శ్రీషిరిడిసాయిబాబావారి పవిత్రమయిన ఊదీ మహత్యం
శ్రీ షిరిడీసాయిబాబావారి ఊదీ ఎంతో పవిత్రమయినది. సాయిబాబా దేవాలయాలలో ఏర్పాటు చేసిన ధునిలో కట్టెలను కాల్చగా వచ్చిన భస్మమే ఊదీ. సాయి దేవాలయాలలో ఆయన సమక్షంలో ధునిలోనించి వచ్చినది కాబట్టే దానికంత పవిత్రత. అది ఎంతో శక్తివంతమయినది. రోగాలను కూడా నయం చేయగలిగినటువంటి శక్తివంతమైనది.
శ్రీషిరిడీ సాయిబాబావారు ఊదీతో ఎన్నో వ్యాధులను నయం చేశారు. సాయిబాబా మందిరాలన్నిటిలో ఊదీని ప్రసాదంగా భక్తులందరికీ పంచుతున్నారు. ఊదీని మనం నుదిటికి రాసుకొన్నపుడు శిరోభారం తగ్గటమె కాక శిరస్సుకు సంబంధించిన సమస్యలన్నీ నివారణవుతాయి.
బాబాను మనస్ఫూర్తిగా నమ్మి ఉదీలో ఆయన అనుగ్రహపు జల్లులను కురిపించమని ప్రార్ధన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సాయిబాబా ఊదీతో ఎంతోమందికి ప్రమాదకరమయిన రోగాలనెన్నిటినో నివారణ గావించారు.
బాబాని పూర్తిగా నమ్మితే అతిప్రమాదకరమయిన జబ్బులు కూడా ఊదీతో నయమవుతాయి. నిజంగానే కనక బాబా మీద నమ్మకంతో శరీరం మీద బాధ ఉన్న ప్రదేశంలోకాని, రోగగ్రస్తమయిన ప్రదేశంపై గాని ఊదీని రాసుకుంటే దాని ప్రభావంతో నివారణవుతుంది.
సాయిని వేడుకొంటూ చేసే ప్రార్ధన
బాబాకు అసాధ్యమన్నది ఏదీ లేదు. ఊదీని నీటిలో కలిపి సాయి చరణాలవద్ద ఉంచి ఈవిధంగా ప్రార్ధించండి.
"సాయీ! ఈఊదీ నీటిపై మీదివ్యశక్తులను ప్రసరింప చేసి నాలో ఉన్నటువంటి వ్యాధులను నివారణచేయండి" అని ఆనీటిని త్రాగండి. అనేక సందర్భాలలో ఎంతోమంది రోగులకు క్యాన్సర్ వ్యాధులను, ప్రాణాంతకమయిన వ్యాధులను నయంచేసి రక్షించారు. ఆయన ఆత్మ నిరంతరం సంచరిస్తూ మన యోగక్షేమాలను చూస్తూ మనలని రక్షిస్తూ ఉంటుంది. ఆయనమీద ప్రగాఢమయిన విశ్వాసాన్ని నిలుపుకోండి. జరిగే అద్భుతాలు మీకు అవగతమవుతాయి.
శ్రీసాయి సత్ చరిత్ర చదవండి. మీజీవితంలో జరిగే లీలలు ఆయన ఆశీస్సులు మీరే తెలుసుకొంటారు. శ్రీషిరిడీసాయిబాబాను ప్రార్ధిస్తూ ఉండండి. సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.
No comments:
Post a Comment