ఒకసారి ఒకతను సాయివద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును
ప్రసాదించమని వేడుకొనగా సాయి బ్రహ్మమును(ఆత్మ దర్శనము) చూచుటకు(పొందుటకు)
ముఖ్యమైన విషయములను ఈ క్రింది విధముగా చెప్పెను.
- బ్రహ్మమును చూచుటకు పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు అహంకారములను సమర్పించవలెను.
- సుఖములను లక్ష్య పెట్టరాదు.
- కీర్తి విషయములందు అనాసక్తుడై మెలగవలెను.
- దృష్టిని లోనికి పంపి లోనున్న ఆత్మనే ధ్యానించవలెను.
- తప్పుడు మార్గము వదలవలెను.
- సత్యములు పలుకవలెను.
- వేదాంత విషయములు ఎంచుకోవలెను.
- మనస్సును చంచలము కానివ్వక జాగ్రత్త పడవలెను. అనగా మనస్సును స్వాధీనమునందుంచుకొనవలెను.
- విధులను తృప్తిగా ఫలాపేక్షరహితముగా నిర్వర్తించవలెను.
- అహంకారము విడువవలెను.
- మనస్సు కోరికలను విడిచిపెట్టి దేహమే నేనను భ్రమను కూడా వదలవలెను. లేని యెడల బంధములో చిక్కు కొనవలసి వచ్చును.
- ఆత్మ సాక్షాత్కారము పొందిన గురువు సహాయము యిందులకు చాలా అవసరము.
- భగవంతుని కటాక్షము ఎంతో అవసరము.
No comments:
Post a Comment