శిరిడీ సాయిబాబా బోధనలు.........
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణూః
గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
‘గు’ అంటే చీకటి, అజ్ఞానం. ‘రు’ అంటే వెలుగు, జ్ఞానం. తన వద్దకు చేరిన శిష్యూని మనస్సులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును చూపించే వాడు గురువు. అందుేక గరువు సృష్టి. స్థితి, లయ కారులైన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరులు ఏకరూపం దాల్చిన పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనబడినారు. శిరిడీ సాయిబాబా సద్గురువు, గురువులకు గురువు. ఆత్మసాక్షాత్కారాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు. బ్రహ్మజ్ఞానం పొందినవారు, సమాజానికి దూరంగా ఉంటూ, ఏకాంతంలో కాలం గుడుపుతుంటారు. భవ బంధాలతో సంబంధాలను వదల్చుకొంటారు.
శిరిడీ సాయిబాబా అటువంటివారు కాదు. బ్రహ్మ జ్ఞాని అయినా, సమాజంలో ఉంటూ ప్రజలందరితో కలసి మెలసి, వారి సాధక బాధకాలను గ్రహిస్తూ, వారి క్షేమం కోసం పరితపిస్తూ, మంచి మార్గాన నడవడం కోసం సముచిత బోధనలు చేస్తూ, తన మాటల విలువకోసం, విశ్వాసం కోసం కొన్ని అద్భుత కార్యాలను చేసి చూపించారు.ఆయన భూతభవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని గుప్పిట బట్టినవారు. బాబా జీవితమూ, బోధనలూ, ప్రవర్తనలూ, చేసిన కార్యాలూ అన్నీ నవరస సమ్మిశ్రీతమనపిస్తాయి. సాధారణ మానవునిలో, సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి, ఏయే పరిస్థితుల్లో ఏవిధంగా బహిర్గతమవుతుంటాయో, శక్తు లను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజాశ్రేయస్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే.సముద్రంలో ప్రయాణం చేసే వారికి మార్గదర్శకంగా ఉండేవి - ఎత్తయిన దీపస్తంభాలు. ఆ దీపస్తంభాల నుం డి వెలువడే వెలుగు, ప్రయాణీకులకు తామేదిశగా పోతున్నామో, ఎటువైపు పోవాలో సరైన మార్గమేదో తెలియజేస్తుంది. శిరిడీ సాయిబాబా అలాంటి ఉన్నత దీపస్తంభం లాంటివారు. బాబా గాథలూ, బోధనలూ ప్రపంచమనే మహాసముద్రంలో పయనించే వారందరికీ మార్గనిర్దేశం చేస్తాయి. జీవనసాగర యాత్రను సులభతరం చేస్తాయి.
శిరిడీ సాయిబాబా గాథలు, బోధనలు మన చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించేటప్పుడు దేహ స్పృహ ను, అహంకారాన్న ద్వంద్వ భావాలనూ నిష్ర్కమించే టట్లు చేస్తాయి. అవి ఆశ్చర్యాన్నీ, అద్భుతాలనూ మన కనుల ముందు ఆవిష్కరిపంజేస్తాయి. మనోవికలత పొందిన వారికి, విచార గ్రస్తులకు, శాంతిని సమకూర్చి ఆనందం కలిగిస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధినీ కలుగజేస్తాయి. బాబా ప్రబోధాలను విని, వానిని మననం చేసుకుంటే, భక్తులు కోరుకొనే అష్టాంగ యోగ ప్రావీణ్యం, ధ్యానానందమూ పొందగలరు.శిరిడీ సాయిబాబా వంద సంవత్సరాలప్పుడు అందరి ముందు తిరుగాడిన సజీవమానవతామూర్తి, ‘మనుష్యు లై పుట్టినందుకు సత్యం తెలుసుకొన్నప్పుడే జన్మసార్థక మవుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలసి ఒకటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుంది. అప్పుడు ‘నేను’ అనే అహంకారం తొలగిపోతుంది. మనకు దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహించడం దొంగతనం అవుతుంది. ఎక్కువ గ్రహిం చకపోవడం అపరిగ్రహం. ఇది వేదాంత నియమం’
- సాయి సూక్తి.
ఆయన భూతభవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని గుప్పిటబట్టినవారు. బాబా జీవితమూ, బోధనలూ, ప్రవర్తనలూ, చేసిన కార్యాలూ అన్నీ నవరస సమ్మేలనమనపిస్తాయి. సాధారణ మానవునిలో, సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి, ఏయే పరిస్థితుల్లో ఏవిధంగా బహిర్గతమవుతుంటాయో, శక్తులను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజాశ్రేయస్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే.
వెలుగును ఇచ్చే దీపం అంటే సాయిబాబాకు చాలా ఇష్టం. దేవాలయాలలోనూ, మసీదులోనూ పుష్కలంగా దీపాలను వెలిగిస్తుండేవారు. ఆ దీపాలకు కావలసిన నూనెను శిరిడీలోని వర్తకులను అడిగి తెస్తుండేవారు. అలాతెచ్చిన నూనెను ప్రమిదలలో పోసి అందులో ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉండేవారు. ఆయన రాత్రులందు పాడుబడిన మసీదులో పడుకొనేవారు. అక్కడ రాత్రంతా దీపాలు వెలుగుతుండేవి. ఒకరోజు వర్తకులందరూ మాట్లాడుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని కట్టడి చేసుకొన్నారు. బాబా వారిని నూనె అడిగి లేదనిపించుకొని, నవ్వుకొంటూ మసీదుకు చేరాడు. సాయంత్రం దీపపు ప్రమిదలలో ఒట్టి ఒత్తులను మాత్రమే పెట్టాడు. డొక్కు పాత్రలో నీళ్ళు పోసి ఆ నీటిని పుక్కిట పడుతూ ప్రమిదలలో ఉమ్మివేయసాగాడు. బాబా ఉమ్మి నీటితో ఉన్న ఒత్తులను వెలిగించాడు. బాబా చర్యలను వర్తకులు గుట్టుగా గమనించసాగారు. బాబా నీటితో వెలిగించిన దీపాలు రాత్రంతా, తెల్లవారే వరకూ వెలుగుతూనే ఉన్నాయి. వర్తకులకు తమ తప్పు తెలిసి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే బాబా వద్దకు వచ్చి ‘క్షమించండి’ అని వేడుకొన్నారు.
అప్పుడు సాయిబాబా పైసూక్తి వారికి తెలిపాడు. క్షమాగుణం సత్ప్రవర్తనకు, సత్వర్తనకు మార్గదర్శకమవుతుందని తెలిపాడు.భక్తులకు బాబా దానం గురించి బోధించారు. ఇలా బోధించడానికి ప్రత్యేక కారణం, తాత్విక చింతనా ఉంది. ‘ధనమందు గల అధికేచ్చనూ, అభిమానాన్నీ పోగొట్టి భక్తుల మనస్సులను శుభ్రపరచడానికి దక్షిణరూపంలో ధనం మొదలైనవి గ్రహించాలి’. అలా పుచ్చుకొన్న దానికి వందరెట్లు తిరిగి ఇవ్వాలనేది ధర్మం.సాయిబాబా అలాగే ప్రవర్తించారు. అందుకు ఎన్నో సంఘటనలు, భక్తులెందరో ప్రత్యక్షంగా అనుభవించారు. గణపతిరావు బోడెస్ అనే గొప్ప నటుడుండేవాడు. అతడిని ఒకరోజు బాబా గడియ గడియకూ దక్షిణ అడిగే వాడు. ఇది అతనికి ఇబ్బందిగా తోచి తన దగ్గర అప్పుడున్న ధనపు సంచిని బాబా ముందర కుమ్మరించాడు. దీని ఫలితంగా ఆనాటి నుండీ అతడు జీవితమంతా ధనానికి లోటు లేకుండా గడిపాడు. ఈ సంగతిని ఆయనే తన జీవితచరిత్రలో వ్రాశాడు. దక్షిణ అనేది ధన రూపంలో కాకుండా మరో విధంగా కూడా ఉండేది. బాబా దర్శనం కోసం వచ్చిన ప్రొఫెసర్ జి.జి. నార్కే ‘ప్రస్తుతం నా దగ్గర దమ్మిడీ కూడా లేద’ని అన్నాడు.
బాబా అప్పుడు ‘ఆ సంగతి తెలుసు. మరో రకమైన దక్షిణ అడుగుతున్నాను నేను, నీవిప్పుడు యోగవాసిష్టం అనే గ్రంథం చదువుతున్నావు కదా! దాని నుండి నాకేదైనా ఇవ్వు చాల’న్నాడు. దీని భావం ఏమంటే ‘గ్రంథం నుండి నీవు నేర్చుకొన్న విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకో. అలా చేయడమే నాకు దక్షిణ ఇచ్చినట్లవుతుంది’.
‘మనుష్యులై పుట్టినందుకు సత్యం తెలుసుకొన్నప్పుడే జన్మసార్థకమ వుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలసి ఒకటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుంది. అప్పుడు ‘నేను’ అనే అహంకారం తొలగిపోతుంది. మనకు దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహించడం దొంగతనం అవుతుంది. ఎక్కువ గ్రహించకపోవడం అపరిగ్రహం. ఇది వేదాంత నియమం’ - సాయి సూక్తి.
No comments:
Post a Comment