Sunday, March 23, 2014

బాబా తో అనుభూతులు -----అంజలి

 


నా పేరు  అంజలి విజయవాడ నేను హైదరాబాద్ లో ఉద్యొగం చేస్తున్నాను నాకు దేవుడి మిద నమ్మకం వుండేది కాదు దేవుడు లేదు అని అందరితో వాదించే దాన్ని నేను హైదరాబాద్ రాకముందు నాకు బాబా గురించి కొంచం తెలుసు
కానీ అంత నమ్మకం లేదు  నేను హైదరాబాద్ వచ్చాక ఉద్యొగం కోసం చాల ప్రయత్నం చేశాను కానీ నాకు ౧౫ రోజుల వరకు ఉద్యొగం రాలేదు .నన్నుమా ఇంట్లో అమ్మ నాన్న తిరిగి వచ్చేయమన్నారు నేను బాబా దగ్గర బాబా నువ్వు నిజంగా భక్తుల కోరికలు తీరిస్తే నాకు 2 రోజులలో ఉద్యొగం వస్తుంది లేకుంటే రాదు అని కోరుకున్నాను నాకు 2 రోజులలో ఉద్యొగం వచ్చింది అప్పటినుంచి నేను బాబాను నమ్మడం కన్నా బాబాను ప్రేమించడం మొదలు పెట్టాను
నా రూమ్ లో ఎటు చుసిన బాబా ఫొటోస్ ఉంటాయి నేను ప్రతి రోజు బాబా గుడి కి ఉదయం & రాత్రి ఆరతికి  హాజరయ్యేదాన్ని
4 సం నుండి వెళ్తున్నాను నేను వెళ్ళే వరకు ఆరతి మొదలు కాదు కోసం బాబా ఎదురు చూస్తుంటారు నేను చాల బాధలు అనుభవించాను మా నాన్న గారు మద్యనే చని పోయారు (18/11/12) మా నాన్న గారు అంటే నాకు చాల ఇష్టం అప్పుడు నేను బాబా ను కొట్టాను చాల ఏడ్చాను బాబా ఎందుకు ఇలా చేసావు అని చాల బాధ పడ్డాను మా చుట్టాలు అందరు నువ్వు బాబా బాబా అని గుడికి వెళ్తావు ని బాబా ఏమి చేసాడు అని అన్నారు ?
నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చే ద్దామ అని ఏడ్చేదాన్ని బాబా ని చూసి 15 రోజులు అయింది నేను గుడి కి వెళ్ళకూడదు మా నాన్నగారి తిది అయ్యేవరకు బాబా నిన్ను చూసి చాల రోజులు అయింది బాబా నాకు ఎవరు లేరు నువ్వు కూడా నాకు లెవా వుంటే కలలో కనిపించు అని అడిగాను నాకు తెలుసు బాబా కనిపించరు అని ఎందుకంటె ఇంతకముందు కలలో కనిపించి కొన్ని విషయాలు చెప్పారు
అవి ఏమిటి అంటే మా ర్చి 2012 తెల్లవారుజామున ఉదయం 4 గం కు నాకు కలలో కనిపించి నేను ప్రతి రోజు గుడికి వెళ్తాను కదా అలాగే కలలో కూడా ఉదయం ఆరతి 6.15 కి  వెళ్ళాను వెళ్ళేటప్పటికి బాబా విగ్రహం సగం విరిగి వుంది నేను అది చూసి చాల బాధ పడ్డాను బాబా ఏంటి నీకు ఈ పరిస్థితీ ఎందుకు ఇలా జరిగింది అని ఏడ్చాను నేను అక్కడ విభూది పెట్టుకుందాం అని వెళ్ళాను బాబా అక్కడ కుర్చుని తల మోకాళ్లమిద పెట్టుకొని వున్నారు ఏంటి బాబా మీరు ఇక్కడ వున్నారు అని బాబా మిద చేతిని వేసాను బాబానా  వైపు చూసారు బాబా ఏడుస్తున్నారు బాబా ఏంటి మీరు ఎందుకు బాధ పడుతున్నారు అని అన్నాను దానికి బాబా ఇక్కడ స్వార్ధం పెరిగి పాయింది స్వార్ధం వున్నచోట నేను ఉండను అని చెప్పారు దానికి మీరు ఏమి చేయగలరు బాబా అన్నాను నువ్వు ఏమి చేయలేవా  నువ్వు ఏమి చేయలేవా  అని గట్టిగ అరిచారు నాకు చాల భయం వేసింది
బాబా నన్ను క్షమించండి బాబా మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మాములుగా కనిపించండి నేను సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను నేను రాత్రి హరతికి వెళ్ళాను వేరే విగ్ర హం పెట్టారు అది కూడా బాబా పిచ్చిగా నవ్వుతున్న విగ్రహం పెట్టారు ఏంటి బాబా మీకు ఈ పరిస్థితి అని అనుకున్న బాబా నేను అంటే మీకు ఇష్టం వుంటే ఉదయం వచ్చేసరికి ఎప్పుడు వుండే విగ్రహం వుండాలి అని అనుకోని వెళ్ళిపోయాను ఉదయం హరతికి వచ్చాను  అప్పుడు ఎప్పుడు వుండే విగ్రహం వుంది హమ్మయ్య నా బాబా నాకు వచ్చేసారు అని చాల సంతొషం గా అనిపించింది హారతి అయిపోయిందిబాబా వస్త్రం తీసీ అభిషీకం చేస్తున్నారు అప్పుడు చూసాను విగ్రహాన్ని అతికించి పెట్టారు నేను దర్శనంచేసుకోవడానికి బాబా ఎదుటకు వెళ్ళాను అప్పుడు బాబా నా వైపు చూసి నీకు చెప్తేఅర్ధం కాదా ఇక్కడ స్వార్ధం పెరిగింది స్వార్ధం వున్నా చోటు నేను ఉండను అని చెప్పానా  అని గట్టిగా అరిచారు బాబా కనుల వెంట రక్తం కారింది నాకు చాల భయం వేసింది నాకు మేలకువ వచ్చింది
నేను ఉలికి  పది లేచి టైం చూసాను 5  గం లు అయింది నాకు ఏంటి పిచ్చి కల వచ్చింది అని భయపడ్డాను అమ్మో బాబా కి ఏమైండో  ఉదయం గుడికి తొందరగా వెళ్ళాలి అని మరల  భయపడ్డాను గుడికి రోజు వచ్చే అమ్మాయికాల్ చేసింది
( నేను సాయి బాబా గుడి స్నేహితులందరికీఒక రింగ్ టోన్ పెట్టాను రింగ్ టోన్ బాబా నువ్వు మావలె మనిషివి నీకు మరణం వుంది అనే సాంగ్ పెట్టాను )నేను ఉలికి పడి లేచాను అమ్మో టెంపుల్ నుండి కాల్ వచ్చింది ఏమైంది అని పోనే లిఫ్ట్ చేసి బాబా ఎలా వున్నారు అని అడిగాను అప్పుడు ఆమె ఏమైంది అక్క మీకు ఎందుకు బాధ పడుతున్నారు  నాకు అర్ధం కావడం లేదు బాబా కి ఏమి కాదు అనింది నేను అప్పుడు కల గురుంచి ఆమె కి చెప్పా ను నువ్వు త్వరగా గుడి కి వెళ్లి చూడు నేను వస్తాను అని అన్నాను
వేరే ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పను గుడి కి వెళ్ళాలంటే
భయం వేస్తుంది అన్నాను ఏమి కాదు నువ్వు రా అని మా ఫ్రెండ్ చెప్పింది నేను గుడి మెట్లు ఎక్కుతూ బాబా నాకు వచ్చిన కల నిజం అయితే
రోజు నువ్వు తెల్ల డ్రెస్ లో కనిపిస్తావు లేకుంటే అది పిచ్చి కల అని కొట్టి వేస్తాను అని అనుకోని వెళ్ళాను చూసేటప్పటికి బాబా పింక్ కలర్ లో కనిపించా  రు అందరికి కల గూర్చి చెప్పిన ఏమి కాదులే అన్నారు ఇంకా కల గూర్చి వదిలేసాను


రాత్రి హారతి 8 గంటలు మొదలుఅవుతుంది నాకు ఆ రోజు ఆఫీస్ లో లేట్ అయింది  5 నిమిషములు  ఆటే గా హారతి కి వెళ్ళాను
అప్పుడే బాబా కి వస్త్రం మర్చి వుంది తెల్ల వస్త్రం లో బాబా కనిపించా రు నాకు చాల భయం వేసింది  అప్పుడు పుజారిని అడిగాను బాబా కు ఎందుకు వస్త్రం మార్చారు ఒక్కటే వస్త్రం ఉంచుతారు కదా అప్పుడు పూజారి గారు లేదమ్మా ఎవరిదో పుట్టిన రోజు అంట ఇది కట్టమన్నారు నేను రేపు కడతాను అని చెప్పినా వినలేదు ఇప్పుడే కట్టండి దయ చేసి అని బ్రతిమాలారు అందుకని వస్త్రం మార్చాను అని అన్నారు అప్పుడు నేను బాబా ని మీరు నేను ఎంత అడిగినా  కల లోకి రావద్దునేను  అని బాధ పడినా  కల లోకి రావద్దు అని గట్టిగా చెప్పా ను
అందుకే మా తండ్రి చనిపౌయి నపుడు ఎంత అడిగినా నాకు బాబా కలలో కనిపించ లేదు ఆలాగే బాబా మన కోరికలు ఎలా నేరవేరుస్తారో మనము కుడా అలాగే బాబా కోరిక నెరవేర్చాలి అనుకున్న బాబా ఇక్కడ స్వార్ధం పెరిగింది అన్నారు కదా దానికి నేను ఇక్కడ స్వార్ధం తెసేస్తాను దానికి మీరు నాకు సహయం చేస్తారు కదా అని అడిగాను గుడి లో వున్నవారందరికీ బాబా నాకు ఇచ్చిన కల గూర్చి చెప్పా ను కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు విననివారికి బాబానే  తెలిపా రు ఇప్పుడు బాబా సేవ అందరు మంచిగా చేసుకుంటున్నారు స్వార్ధం చూపించడం లేదు నేను బాబా కోరికను కొంచమయిన నేరవేర్చాను అని అనుకుంటున్నరు బాబా ఆశిస్సులతోనేను బాబా భక్తులకు చేపీది ఏమిటంటే స్వార్ధం వున్నా చోటు బాబా వుండరు స్వార్ధాన్ని పారద్రోలాలి అన్రారిని చిరునవ్వుతో మార్చాలి అనేది నా ఉద్దేశం మీరు కుడా మారుతారు కదా

నా తెలుగు అనువాదం లో తప్పులు వుంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి
సుకన్య


 

1 comment:

  1. Baba will b every where even he will b in your home also.

    ReplyDelete