Thursday, March 24, 2016
అమృతతుల్యమగు బాబా పలుకులు......
దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పరు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే ధ్యానిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినారో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరయితే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం అహంకారం లేశమైన లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి. ఓం సద్గురు సాయిరాం ॐ 🌿
No comments:
Post a Comment