Total Pageviews

Tuesday, July 5, 2016

ఆమె వాల్వు మార్పిడి గురించి బాబా కు తెలుసు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై (రాబోయే రెండు లీలలలో సునీతను బాబా వాల్వు మార్పిడి ఆపరేషన్ సమయంలోనూ, ఆ తరువాతా ఎలా కాపాడారో చదువుతాము) సునీతా అరోటే తన భర్తతోనూ కూతురుతోనూ బొంబాయిలో నివసిస్తుండేది. కొంతకాలంగా ఆమె బాగా అలసిపోతోంది మరియూ ఊపిరి తక్కువవుతోంది. పరీక్షలకోసం ఆమె బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. సంపూర్ణమైన పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు ఆమె భర్తతో సునీతకి గుండెకి సంబంధించి...

బాబా మళ్లీ మళ్ళీ హనుమాన్ చాలీసా పఠించమన్నారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై న్యాయవాది ఎస్ సుబ్బారావు 1946 జూలై పదిహేడవ తేదీన మరల అస్వస్థతకి గురయ్యారు. ఉదయం నిద్రనుండి లేవడమే జ్వరంతో లేచాడు. అంతకు ముందురోజు కూడా వంట్లో బాగుండక పోవడం వలన కేవలం ద్రవ ఆహారమే తీసికున్నారు. ఆ రాత్రి నిద్రపోయేముందు బాబాని ధ్యానించి బాబా కృపనర్దించాడు. బాబా ఆయన ప్రార్దనని మన్నించి స్వప్న సాక్షాత్కారమిచ్చి హనుమాన్ చాలీసాను మళ్ళీ మళ్ళీ పఠిస్తూ వుండమన్నారు. ఒక్కో...

స్వప్న దర్శనంలో విభూతిని తినమని బాబా అతనికి చెప్పారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై1942 జూన్ మాసం లో గూటికి చెందిన న్యాయవాది ఎస్. సుబ్బారావు తరచు విపరీతంగా తల తిరిగేది. ఈ కారణం చేత ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయే పరిస్థితి ఏర్ఫడింది. అరవై ఆరు సంవత్సరాల వయసులో ఇలా జరగడం వలన బయటకు వెడితే పడిపోతారేమొనని భయపడాల్సివచ్చింది. కర్రపట్టుకుని నడిచే ప్రయత్నం చేద్దామనుకున్నారు, కానీ అదికూడా రెండుమూడు సార్లు కర్రవున్నా రోడ్డుమీద పడడంతో పనిచెయలేదు. దాంతో...