీ

30. బాబా గారు మెరిసే రాయి కాదు, వజ్రం అని షిరిడీవాసులతో అన్నది యెవరు?


ఆనందనాథ్ మహరాజ్.

31. బాబాగారు ఖండొబా మందిరంలోనికి ప్రవేశించినపుదు "ఆవో సాయీ" అని యెవరు పిలిచారు?

మహల్సాపతి

32. బాబా ముందర ఒక్క మాటయినా మాట్లాడని ముగ్గురు భక్తుల పేర్లు చెప్పండి.


శ్రీ బూటీ, శ్రీ ఖపర్డే, శ్రీ నూల్కర్

33. కప్ప , సర్పము వీటి గత జన్మలలోని పేర్లు యేమిటి?


చిన్నబసప్ప, వీరభద్రప్ప

34. భరంపూర్ మహిళ కలలో బాబాగారు తినడానికి యేమి అడిగారు?


కిచిడీ భోజనము

35. బాబాగారు షామాని ప్రతీరోజు యే స్తోత్రము చదవమన్నారు?


విష్ణు సహస్ర నామం

36. కాకాసాహెబ్ దీక్షిత్, షాం కోపర్గావ్ రైలులో వచ్చినప్పుడు, వారి యే క్లాసులో ప్రయాణించారు?



ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంటులో ప్రయాణించారు.

37. యే రోజున మేఘా బాబావారిని తలనించి పాదముల దాకా స్నానము చేయించాడు?


మహా సంక్రాంతి రోజున.

38. నానా చందార్కర్ గారి అమ్మాయి జామ్నర్ లో ప్రసవ వేదన పడుతున్నప్పుడు,

బాపుగిర్ ద్వారా బాబా గారు నానా చదార్కర్ గారికి రెండు వస్తువులు పంపారు అవి యేవి?

మాథవరావ్ అడ్కర్ రాసిన "ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవా" మరియు ఊదీ.

39. నాసిక్ నివాసి మూలే శాస్త్రి గారి గురువు పేరు?


ఘోలప్ స్వామి.

40. డా.పండిత్ గారి గురువు పేరు?


కాకా పూరనిక్

42. మేఘా యే దేవుని భక్తుడు?

లార్డ్ శివ

43. దాస్ గణు యే దేవుని భక్తుడు?


లార్డ్ విఠల్

44. రాథాక్రిష్ణ ఆయి యే దేవుని భక్తురాలు?


లార్డ్ బాలకృష్ణ

45. శ్రీ చాంద్ బాయ్ చేసే ఉద్యోగమేమిటి?


శ్రీ చాంద్ బాయ్ థూప్ ఖేడ్లో విలేజ్ యిన్ చార్జ్


46. మహల్సాపతి యే దేవుని భక్తుడు?


లార్డ్ ఖండోబా.

47. 1917 లో హోలీ పూర్ణిమ రోజున, బాంద్రాలోని (ముంబాయి) హేమాడ్ పంత్ యింటికి యే రూపములో వెళ్ళారు?


బాబా గారు ఫొటో ఫ్రేం రూపంలో హేమాడ్ పంత్ గారి యింటికి వెళ్ళారు.

48. నిరంతరంగా బాబాగారు యేనామాన్ని జపిస్తూ ఉండేవారు?


అల్లా మాలిక్ అల్లా మాలిక్

49 ద్వారకా మాయి మీద రెండు జండాలు యెగురవేయబడ్డాయి, వాటి స్వంతదారులు యెవరు?


1. శ్రీ దాము అన్నా కాసర్ 2. శ్రీ నానాసాహెబ్ నిమాంకర్


50. ద్వారకామాయిలో బాబాగారితో పాటుగా యెవరు నిద్రించేవారు?


మహల్సాపతి & తాత్యా కోతే పాటిల్


0 comments:

Post a Comment