కుషాల్ చంద్ ఇంటినుండి నదికి ఆవలి ఒడ్డున వున్న గుర్రపు బగ్గీ ని ఎక్కేందుకు బయలుదేరారు. బాబా వెంట వామన్ రావు వున్నారు. “వామన్యా! సరిగ్గా నావెనుకాలే నడువు, నీ చేతులను నా నడుము చుట్టూ వేసి గుర్రంలాగా నడువు” అని బాబా వామన్ రావు ని ఆదేశించారు. వెంటనే వామన్ రావు బాబా ఆదేశాన్ని పాటిస్తూ బాబా వెనుకకు వెళ్ళి, తన చేతుల్ని బాబా నడుము చుట్టూ వేసారు. బాబా ముందుకు నడుస్తూ వుంటే వామన్ రావు వెనుక కొద్దిగా వంగుని గుర్రంలాగే నడువ సాగారు. కొంతదూరం నడిచిన తర్వాత వామన్ రావు ఒక ఫకీరు శరీరం బాబా పాదాల దగ్గర పడివుండడం గమనించాడు. ఆ శరీరం తలనుండి బొటనవేలు వరకు ఒక ఆకుపచ్చని బట్టలో కట్టబడివున్న ఒక శవం. ఆ శవాన్ని చూసిన వామన్ రావు పైశాచికుడైన ఒక ఫకీరుని బాబా సంహరించి వుంటారని భావించాడు. పశువుల్ని మేతకు తీసికి వెడుతున్న మిషతో వెళ్లి ఎందరో రాక్షసుల సంహరించిన శ్రీ కృష్ణుని లీలలు వామన్ రావు కు గుర్తుకు వచ్చాయి. ఆ సమయంలో వారి తో బాటు దీక్షిత్, నర్వేకర్ లు వున్నా కూడా ఈ సన్నివేశాన్ని చూడకపోవడం ఆశ్చర్యకరం. అప్పుడు బాబా వామన్రావుతో “ఇప్పుడే నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలి బొంబాయి కి తిరిగి వెళ్లిపోవాలి, ఈ ఫకీరు రాధాకృష్ణ మాయి ని చంపివేసాడు, చూసావా! ఆ ఫకీరు శవం ఇక్కడే నా కాళ్లదగ్గర పడివుంది” అన్నారు. వామన్రావు షిరిడీ కి చేరుకున్న సమయానికి అతని స్నేహితుడు వైకుంఠభాయి వామన్రావు బొంబాయి తిరిగి తీసికుని పోవడానికి వేచి వున్నాడు. ఆ విధంగా ఆ ఇరువురూ బొంబాయికి వెళ్లిపోయారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత రాధాకృష్ణమాయి దేహం చాలించినట్లుగా వామన్రావు విన్నారు.
“అమ్మ అవతారం చాలించింది” అని దీక్షిత్ చెప్పినట్లుగా వామన్రావు పేర్కొన్నారు. ’ఆమె ఈ భువిపై అవతరించిన లక్ష్యం పూర్తిఅయింది. అందువలన ఈ భూమి మీద ఆమె ప్రస్థానం ముగిసి పరబ్రహ్మలో విలీనమైంది’ అని దీక్షిత్ వామన్రావుతో అన్నారు. బాబా తన మాయతో రాధాకృష్ణమాయి సృష్టించారు, ఆమె ఈ లోకంలోకి రావడం తిరిగి వెళ్లిపొవడం అనేవి బాబా అధీనంలో వున్నవిషయాలు, ఆమె కార్యం ముగిసిన వెంటనే ఆమె ఆత్మను భగవంతునికి సమర్పించుకుంది.
మాయి నిష్క్రమణ గురించి రేగే మాట్లాడుతూ “బాబా ఒకరోజు లెండీబాగ్ నుంది వచ్చి సరాసరి ద్వారకామాయికి వెళ్లారు. మాయి ద్వారకామాయి నేలని కడిగే పని ని అప్పుడే ముగించుకుని ఒక అచేతనావస్థలో వున్నట్లుగా వుంది. బాబా ఆమెని వెనుకనుండి తట్టి బాధపడవద్దని అన్నారు. ఈ సంఘటన జరిగిన రెండు నెలలకు అమ్మ దేహాన్ని చాలించింది. నేను షిరిడీకి ఎక్కడ వుండాలో తెలియకుండానే వెళ్ళాను. సరాసరి మసీదుకి వెళ్లాను, బాబా నన్ను దీక్షిత్ వాడాలో వుండమన్నారు. శ్యామా మరియూ తదితర భక్తులూ నాకు సంతాపాన్ని తెలిపారు. బాబా మమ్ముల్ని పిలిచారు, మా సంభాషణ గురించి అడిగారు. ’ఈ మూర్ఖులకి ఏమి తెలుసు? ఆమె మీకూ నాకూ కూడా తల్లి. ఆమె ఈ కర్మబంధాలనుండి విముక్తి పొందాలనుకుంది, నేనామెకు అభయమిచ్చాను, ఒకరోజు రాత్రి ఆమె నాదగ్గరకు వచ్చింది, ఇంక వేచి వుండలేనంటూ, ఇదిగో ఇక్కడ లోపలికి వెళ్లిపోయింది ( అంటూ బాబా తన కఫ్నీని ఎత్తి తనగుండెను చూపారు) ఆమెను మీరెప్పుడు చూడాలనుకున్నా ఇక్కడ మీరు చూడవచ్చు” అన్నారు బాబా. దివ్యమైన నా తల్లి ప్రభువులో లీనమైంది. ప్రజలు వారి వారి ఇష్టాను సారం ఏమైనా అనుకోనీయండి. ఆమెకి నేనెంతో ఋణపడి వున్నానన్న సంగతిని నేను ఎప్పటికీ మరిచిపోను. శ్రీ మహల్సాపతి, శ్రీ హెచ్. ఎస్. దీక్షిత్ లు కూడా ఆమెపట్ల పూజ్యభావన కలిగియుండేవారు. నేను సత్సంగాత్యంలో వున్నానని భావిస్తాను” అని పేర్కొన్నారు.
ఈరోజు సంస్థాన్ ఇంత వైభవంతో వుంది అంటే అది ఆయి అంకితభావంతో కష్ణపడి చేసిన కృషికి ఫలితం. శ్రీ సాయిబాబా పల్లకి మరియూ రధాల వైభవాన్ని భక్తులు అనుభవించగలుగుతున్నారు
No comments:
Post a Comment