Tuesday, September 30, 2014
Saturday, September 27, 2014
SAI SANNIDHI - Baba Monthly Magazine --------Oct-14
Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online.
క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link
Sunday, September 21, 2014
I am sharing one of his leela in my life.
I am SAI's devotee since my childhood. My entire family loves & worships him.Though I am not a regular follower of any blog, I will read his stories whenever I feel low or lonely.
I have already shared couple of experiences of me & my family in few blogs.This experience is 2 month old. I promised him that I will post my experience, if my problem gets solved and forgot about it. My sincere apologies to the LORD SAINATH MAHARAJ for being ignorant about posting my experience.Finally after two months , with the Grace of LORD I am writing this on the auspicious day of SRAVANA PURNIMA. I was in financial problems. I have taken 2 big amounts from my friends. They had purchased land, and asked me to return the amount. I have tried my best in all possible ways but not able to arrange the amount in time as I promised. I was keep on postponing the dates but finally it was time for land registration. I had applied for personal loan also but even it got delayed. I was in the office at 7 PM and literally in tears. Immediately I have opened one blog , started reading one devote experiences and left my worries to our beloved LORD. By the time I finished the story, I got the message about loan amount credited to my account. Thankyou for the kindness LORD. Please show your mercy on us. We might make some mistakes knowingly on unknowingly , please forgive us and help us in all ways. Samartha Sadguru Sainath Maharaj ki JAI
Thanks!
Thursday, September 18, 2014
Wednesday, September 17, 2014
భక్తి ఉన్నచోటే భగవంతుని నివాసం
భక్తి ఉన్నచోటే భగవంతుని నివాసం...........
జీవితంలో సాధించాలనుకున్నవి సాధించలేకపోవడానికి నిద్ర, బద్దకం ప్రధాన కారణాలని సద్గురు సాయిబాబా ఉద్బోధించారు. నిద్రకు మనిషి బానిస కారాదనీ,అతిగా నిద్రపోవడం,అసలు నిద్ర లేకపోవడం రెండూ జబ్బులేనని బాబా స్పష్టం చేశారు.మనం ఏవిషయంలోనైనా రాజీపడతామేమోకానీ,నిద్ర విషయంలో రాజీపడం.అవసరమైన సమయంలో నిద్రపోకపోవడం, అకాలనిద్రలో గడపడం రెండింటివల్లా అనర్ధాలు ఉన్నాయి. అందుకే బారెడు పొద్దెక్కేవరకూ నిద్రపోరాదనీ,సూర్యభగవానుడు ప్రత్యక్ష్యమయ్యే సమయానికి కాలకృత్యాలు తీర్చుకుని ఆయనకు అర్ఘ్యం సమర్పించాలని పాతతరానికి చెందిన వారు ఇప్పటికీ ఉద్బోధిస్తూ ఉంటారు. అతిగా నిద్రపోతే సూర్యభగవానునికి కోపం వస్తుందనేది హెచ్చరిక కావచ్చు,కానీ, సూర్యోదయం దాటిన తరువాత నిద్రపోతే శరీరం మనం చెప్పిన మాట వినదు. రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే, వేకువ జామునే లేచి మన పనులు పూర్తి చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల మాటలు చాదస్తపు మాటలుగా అనిపించవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవి దివ్యౌషధాల వంటివి. ఉదయం వేళల్లో మనసు ప్రశాంతంగా ఉం టుంది.ఆ సమయంలో దైవ ధ్యానం చేస్తే మనసులో దేవుని రూపం స్థిరంగా నిలుస్తుంది. మనసు మన అధీనంలో ఉంటుంది. అందుకే, ఉదయం ప్రార్ధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. భక్తి ప్రాధాన్యాన్ని గురించి సద్గురు సాయిబాబా ఎక్కువ బోధించేవారు. నాకు పూజలు, షోడశోపచారాలు,అష్టాంగయోగాలు అవసరం లేదు. భక్తి ఉన్న చోటే నా నివాసం. భక్తినిండిన హృదయంలో నాకు చోటు ఇవ్వండి. నేనక్కడ శాశ్వతంగా కొలువై ఉంటాను' అని బోధించారు. ఇవి సాధారణమైన మాటలుగా కనిపించవచ్చు, లోతుగా ఆలోచిస్తే ఎంతో పారమార్థికం ఉంది.భక్తి లేకుండానే మనం పూజలు చేస్తున్నాం. భక్తి లేకుండానే మనం ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ పరుల కోసమేనని వేరే చెప్పనవసరం లేదు. భక్తి మనకూ, దేవునికీ మాత్రమే పరిమితం కావాలి తప్ప బహిరంగ ప్రదర్సన కారాదు.ఆధునిక కాలంలో అంతరంగ భక్తి కన్నా, బాహ్యమైన భక్తికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.సాయిబాబా ఉపదేశం సారాంశం ఇదే.తనను దగ్గరగా చూడాలని ముందుకు తోసుకుని వచ్చిన వారి కన్నా, దూరంగా కూర్చున్న వారిని ఉద్దేశించే ఆయన మాట్లాడేవారు. సాయిసచ్ఛరిత్రలో ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. తమ మనసులో ఉన్న దానిని బాబా ఎలా కనిపెట్టారా అని వారు ఆశ్చర్యపోయేవారు. బాబా సర్వాంతర్యామి అనీ,ఆయనకు తెలియని విషయం ఏమీ లేదని ఆ తరువాత వారు తెలుసుకుని వారిని శరణుజొచ్చారు.
ఇతరేతర విషయాలపై ఆలోచనలు పెట్టుకుని దేవుని పటం ముందు, సద్గురువు ముందు కూర్చుని భక్తిని ప్రదర్శించేవారికి బాబా చురకలంటించేవారు. దైవ సన్నిధానంలో, గురువు సన్నిధానంలో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, ధ్యానం చేసేవారే బాబా కృపకు పాత్రులవుతారు. ....సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

Tuesday, September 16, 2014
OM SAI RAM Sai Baba Udi The Best Medication
Anonymous Devotee from India says: My mother is handicapped by birth. She has no fingers in one of her legs. She has always been walking without shoes or socks since her childhood days. She used to be a very confident woman and was earning very well. She underwent an open heart surgery due to some complication and she took voluntary retirement in the year 2000. She has been under medication since then and by Baba’s grace she is fine.
I delivered a baby boy 3 months back. My mom had been long complaining about the swelling in her handicapped leg and one day she found it difficult to even walk. After my mom’s sister forced her to go to the doctor, she went and heard that there has been a serious infection and it had to be operated. After the operation she went for daily dressing. When the wound was about to heal, the doctor again found another place where the infection was spread. Again she opened up the wound and cleared the infection. This was never ending and all of us got majorly worried. She developed complications in few other areas as well. Her doctor had advised her to take scan and said it could possibly affect the heard since she suspected a block in her leg nerve.
I couldn't stand it anymore since she was very upset and she was restricted not to carry the baby and that she had been helpless. I went to Baba temple. Got His Udi and applied it on the painful area. We were very surprised to know the pain had vanished the next morning. The scan report also showed normal results. It does not end here. She developed a very bad swelling on her other leg. Doctor advised my mom to visit her heart surgeon to check if there is any problem is related to heart with a list of tests. I again asked mom to apply Baba's Udi with utmost faith. She applied and kept praying for her recovery soon. In 2 days the Udi miracle worked. The swelling gradually reduced and her heart surgeon said everything is absolutely normal. Udi really had impact on my mom’s recovery. Utmost belief in Sai Ram helped us and we will always love Him and trust Him.
Baba is very kind and merciful
Baba is very kind and merciful...he wont let his children suffer..... he warned through the dreams which are as real as living experience....We cannot keep on doing wrong acts and say Baba is anyways there with us....We cannot take his grace for granted ...May baba bless all and bring everybody on right path ..Baba please forgive me for my wrong doings...Even I took your grace for granted many a times...But I have learnt my lessons and I promise…”
Wednesday, September 10, 2014
శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

బాబా వారిభౌతికశరీరము మన దృష్టినుండి నిష్క్రమించెను, గాని వారి యనంత స్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియేయుండును. ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగినలీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్తలీలలు జరుగుచున్నవి. దీనినిబట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందక ముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు ఇప్పుడుకూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కినవారిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినచో, దానిని మనః పూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను.
పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుగుకొని మనమే ప్రయాణము సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధినమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరుపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. ఇదియే అద్వైతభజనము లేదా పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల, గురువు నామమును జపించుట వలనను, వారి స్వరుపమునే మనమున నుంచుకొని ధ్యానించుటచేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మన కది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. "మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది."
ఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీరూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతోదూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగిలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన-శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరాణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.
ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తనయిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరానిరూపమున నుండును. కథవల్ల నేర్చుకొనవలసిన నీతి :- బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక, వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగాభావించెడివారుశ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో, గత యెన్నో జన్మల విచారమును నశింపజేసి యెంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగు లెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారినుండి వినుడుభగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును.
ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమన ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను. ఇతరులతోగల సంబంధములన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తన కెవరితోనైన శత్రుత్వమున్నయెడల దానినుండి విముక్తినిపొందవలెను. ఎవరికైన ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణము గాని, శతృత్వశేషముకాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును.
సద్గురుని లక్షణములు
ఎవరు మనకు వేదవేదాంతములను, షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవితపరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపరసుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు జేసెదరో యెవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తకజ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడ పొంది యున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యుల కెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందయినను శిష్యులనుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్యలక్షణమేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకు గాని చెందరు, తమ పాండిత్యమునకు వారు గర్వించరు, ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.
హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను. బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, స్నేహితులుగాని, యిల్లుగాని, ఎట్టి యాధారముగాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగి యుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతికశరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధిచెందిన పిమ్మటకూడ తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన - భక్తివిశ్వాసములనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దానియెదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేని యెడల చదువుటగాని, వినుటగాని, నేర్చుకొనుటగాని నిష్పలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనినిగూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ; అదే మోక్షమునకు మార్గము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుద కతడు రక్షింపబడును. సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారకి సర్వస్యశరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మాకర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట, తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నింటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగ మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. . బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వాదమే
బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చీకాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు, నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"
బాబా చెప్పినదాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. "మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునం దుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమం దుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైనవానిని జూచుటకొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమాన ముండనిచ్చినచో, చావుపుట్టుకల చక్రమునశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా, మనస్సును స్వాధీనమందుంచుకొన వలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేర గలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు."
భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయీ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందనవృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంతఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగ జేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.
సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చెప్పెను. బాబా యిట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొనవేల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును."
సద్గురు సాయియొక్క గొప్పదనము
శ్రీ సాయి సమర్థునకు సాష్ఠాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందు కూడ వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపమువరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లుచేసెదరు.
ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనెడు కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్లు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంషయములును గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వాడు (నాశనముచేయువాడు). సాయిభక్తులకు దానివల్ల భయమేమియుండదు. ఈమహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగ దాటించెదరు.
ప్రార్థన
మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనులకొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక. నీవు దప్ప మరేమియు కోరకుండు గాక. ఈ సత్ చరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదెముగాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక.
ఫలశ్రుతి
ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమునుగూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని దర్శించి, సాయి సత్ చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధకలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయు చున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రమునుండి తప్పించుకొనవలెనన్నచో సాయికథలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము, వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయికథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్తసంగతులను గ్రహించగలవు. వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణస్వరూపుమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపముద్వారా పోయినచో నీప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారియందు లీనమయినచో సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తినమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపద లన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో, శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంధమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీ రామనవమినాడు, దసరానాడు (అనగా బాబా పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినయెడల వారల కోరిక లన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసినయెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.
ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!
మీకు కూడ మేము నమస్కరించి మీ కొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు, ప్రతినెల, మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కథల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము, సాయిబాబా కలుగచేసి, మీచే సేవ చేయించి, మీ కుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసికొని సుఖపడవలెను.
ప్రసాద యాచనము
దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును, భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తథాస్తు.

Tuesday, September 9, 2014
శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు
ఓ సద్గురుసాయీ! నీవు
పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము
కలుగజేసితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల
నాశ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చిన వారిని
ఉదారస్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు,
వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయగు ద్రవసారము
బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి
యాత్మారాముడే, స్వచ్ఛమైన దైనికానందమునకు వారు
పుట్టినిల్లు. జీవితేచ్చ లన్నియు పొందినవారై, వారు
భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి. యుగయుగములకు శాస్త్రములు
వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరముగములో యజ్ఞము,
కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానము
లన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు
భోజనము దొరకనిచో మనము చాల బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులుకూడ నట్లే బాధ
పడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్న
వారికి, భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు.
తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. “ఆహారమే
పరబ్రహ్మస్వరూపము, ఆహారమునుండియే సమస్తజీవులు
ఊద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును. ” మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతరదానములు అనగా ధనము,
బట్టలు మొదలగునవి యిచ్చు నపుడు కొంత విచక్షణ కావలెను. కాని
యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరువచ్చినను
వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి,
రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట
ఆరోగ్యవంతులకు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మంచి
యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు
లేని నక్షత్రములవలె, పతకములేని కంఠాహారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెఱువువలె,
భక్తి లేని భజనవలె, కుంకుమబొట్టు లేని
పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని మజ్జిగవలె రుచించవు.
షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే
నివసించుచు, తిరుగుచు, మసలుచు
తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను
బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలాదూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాల
చిన్నగ్రామము, సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప
ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలుకూడ
ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు
స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి,
విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను.
1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు
సర్వస్యశరణాగతి చేయవలెను.
2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను.
3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారి దనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును.
గురు వజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు.
బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము.
జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చిచెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతముగూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లుతెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సత్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి యసలయిన నిర్గునస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు “నేను సామాన్య నికృష్ట జీవుడను.” అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొను శిష్యుని గురువు “నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నిత్యాంతభ్రమ అనేక జన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు
1. నేను జీవిని (ప్రాణిని).
2. శరీరమే యాత్మ (నేను శరీరమును).
3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు.
4. నేను దేవుడను కాను.
5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట.
6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.
ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుటకొరకే’ బాబా యింకను ఇట్లనెను.
1. ప్రణిపాత మనగా శరణాగతిచేయుట, 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీ కృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానుల నాశ్రయించు మననేల?
సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తేలిసి యుండుటచే, వారినిగూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను

2. శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి.
తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి
వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను
వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును
ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని
కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ
శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే
భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను
3.
“నన్నే
గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని,
రైలుగాని, విమానముగాని యవసరములేదు.
నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి
సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్
బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా,
రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా
ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి
యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును
పాలించ వచ్చు ననుకొనెను.
4.
భక్తులు
పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు
అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది. బాబాకు భూతభవిష్యద్వర్తమానములు
తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల
కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. యెవరికయితే ఆధ్యాత్మిక
విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే గాక వారి కష్టములను దొలగించి
వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును. ప్రతిరోజు
జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచమైనను క్రమము
తప్పక చదువుము. చదువునపుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో భోధపరచి చెప్పుము.
నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి
దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని
యున్నదా?”
5. బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలమో,
మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని
పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు
నశించును. మరణము దాని నైజమును కోలిపోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ
క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా విన వలెను. అది వారి మనస్సును
పావనము చెయును.
6. "అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు.
ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు
మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము
పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని,
బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట
ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు
భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు.
అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే
యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి
బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. యోగులు
శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత
నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. సాయిబాబా
చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా
ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని
వాక్కులు కనుక నెవ్వెరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు
వీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల
చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే
ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము
(సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క
జన్మతోడిదే కాదు, అది కడచిన డెబ్బెదిరెండు జన్మల సంబంధము.
ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై
పోయినట్లనిపించుట వలన వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు
గలదు. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా
విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము
చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు
నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును.
"బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు
హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి
మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు
శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”. బాబా
3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే
పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది,
పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు
లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన
కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము
గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి
చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి
వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము
ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో పూజించువారికిని
అనుభవనీయమయిన సంగతి.
ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.

అమృతతుల్యమగు బాబా
పలుకులు
1. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో
ఈదిగువ మధురవాక్యములు పలికిరి. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు
ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప
మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు
జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము
నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో
నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై
నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు
నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము
లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి
వేడవలెను."
2.
నేను అనగా
నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదుకుటకు
నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో
నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము
లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు."
3. హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు
వినయవిధేయతలతో దైవమును, యోగులను,
భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే
ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో,
ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరిగదా!
బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కలనిలచి
సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన
పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమడ్ పంతు ఇట్లు
ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు
దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు.
Sunday, September 7, 2014
శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు
మరణకాలమున మనస్సునందున్న
కోరికగాని యాలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో
శ్రీకృష్ణు డిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను
జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో,
వారు దానినే పొందెదరు." అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే
మనస్సునందుంచుకొన గలమని నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణములవల్ల భయపడి యదరి
పోయెదరు. కావున అంత్యసమయమందు మనస్సును నిలకడగా నేదో మంచియోలోచనయందే నిలుపవలె
నన్నచో నిత్యము దాని నభ్యసించు టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు
జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణకాలమందు
గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు
సర్వస్యశరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని యిచ్చట
చెప్పెదము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో,
వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే
ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి
దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును. నీ పూర్వపుణ్య
మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని,
జీవిత పరమావధిని కాంచుము
హేమాడ్ పంతు సంసారమును, అశ్వత్థవృక్షముతో పోల్చుచు, గీతలో చెప్పిన ప్రకారము, దాని వ్రేళ్ళుమీదకు
కొమ్మలు క్రిందకు గలవనెను. దాని కొమ్మలు క్రిందవైపు మీదివైపుగూడ వ్యాపించి యున్నవి;
అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ
విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవప్రపంచమువరకు వ్యాపించి యున్నవి.
దాని స్వరూపము గాని దాని యాధారముగాని, దాని యాద్యంతములు
గాని ఈలోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల
అశ్వత్థవృక్షమును నరికి, ఏ యతీతమార్గము ననుసరించిన తిరిగి
జన్మలేదో యట్టిదాని ననుసరించవలెను.
అట్టి దారియందు నడచుటకు, దారి చూపు మంచిగురువు సహాయము మిక్కిలి యవసరము. ఒకడెంత పండితుడై నప్పటికిని వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచిస్థితిలో నున్నప్పుడే, మనము భక్తిమొదలగు సాధనముల నాచరించి దేవుని చేర గలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. ఆహారములో మితి, శరీరమునకు మనస్సునకు కూడ మంచిది. మానవు డిచ్చినది త్వరలో సమసిపోవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే,తే' యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడును లేడు. నాసర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి, ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనవలెను." అనుచున్నాను. నా ఫకీరు చతురుత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగులబాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు ఆతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు.

"ఎవరయితే ఈ మసీదుకు
వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాదపడరు. కనుక హాయిగ నుండుడు. కురుపుపై
ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు,
ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును
ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును." "కర్మయొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టి
వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు
మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి
నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన యహంకారమును
ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని
పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు."
"నేను ఒక రూపాయి
దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే
యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో
వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము
విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము
చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును.
గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ
వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన
మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు
కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును."
శ్రీ సాయిజీవితము మిగుల పావన
మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి. కొన్ని సమయములందు
వారు బ్రహ్మాంనందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి
పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్నిపనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడి
వారు. ఒక్కొక్కప్పు డేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని,
నిద్రితులుగా గాని, కనిపించెడు వారు
కారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముతో
తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు,
కనుగొనరానివి. వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవా రెవ్వరు?
పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల
నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అంద
రెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక!
ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవచేసెదము గాక. వారిని
జీవకోటియందు జూచెదము గాక! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక.
Thursday, September 4, 2014
Shri Sai Baba Archana (108 Names)
21. Aum Anna
Vasthradhaya Namah!
Prostrations to Him, Who is the Provider of Food & Cloths to all.
SAI used to say 'How can I allow My children to fast or starve'. He always said one sinke not worry & waste their life about food & clothing & should repose faith in the Lord's Providence.
SAI contrived to provide cloth to poor maid servant of Kaka Dixit. He made Anandarao Pakhade to gift New Dhoti with silk border to Shama.

22. Aum Arogya
Kshemadaaya Namah!
Prostrations to Him, Who is the bestower of health & welfare of all.
'Arogya' is freedom from diseases & 'Kshema' is all round welfare, peace & plenty. Sai's power to provide these two essential things in human life find abundant mention in Sri Sai Satcharitra & other biographical accounts of Sainath. Besides His divine glances, touch & spoken word, His UDI also acted as panacea for all posts of incurable ailments.
Chanting This Nama 108 times every day removes ill health.

Nama 23.
Dixit was after Sai's Mahasamadhi in debt to the tune of 25000 to a Marwadi, & was spending sleepless nights with great anxiety. He prayed Sai & surprisingly son of his deceased freind came next day to seek his advice as how to invest 25000 he has. When Dixit told about the debt the boy gladly offered the amount to be paid later. Baba used to collect hundreds of rupees towards Dakshina & distributed mong the poor & needy before nightfall.
Annotation to Name 24:
Riddhi is materiial prosperity & siddhi is spiritual perfection.

24. Aum Riddhi Siddhi
Pradaaya Namah.
Prosrations to Him, Who is the bestower of material prosperity & spiritual perfection.

25. Aum Putra Mitra
Kalatra Bandhudaaya Namah!
Prostrations to Him, who is the bestower to grant Children, Friends, Spouse & Kins.
Chapters 6, 14 & 25 of Shri Sai Satcharita narrates instances where children were born to childless couples. Ratanji Wadia, HV Sathe, Sapatnekar, Smt. Aurangabadkar, Mrs Chotubai Pradhan, SB Nachne, GN Shinde, Narayanarao Angre & many others blessed by Sai with Children.
Many instances of unwed men & women obtaining suitable spouses thru' His blessings were on record.
Similarly removing differences between friends, families & couples are reported in many of His biographical literature.

26. Aum Yogakshema
Vahaaya Namah!
Prostrations to Him, Who is the bestower of Safely & Well-being of His devotees.
It is Sai's nature to protect all who seeks His refuge. He considers & loves all beings as His integral part. Due to this oneness He always reaches to help His devotees brushing aside all their faults. As a child is always dear to his mother, all the beings are dear to SAI.

27. Aum
Aapadbaandhavaaya Namh!
Prostrations to Him, Who is the friendly protector of His devotees from danger & distress.
SAI defered explication of this nama today, perhaps, Sai wanted to prove us that Sai & Ganesha, the eradicator of dangers & distress are one & the same.
Once Shama got the news that wife of his younger brother, who stays in nearby Savil Vihir & sought Sai's permission to go there. Bab told him to send Udi & postpone the visit to next morning. Next morning when he reached his brother's house, he was spellbound to see his brother's wife completely cured. Happily returned Shama asked Baba, 'What is this Leela? 1st you create a panic in our lives, then yourself solve the problem.' Sai laughed & said, 'Only God is Supreme. Strange are His ways. I am neither God nor Supreme. I am His Faithful Servnt'. Sai not only saves His devotees from distress, but also gives them courage to face difficulties of life with hope & aspirations.
In Chapter 6, Satcharita He voluntarily treated sick, saved blacksmith's baby & Ch 22 He forewarns about snakes.

28. Aum
Maargabaandhave Namah!
Prostrations to Him, Who is the Friend & Guide of His devotees in their quest to God-realization.
Like a friend, Sai is always present to lead His devotees on the path of virtue, guiding them to attain eternal bliss & self realization. God is Everything. A devotee can think Sai as a Father, Mother, Brother or a Friend. As a true friend Sai always helps His devotees in distress. Like a guide He takes them thru' the right path to the final destination. Mother is a childhood friend & father is a friend in youth.
Literally Sai was the companion of His devotees when they are on crossroads.
Mhalsapati, Chandrorkar, Kaka Dixit etc were led by Sai step by step spiritually.
Chanting This Nama 108 times a day for 108 days every morning would surely show the correct path to those who are in distress.

29. Aum Bhukti-mukti Swargaapavarga Daaya Namah!
Prostrations to Him, Who bestows happiness both
temporal & spiritual, heavenly bliss & liberation.
Bhukti means enjoyment of worldly pleasures, Mukti means liberation from the cycle of birth & death, Swarga means the heavenly bliss & Apavarga means the four objects of Dharma, Artha, Kaama & Moksha, the attainment of which are the goals of every human being.
SAI promoted the temporal as well as the spiritual welfare of all beings who took refuge @ His Lotus Feet. Though many prayed Sai for wealth, prosperity, children, cure from diseases, there were few like Mhalsa, Kaka Dixit, Swamy Sai Saranand, BV Narasimha Swamy longed for Sai 's Grace only.

30. Aum Priyaaya Namah!
Prostrations to Him, Who is extremely dear to us.
Sai, is an embodiment of Pure Love - the love that charge the heart & soul of His devotees, who consider Him as their beloved. He is their beloved father, mother, kin, Sadguru & God. He signified the esoteric love that permeates all their hearts. As Sadguru, His relation with His devotees is based on the unflinching foundation of intense love, the bond of mutual love that subsists between the Guru (Preceptor) & his Sishya (Disciple).