Saturday, February 8, 2014

బాబా భక్తుల విశ్వాసాన్ని పరీక్షించుట సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/

బాబా భక్తుల విశ్వాసాన్ని పరీక్షించుట
ఈ లీల చదివిన తరువాత మనకే కనక అటువంటి పరీక్ష ఎదురయితే మన ఆపరీక్షలో నెగ్గగలమా అని అనిపించక మానదు. సాయి అంటే ఎవరు? పూర్తిగా గ్రహించుకున్నపుడే మనం ఆయన పెట్టే పరీక్షలలో విజయం సాధిస్తాము.
సాయి తత్వాన్ని ప్రచారం చేసినవారిలో శ్రీనరసిం హ స్వామీజీ గారు సుప్రసిధ్ధులు. ఆయన 1936 లో శ్రీఉపాసనీ బాబా గారిని దర్శించడానికి వెళ్ళిన తరువాత సాయి అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకొన్నారు. ఆయన ఉపాసనీ బాబా వద్ద ఉన్న సమయంలో మరొక సాయి భక్తుడు కూడా అక్కడే ఉన్నారు.
ఆయన పేరు శ్రీరాం బాబా. ఆయన 141 సంవత్సరాలకు పైగా జీవించారు. ఆ సమయంలో ఉపాసనీ బాబాగారు అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఎంతోమంది ఆ విందుకు హాజరయ్యారు. భోజనాలు మొదలయ్యి యిక పూర్తయే సమయంలో అక్కడికి ఒక ముసలివాడు భోజనం కోసం వచ్చాడు. ఆ ముసలివాడు కుష్టువ్యాధితో బాధపడుతున్నాడు. చూడటానికి భయంకరంగా ఉన్నాడు. అతనికి ఒక్కటే కన్ను ఉంది. అతని పెదిమల నుండి, ముక్కునుండి, కళ్ళనుండి చీము నెత్తురులు కారుతూ ఉన్నాయి. శరీరమంతా పుండ్లుపడి భరించలేని దుర్గంధం వెలువడుతూ ఉంది.
అప్పుడు ఉపాసనీ బాబా శ్రీరామ బాబాతో " ఆ ముసలివాడు స్వయంగా తినలేని పరిస్థితిలో ఉన్నాడు. నీ చేతులతో స్వయంగా అతనికి తినిపించు" అన్నారు.
శ్రీరామబాబా గారు ఆ పరిస్థితిలో ఏవిధంగా దిగ్భ్రమ చెంది ఉంటారో ఊహించుకోండి. శ్రీరామ బాబాగారు తను లేవగలిగినంత వరకూ పైకి లేచి కుష్టువ్యాధితో బాధపడుతున్న ఆముసలి వానికి అన్నం తినిపించడం మొదలు పెట్టారు. రక్తం కారుగున్న అతని పెదాలకి తన చేతులు తగలకుండా జాగ్రత్త పడుతూ తినిపిస్తున్నారు. దాంతో తినిపిస్తున్న దానిలోనించి కింద పడిపోతూ ఉంది. అన్నం తిన్న తరువాత ఆముసలివాడు నడచుకొంటూ వెళ్ళిపోయాడు. అప్పుడే ఉపాసనీ బాబా శ్రీనరసిం హ స్వామీజీ గారితో " కిందపడ్డ ఆ అన్నంతీసుకొని తిను" అన్నారు. రక్తం కారుతున్న పెదాలకు అంటుకొని కలుషితమైన ఆ ఆహారాన్ని తినడమంటే అక్కడున్న వారందరికీ చాలా రోతగా అనిపించింది. కాని శ్రీనరసింహ స్వామీజీ గారికి సర్వం తెలుసు. ఆయన జ్ఞాని. ఆయన ఎటువంటి సందేహం లేకుండా కిందపడ్డ ఆ మిగిలిన అన్నమంతా తినేశారు. అందరికీ చాలా విస్మయం కలిగింది. ఆదృశ్యం చూస్తున్న వారందరితోను ఉపాసనీ బాబా యిలా అన్నారు " ఆముసలివాడు ఎంత వేగంగా వెళ్ళిపోయాడో చూశారా! కుష్టు రోగంతో తీవ్రంగా బాధ పడుతున్న వ్యక్తి ఎవరయినా అంత వేగంగా నడవగలడా?" చీదరింపు కలిగిస్తూ ఒక కుష్టురోగి రూపంలో వచ్చినదెవరో తెలుసా? వచ్చినది శ్రీసాయిబాబా తప్ప మరెవరూ కాదు.
మణీ. ఎస్.
ది ఎటర్నల్ సాయి
బెంగళురు
"నన్ను అన్వేషించడానికి సుదూర ప్రాతాలకు వెళ్లనవసరం లేదు. సకల జీవరాశులలోను నేను నివసిస్తున్నాను. ఈ విషయాన్ని కనక మీరు జాగ్రత్తగా గ్రహిస్తే నా నిజస్వరూపాన్ని తెలుసుకోగలరు"

No comments:

Post a Comment