Friday, April 18, 2014

బాబాతో మధురక్షణాలు---------సాయిపుత్రి



బాబాతో మధురక్షణాలు కొన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను. బాబా సంకల్పము లేనిదే షిరిడి వెళ్ళలేము.ఆయన సేవ చెయ్యలేము, కనీసము నామము కూడా పలుకలేము. బాబా తన ఒడిలో చేరిన బిడ్డలను తిరిగి ఇంటికి చేరేదాక ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఈలీల వలన మీకు అర్దమవుతుంది.

షిరిడి వెళ్ళినప్పుడల్లా 4రోజులు ఖచ్చితముగా ఉంటాను. నేను ఒక్కదానే ఎలా వెళ్ళాలా అని అలోచిస్తుంటే  అంతలో నా చెల్లి షిరిడి వస్తానంది.తను బాబాకి గొప్ప భక్తురాలు. మొదటిసారిగా తను నాతో షిరిడి వస్తుంది. హైదరాబాద్ నుంచి షిరిడికి ట్రావెల్స్లో బస్సుకి టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడ నాలుగురోజులు ఉందామని ప్లాన్ చేసుకున్నాము. ట్రావెల్స్ వాళ్ళు వెళ్ళినరోజు ఉండటానికి రూము ఇస్తారు తరువాత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి డబ్బు కట్టాలి. మేము ఒకరోజు ఉండి తరువాత సంస్థాన్ వసతిగృహములో రూము తీసుకుందమనుకున్నాము. బుధువారము రాత్రి బయలుదేరి గురువారము ప్రొద్దున్నే షిరిడికి చేరినాము. నేను అంతకముందు షిరిడి వెళ్ళానుగాని నాకుకూడా పూర్తిగా తెలియదు. షిరిడి వెళితే రోజంతా బాబా గుడిలోనే గడుపుతాను. గురువారము బాబా దర్శనము చేసుకున్నాము. రోజంతా దర్శనము చేసుకుంటానే ఉన్నాము. పల్లకి ఉత్సవము కూడా దర్శించుకున్నాము. బాబాని చూడగానే ఇన్నిరోజుల నిరిక్షణకి ప్రతిఫలము దక్కినంత ఆనందం కలిగింది. ఏటుచూసినా బాబా చిత్రపటాలు, విగ్రహాలు చూసేసరికి ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయాము. అక్కడ ప్రతిరేణువలోను, దూళిలోనూ బాబానే కనిపించేవారు. అక్కడంతా బాబా ప్రేమతో నిండిపోవడము వలన ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది. గుండెల నిండా ఆనందం నింపుకోని రూముకి వచ్చాము. తరువాతరోజు రూము ఖాళీచేసి సంస్థాన్ వసతిగృహాములో రూము బుక్ చేసుకుందామని వెళ్ళాము

అక్కడ రూల్స్ మాకు తెలియవు. కేవలము అమ్మాయిలకి రూములు ఇవ్వమని చెప్పారు. కావాలంటే లాకర్ ఇస్తామన్నారు. మేము ఇద్దరము సందిగ్దములో పడ్డాము. హొటల్కి వెళ్ళి ఉండటానికి మా దగ్గర డబ్బులు సరిపోవు, ఏమి చెయ్యాలో తెలియలేదు. ట్రావెల్స్ హొటల్ క్యాంటీన్ నడిపించే ఒకావిడ నాకు బాగా పరిచయము. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకున్నాము. ఆవిడ హోటల్ వాళ్ళతో మాట్లాడింది. అప్పటికే అక్కడ రూములు బుక్ అయిపోయినాయి. ఆవిడ రాత్రి రూములో ఉండేటట్టు పొద్దునే ఖాళి చేసేటట్టు మట్లాడింది. మాకు చాలా సంతోషమనిపించింది. మేము పగలు ఎలాగో గుడిలోనే ఉంటాము, కేవలము రాత్రి మాత్రమే మాకు ఉండటానికి కావాలి. బాబా మాకు తగినట్టుగానే సహయము చేసినారు. మా దగ్గర డబ్బులు లేకపోవడము వలన బోజనశాలలోనే తిందామనుకున్నాము. ప్రోద్దున్నే ఆంటీ వచ్చి మాకు టిఫిన్ పెట్టింది. కనీసము మా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఒక అమ్మ తన బిడ్డలని చూసుకున్నట్టు చూసుకుంది. రాత్రి మేము వచ్చేవరకు ఎదురుచూచేది. మేము రాగానే బోజనము పెట్టేది. 4రోజులు బాబానే మాకు ఇవన్ని ఏర్పాటు చేసారు. మాకు ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బాబా చూపిన లీలా షిరిడి వెళ్ళినప్పుడల్లా గుర్తొస్తుంది.

బాబా ప్రేమమూర్తి,దయామయుడు,భక్తవత్సలుడు. తల్లిలాగ,తండ్రిలాగ తన దగ్గరికి వచ్చిన భక్తులను కంటికిరెప్పలాగ కాపాడుతుంటాడు. మనము కేవలము ఫ్రేమతో సహనము పాటించాలి. బాబా కేవలము ప్రేమకు ఆధీనుడు. అందరికి చెప్పెదేమిటంటే బాబాపై నమ్మకముంచండి. అయనే మిమ్మలిని ముందుకి నడిపిస్తారు. రక్షకుడిగా నిలుస్తారు.



ఇట్లు,

సాయిపుత్రి

No comments:

Post a Comment