చాలా మంది గురువారం సాయినాథుని దర్శించనిదే ఏ
పని మొదలుపెట్టరు. అందుకే ప్రతి వాడ వాడన సాయిబాబా మందిరాలు ఎన్నో
వెలిశాయి. అయితే ఆంథ్రప్రదేశ్‌లో మొదటి సాయిమందిరం ఎక్కడ వెలిసిందో
తెలుసా...
ఇది కృష్టాజిల్లా విజయవాడలో.
ఈ మందిరం 1947 ఆగస్టు నెలలో కృష్ణలంకలోని భ్రమరాంబపురంలో నిర్మించారు.
రాంపిళ్ళ లక్ష్మణరావు గారి చేతుల మీదుగా ఈ గుడి ప్రతిష్ఠాపన జరిగిందని
చెప్తారు. ఈ ఆలయంలో సిమెంటుతో చేసిన బాబా విగ్రహం 5.4 అడుగుల ఎత్తు
ఉంటుంది.
1990 తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ మరింత పెరగటంతో
ఆయయపునర్మిణా చేయవలసి వచ్చింది. అలా 1992లో గుడి పుణనిర్మాణం జరిగింది.
భక్తులు బహుకరించిన పాలరాతి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు.
ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది.
ఆలయంలో విశిష్ట పూజలు జరిగే రోజులు
సంవత్సరం పొడుగునా భక్తులతో కళకళలాడే ఈ మందిరంలో ప్రతి గురువారం భక్తులు
వెల్లువల వస్తుంటారు. అలాగే ప్రత్యేక రోజులైన గురుపూర్ణిమ రోజు బాబాకు
అన్నాభిషేకం జరుగుతుంది. విజయదశమి రోజు బాబా సమాధికి విశేష అలంకరణ
చేస్తారు. దీపాలతో హారతి సమర్పించి, పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఇక ఆంగ్ల
నూతన సంవత్సరాది నాడు ఆలయం రాత్రంతా తెరిచే ఉంటుంది. తెలుగు సంవత్సరాది
ఉగాది నాడు బాబాకు సహస్ర జ్యోతిర్లంగార్చన వైభవంగా జరుపుతారు.అలాగే
మాఘమాసంలో సాయివ్రతం, సహస్ర జ్యోతిర్లింగార్చన ఇక్కడ విశేషంగా జరుపుతారు.
No comments:
Post a Comment