Total Pageviews

Thursday, March 24, 2016

అమృతతుల్యమగు బాబా పలుకులు......

దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పరు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే ధ్యానిస్తూ నా గురించే దీక్షతో...

Wednesday, March 23, 2016

ఎంతెంత దయ నీది ఓ సాయి

ఎంతెంత దయ నీది ఓ సాయిఎంతెంత దయ నీది ఓ సాయినిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయ నీది ఓ సాయిఎంతెంత దయ నీది ఓ సాయినిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయ నీది ఓ సాయిఎంతెంత దయ నీది ఓ సాయి తొలగించినావు వ్యాధులు ఊధితోవెలిగించినావు దివ్వెలు నీటితోతొలగించినావు వ్యాధులు ఊధితోవెలిగించినావు దివ్వెలు నీటితోనుడులకు అందవు నుతులకు పొంగవునుడులకు అందవు నుతులకు పొంగవుపాపాలు కడిగేసే పావను గంగవు ఎంతెంత దయ నీది ఓ సాయిఎంతెంత దయ నీది ఓ సాయినిన్ను ఏమని పొగడను...

జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా...

మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా...

Monday, March 21, 2016

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే...

షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, ఆ నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి...

Wednesday, March 2, 2016

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల.

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు...

నను దీవించు సాయి! నను దీవించు సాయి

🌹🌻🌹ఓం శ్రీ సాయి నాథాయనమః 🌹🌻🌹 నను దీవించు సాయి! నను దీవించు సాయినీ శిశువును దీవించు సాయినా మొరలను వినుమునాలో భక్తిని స్దిరపరచుము సాయినను దీవించు సాయి! నను దీవించు సాయి నా భాదలు తీర్చుము సాయిఆనందము నాలో చిలుకుమునా పాపాల ప్రార్ధన వినుము సాయినన్ను దీవించు సాయి! నను దీవించు సాయి సాయి నామమే జీవనము సాయి స్మరణమే ప్రార్ధనముసాయి ఆరాదనలే ఆనందము సాయి పలుకులే కీర్తనముసాయి దర్శనమే భాగ్యము సాయి లోకమే స్వర్గము సాయినను దీవించు సాయి! నను దీవించు...

సాయి నామంతో సుఖశాంతులు....!!

భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా. సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు. ఒక...