బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ
ఒక టీచరు తరగతిలో ఉన్న విద్యార్ధులందరికీ పాఠాలు చెప్తుంది. అందులో కొందరు విద్యార్ధులు టీచరు చెప్పిందల్లా చేస్తారు, చక్కగా రోజు హోంవర్క్ చేస్తారు, తరగతిలో మౌనంగా ఉంటారు, ఎవరితోనూ గొడవపడరు. కొందరు బాగా అల్లరి చేస్తారు. హోంవర్క్ చేయరు, చదవరు. అందరితోనూ గొడవపడతారు. కాకపోతే రోజుకు పదిసార్లు పొగుడుతున్నారుకోండి, టీచరు ఎవరిని ఇష్టపడుతుంది?......... తన చెప్పినట్టుండే వారంటే ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది. ఆకతాయిల మాటలను పట్టించుకొకపోగా, అవన్నీ వట్టిమాటలని కొట్టిపారేస్తుంది.
దేవుడు కూడా అంతే.తన చెప్పినట్టు జీవించకుండా, నిత్యం ఎన్ని పూజలు చేసిన పెద్దగా పట్టించుకోడు. తను చెప్పిన మార్గంలో నడిచేవారు, తన చెప్పినట్టుగా జీవించేవారి పట్ల అమితమైన ఇష్టం చూపిస్తాడు, నిరంతరం అనుగ్రహం ప్రసరిస్తాడు. వారు ఒక్క నమస్కారం చేసినా పొంగిపోతాడు.
షిరిడీ సాయినాధుడు సద్గురువు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి మానుషరూపంలో భూమికి వచ్చిన మహాపురుషుడు.
షిరిడీ సాయినాధుడు సద్గురువు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి మానుషరూపంలో భూమికి వచ్చిన మహాపురుషుడు.
బాబా జీవితమే ఒక సందేశం. అందరిని ప్రేమించమన్నారు, దీనులను ఆదరించమన్నారు. బాబా రోజు బిక్ష యాచించి, తీసుకువచ్చి ఒకపాత్రలో వేసి పశుపక్ష్యాది జీవులకు ఆహారంగా అందిచేవారు. సర్వ జీవుల యందూ దయకలిగి ఉండమన్నారు.
రోగంతో ఉన్నవారిని డబ్బు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం మాట సాయమైన చేసి ధైర్యం ఇవ్వచ్చు. వారికి మనం ప్రేమను పంచవచ్చు. అసహ్యనించుకోకుంటే చాలు. ఇంతకంటే మన నుండి బాబా ఏమి ఆశిస్తాడు చెప్పండి.
మరి మనం చేస్తున్నదేంటి? మన చుట్టు నిత్యం అనేక జీవరాశులు నీరు, ఆహారం లేక మరణిస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. మనం రోజు వాటికి కాసిన్ని నీరు త్రాగడానికి అందుబాటులో పెట్టలేమా? మిగిలిపోయిన అన్నం చెత్తబుట్టలో పడేస్తాం కదా. అలా వృధా చేసేకంటే మన ఇంటిముందున్న వీధికుక్కకు ఆ అన్నంలో కొంచం పాలో, మజ్జిగో కలిపి పెట్టచ్చు కదా. వాటి మీద కాసింత ప్రేమ చూపించవచ్చు కదా. ఊర్లో ఉన్న అన్నిటికి పెట్టక్కర్లేదు, మన పరిసరాల్లో ఉన్నవాటి జీవనానికి సాయపడచ్చు.
ఇలా బాబా మనకు చెప్పిన సందేశాలను ఆచరించి ఒక్కసారి బాబా ముందుకెళ్ళి నిల్చుని "నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నా బాబా" అని చెప్పండి. ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషిస్తాడు. మనస్ఫూర్తిగా చేస్తే ఆశీర్వదిచడమే కాదు, తప్పకుండా దర్శన భాగ్యం కూడా ఇస్తాడు. ఇచ్చి తీరుతాడు.
మనం బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ "సహనం, శ్రద్ధ". ఆయన మార్గంలో మనస్ఫూర్తిగా నడవడమే ఆయనకు ఇచ్చే గౌరవం.
ఓం శ్రీ సాయినాధాయ నమః
No comments:
Post a Comment