ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.
1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు చేరాను. మా అమ్మ్గగారిల్లు స్టేషన్ దగ్గరే. పిల్లలను సముదాయిస్తూ నాలో నేను కుమిలి పోతూ గడుపుతున్న రోజులవి.మామూలు మనిషిని కాలేక పోతున్నాను. కానీ పిల్లలభవిష్యత్తు కోసము నన్ను నేను సమాధానపరుచుకొని బ్రతకవలసి వస్తున్నది. ఇంకా ఉద్యోగము కూడా ఇవ్వలేదు ఆర్మీ వాళ్ళు.
అలాంటీ రోజులలో ఒకరోజు గది లో విచారంగా నాలోకములో నేను వున్న సమయములో ఒక గొంతు హిందీ లో ఏదో అడుగుతున్నది. బయట మా పిన్ని గారు ఏదో చెబుతున్నట్లుగావుంటే బయటకు వచ్చాను. ఒక భిక్షుకుడు మావాల్లను టీ కావాలని అడుగుతున్నాడు.వాళ్లకు హిందీ అర్ధం కాక ఏమిటని అడుగుతున్నారు. ఆ కారం చూస్తే పాతగుడ్దలతో సాయిబాబా లా వున్నారు. కానీ నాకప్పటికి సాయిగురించి పెద్దగా వివరాలు కానీ ,భక్తి కానీ లేవు. కాకుంటే యాచిస్తున్నాడు కదా అని ఉండు మాయింట్లోవున్నాయి పెట్టిస్తాను అనిలోపలకు పోబోయాను. మరి నాకిస్తే అక్కడ నాకోసం కాచుకున్నవారికి కావాలికదా? కనుక కొద్దిగా టీపొడిఇవ్వు అన్నాడు. తెచ్చి ఇచ్చాను.మరి చక్కెర కావాలి కదా? అన్నాడు.కొద్దిగా పొట్లం కట్టి తెచ్చాను. బేటీ ఇవి కాగపెట్టాలి కదా ఒక చిన్న గిన్నెఇవ్వు అన్నాడు.తెచ్చి ఇస్తున్నాను.మా సంభాషణ హిందీ లో సాగుతున్నా మా పిన్ని కి అర్ధమవుతున్నందున పాలువద్దా అన్నది వెటకారం గా. వద్దు మేము డికాక్షన్ కాచుకుని తాగుతాము అన్నాడాయన.వెళ్ళి పోయాడు.
మరలా ఒక అర్ధగంటకు వచ్చి నేనిచ్చిన పాత్ర తిరిగిచ్చాడు. మా ఆవిడకు కావాలి ఒక చీర ఇవ్వు అన్నాడు. ఒక చీర దండెం మీదనుంచి తెచ్చి ఇచ్చాను. అప్పూడు నెనొక్కదాన్నే వున్నాను. ఆయన నన్ను చూస్తూ నువ్వు నాకోసం ఇన్నిచ్చావుకదా ? మరి నెను కూడా నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకేమొద్దు లే వెళ్ళు అన్నాను[మనసులో కొద్దిగా భయం. ఈ సన్యాసులు లాంటివాళ్ళు ఏమి మోసము చేస్తారో అని.] కాదు ఇదిగో చూడు తీసుకోఅని ఆయన నాచేతిలో తనగుప్పిటనుంచి ఏదో పెట్టాడు. నాకసలే భయం గావుంది. కానీ మాట్లాడ లేకపోతున్నాను. అమ్మ నువ్వు దీన్నిక్కడ వద్దు లోపలికెళ్ళీ నీ దేవుని మందిరం లోపెట్టి చూడు అన్నాడు. లోపలకెళుతూ గుప్పిటవిప్పాను. గుప్పున పూలపరిమళం గుభాళించింది. చేతిలో పూలు. చూసావా అన్నారు. ఏమీ లేవు పూలు అన్నాను నేను పెద్దగా .కాదు పూలకింద వున్నదాన్ని చూడు నిన్ను రక్షిస్తుంది దాన్ని భద్రంగా దాచుకో అని పెద్దగా చెప్పాడాయన. ఇదేదో మాయలాగున్నది ఇదినాకొద్దు నీది నువ్వే తీసుకో అని చెప్పి ఇద్దామని బయటకొచ్చాను. కానీ అక్కడాయన లేరు. ఒకవేళ మళ్ళా స్టేషన్ వైపు వెళ్లాలన్న కనీసం రెండు నిమిషాలు పడుతున్నది. కానీ కనుచూపు మేర ఆయన కనిపించలేదు.గుప్పిటలో ఒక తాయెత్తులాంటి వస్తువు వున్నది భయం తో దాన్ని తీసుకెళ్ళీ దేవునున్పటాలముందు పడవేశాను.
ఆ తరువాత మనసుకు కాస్త ఉపశమనముగాను జీవితము మీద పిల్లలమీద ప్రేమ పెరిగాయి బాధ్యతలు నిర్వర్తిమ్చగలననే గుండెనిబ్బరము పెరిగాయి. తరువత గుర్తుకొచ్చి ఎన్ని సార్లు వెతికినా ఆమహాను భావుడిచ్చిన తాయెత్తు కనపడలేదు. వారు సాయిబాబా అనే నమ్మకము నాకుకలిగినది. తరువాత వారిని పూజించసాగాను. నాకు ఆర్మీ లోనే యు.డి,సి. గా పోస్ట్ ఇచ్చారు. సికిందరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ముగ్గురు పిల్లలు పెద్దవాల్లయి దేశరక్షణ కోసం వున్నారు. ఇద్దరికి పెళ్ళిల్లు చేశాను. నా ఇష్టదైవమయిన లలితాదేవితో పాటు,సద్గురువు సాయినాధుని గురువుగా మార్గదర్శకునిగా సేవిస్తుంటాను.......
No comments:
Post a Comment