Friday, July 11, 2014

మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు…….

మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు…….
గురు బ్రహ్మ గురుర్ విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నా
ను అని
ఈ సంస్కృత శ్లోకం అర్ధం.
గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ నమస్కారములు.

ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి ని "గురు పౌర్ణమి" గా జరుపుకుంటాం. ముని శ్రేష్ఠుడుడైన వ్యాస మహాముని జన్మ తిధి కూడా ఈరోజే. అందుకనే ఈ రోజుని "వ్యాస పౌర్ణమి" అని కూడా పిలుస్తారు. త్రిమూర్తి స్వరుపులకు మహాగురువు వేద వ్యాసుడు.. మహా భారతం ధర్మ మార్గంలో పయనించేలా చేసిన వేదవ్యాసుడు తరతరాలకు గురువయ్యారు. అలాగే బ్రహ్మ సూత్రాలను రచించడం ద్వార ఆయన ఆధ్యాత్మిక గురువయ్యారు. పద్దెనిమిది పురాణాలను రచించడం ద్వార చారిత్రక గురువయ్యారు. ఇలా మన కలియుగం లోని వారందరికీ వేద వ్యాసుడు తోలి గురువయ్యారు. అందుకే ఈరోజుని "వ్యాస పౌర్ణమి" గా పిలుస్తాం. జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులని పూజిస్తాం.

అసలు గురువు అంటే ఏంటి?? "గు" అంటే అజ్ఞనాంధకారం అని అర్ధం.. "రు" అంటే అజ్ఞానాన్ని నిరోధించేది అని అర్ధం.. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడని అర్ధం.
జీవితానికి మార్గ నిర్దేశనం చేసే వారు, ముక్తి మార్గం వైపు నడిపించే వారు, తత్వ జ్ఞానాన్ని ప్రసాదించేవారు, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుతురూ చూపించే వారు, సన్మార్గం వైపు నడిపించే వారు వీరందరూ గురువులే.. మనం భగవంతుని చేరాలంటే ముందుగా ఆ జ్ఞానాన్ని పొందాల్సింది గురువు దగ్గరే.. గురువే మనకి అనుసందాన కర్త. ఈరోజు జరుపుకొనే "వ్యాస పౌర్ణమి" చెప్పిన సారంశం కూడా ఇదే..

ప్రతి ఒక్కరికి తల్లి తోలి గురువు. బుడి బుడి అడుగులు వేసే సమయంలో.. ఓనమాలు దిద్దించే సమయంలో తండ్రి గురువు, ఆ తరువాత జ్ఞానాన్ని భోదించే ఉపాధ్యాయుడు గురువు. అందుకే అమ్మ నాన్నాల తరువాత అంతటి ప్రాదాన్యం గురువులకి ఇచ్చాం. శిష్యులు లేని గురువులు ఉండవచ్చు కాని గురువు లేని శిష్యులుండరు...

ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు.. "వ్యాస పౌర్ణమి" రోజున వ్యాసుడిని పూజించాలి కదా.. మరి సాయి బాబాను ఎందుకు పూజిస్తున్నాం అని... ఎందుకంటే సాయిబాబా సమర్ధ సద్గురువు కాబట్టి.. మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెబితే, అలా జీవించి చూపిన మహోన్నత వ్యక్తి సాయిబాబా. సమత, మమత, ప్రేమ లాంటి మానవతా భావానల గురించి భక్తులకి చెప్పిన అవధూత సాయిబాబా. అన్ని మతాలూ సమతం అని భోదన చేసినవారు అయన. "ఆత్మవత్ సర్వభూతాని" అనే భగవద్గీత తత్వాన్ని చూపించి మనవ రూపంలో ఉన్న దేవుడిగా భక్తులందరికీ ఆదర్శ ప్రాయుడైన గురువుగా నిలిచారు బాబా. బాబా భోదనలు మనో వికాసాని కలిగిస్తాయి. ఉత్తమ లక్షణాలను అలవారుస్తాయి కూడా. అదే సాయి తత్వం. అందుకే గురు పౌర్ణమి రోజున సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అయిన ఆ బాబా ని ఆరాదిస్తారు
.

No comments:

Post a Comment