Tuesday, July 5, 2016

ఆమె వాల్వు మార్పిడి గురించి బాబా కు తెలుసు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
(రాబోయే రెండు లీలలలో సునీతను బాబా వాల్వు మార్పిడి ఆపరేషన్ సమయంలోనూ, ఆ తరువాతా ఎలా కాపాడారో చదువుతాము)
సునీతా అరోటే తన భర్తతోనూ కూతురుతోనూ బొంబాయిలో నివసిస్తుండేది. కొంతకాలంగా ఆమె బాగా అలసిపోతోంది మరియూ ఊపిరి తక్కువవుతోంది. పరీక్షలకోసం ఆమె బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. సంపూర్ణమైన పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు ఆమె భర్తతో సునీతకి గుండెకి సంబంధించి ఎడమవైపు వాల్వు సరిగా పనిచేయడం లెదనీ, దానిని మార్చాల్సి వుంటుందనీ చెప్పారు. అయితే ఆమె ప్రస్తుతమున్న పరిస్థితులలో వాల్వుమార్పిడి ఆపరేషన్ వలన ప్రమాదముందనీ, కానీ ఎంత తొందరలో చేస్తే అంతమంచిదనీ చెప్పారు.
సునీత భర్త ఈ వార్త ని ఆమెకి చాలా సున్నితంగా చెప్తూ జాగ్రత్తగా చూసికోడానికి బాబా వున్నారని విశ్వాసాన్ని కలిగించాడు. సునీత కన్నీరు మున్నీరయ్యింది, కానీ నిర్ణయం తీసికోక తప్పని పరిస్థితులలో వాల్వుమార్పిడి చికిత్సకి తేదీని నిర్ధారించారు. రెండురోజుల ముందు ఆసుపత్రిలో చేరింది. తనతో పాటుగా చిన్న సైజు బాబా ఫొటోగ్రాఫ్ తెచ్చుకుంది. మంచం పక్కనే వున్న బల్లమీద ఆ ఫోటోని పెట్టుకుంది. బాబా విభూతిని తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ని కూడా తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ఆమె ప్రతిరోజూ చదుగుతుంది.
ఆపరేషన్ కి ముందురోజు రాత్రి ఆమె ఒక స్పష్టమైన స్వప్నాన్నిగాంచింది. ఎందరో రోగులున్న అతి పెద్ద వార్దులో ఆమె ని చేర్చారు. అక్కడ ఎందరో వున్నారు, అందరినీ ఆమె నిశ్సబ్దంగా గమనిస్తోంది. ఇంతలో ఒక ఎనిమిది సంవత్సరాల బాలుడు ఆ జనాన్ని దాటుకుంటూ ’ఇక్కడ షిరిడీనుండొచ్చిన అరోటే ఎవరు’ అని అరుచుకుంటూ వచ్చాడు. సునీత వివాహానికి ముందు షిరిడీలో వుండేది. అందువలన ఆమె చేయెత్తి నేనే షిరిడీనుండొచ్చిన అరోటేను. అంది.  అప్పుడు ఆ కుర్రవాడు ’బాబా నన్ను పంపించారు. నీకు ఏ వాల్వు మార్చాలి, కుడిదా? ఎడమదా?’ అని ప్రశ్నించాడు. ఆమె జవాబు విన్న వెంటనే అంతే వేగంగా ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు. ఆమె భర్త వచ్చినప్పుడు ఆమె తన స్వప్నానుభవం గురించి అతనితో చెప్పింది. అతనామెకి బాబా కి ఆమె ఆపరేషన్ గురించి పూర్తిగా తెలుసునని నమ్మకాన్ని వ్యక్త పరిచాడు. అప్పుడు సునీతకు బాబా తనతో ఎప్పుడు వుంటాడనీ తనకు అపకారం జరగదనీ విశ్వసించింది.
ఆపరేషన్ జరగాల్సిన రోజు ఉదయాన్నె లేచి బాబా ని ప్రార్దించింది. అష్టోత్తర శత నామావళి చదువుకుంది. బాబా ఉనికి అనే సుగంధం తో ఆమె గదంతా పరిమళించసాగింది.  బాబా తనతోనే ఆ గదిలో వున్నారని సునీత విశ్వసించింది. ఆమె ఆపరేషన్ విజయవంతమైందని వేరేగా చెప్పాలా?
సాయిప్రసాద్ పత్రిక (దీపావళి సంచిక) 1998.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

1 comment:

  1. I enjoyed this blog post. It was inspiring and informative. Read vastu tips and suggestions from our vastu shastri

    ReplyDelete